Movie News

టాక్సిక్ జీవోలు… దాటాల్సిన సవాళ్లు

రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఎట్టకేలకు ఓపెనయ్యాయి. విపరీతమైన ఎదురు చూపులకు తెరవేస్తూ ఏపీ తెలంగాణ జీవోలు బయటికి వచ్చాయి. ఏపీలో ఉదయం ఆరు గంటలకు వేసే ప్రీమియర్ షోకు ఏకంగా 600 రూపాయల టికెట్ ధరకు అనుమతి ఇవ్వగా తెలంగాణలో మాత్రం నో ప్రీమియర్ అనేశారు. ఇరువైపులా సింగల్ స్క్రీన్ ప్రతి టికెట్ మీద అదనంగా 50 రూపాయలు, మల్టీప్లెక్సులు 100 రూపాయలు ఎక్స్ ట్రా వసూలు చేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చేశారు.

అంటే హైదరాబాద్ లో ఆల్రెడీ గరిష్టంగా ఉన్న మల్టీప్లెక్స్ ధర 295 నుంచి 395 రూపాయలకు చేరుకుంటే, ప్రత్యేక వసతులున్న సింగల్ స్క్రీన్ల బాల్కనీ 200 నుంచి 300 రూపాయలకు చేరుకుంటుంది. ఏపీలో కొంత నయం. అక్కడ మల్టీప్లెక్స్ రెగ్యులర్ రేట్ 177 ఉండగా సింగల్ థియేటర్ల బాల్కనీ 105 ఉంది. వీటికి సంబంధించిన ఉత్తర్వులు అధికారికంగా జారీ కావడంతో క్షణాల వ్యవధిలో బుకింగ్స్ అందుబాటులోకి వచ్చాయి. బుక్ మై షో, డిస్ట్రిక్ట్ రెండూ ట్రెండింగ్ లో ఉన్నాయి.

ఇక సవాళ్ల విషయానికి వస్తే ఒక డబ్బింగ్ మూవీకి ఇంతేసి పెంపులేమిటనే ప్రశ్న జనాల్లో ఉన్న నేపథ్యంలో వాటిని సంతృప్తి పరచాలంటే యునానిమస్ టాక్ ఒకటే మార్గం. అది కనక యష్ తెచ్చుకోగలిగితే ఎక్కువ ధర పెట్టినా మాకు న్యాయం జరిగిందని ఆడియన్స్ ఫీలవుతారు. కాంతార, కూలి, వార్ 2కి ఏపీలో పెంచినప్పుడు కొన్నింటి మీద ఎక్కువ నెగటివ్  రెస్పాన్స్ కనిపించలేదు. ఇప్పుడు టాక్సిక్ కు ఏం జరుగుతుందనేది వేచి చూడాలి.

తెలుగు హక్కులు భారీ మొత్తానికి కొనడం వల్లే హైక్స్ తీసుకోవాల్సి వచ్చిందనేది డిస్ట్రిబ్యూషన్ వర్గం నుంచి వినిపిస్తున్న మాట. పెద్ది తర్వాత టాలీవుడ్ ని పలకరించిన హిట్లన్నీ ఎలాంటి పెంపు లేకుండా విజయవంతం అయినవే. మరి టాక్సిక్ వాటికి బిన్నంగా వెళ్తున్న నేపథ్యంలో టికెట్లు కొన్న జనాలకు ఆల్టిమేట్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాల్సిందే. కంటెంట్ కనెక్ట్ అయితే ఇదేమి సమస్య కాకపోవచ్చు. యష్ డ్యూయల్ రోల్ చేసిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కు దర్శకురాలు గీతూ మోహన్ దాస్. 

This post was last modified on August 25, 2026 7:03 pm

Share

Recent Posts

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

1 hour ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

1 hour ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

3 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

5 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

5 hours ago

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

6 hours ago