కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీకి ఊహించని ఘటన ఎదురైంది. ఇటీవల కాలంలో ఆయన యువతను చేరదీసే పనిలో పడిన విషయం తెలిసిందే. జెన్-జీని ఆకట్టుకునేందుకు గత మూడు నెలలుగా వారి సమస్యలను ప్రస్తావిస్తున్నారు. ఇలానే మహారాష్ట్రలోని ముంబైలో నిర్వహించిన విద్యార్థుల సమస్యలపై కార్యక్రమంలో రాహుల్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితో విద్యావ్యవస్థ నాశనం అయిందని ఆయన ఆరోపించారు.
ముఖ్యంగా విద్యార్థులు జాగరూకతతో ఉండడం వల్లే.. ఇటీవల కేంద్ర మంత్రి తన పదవికి రాజీనామా చేశారని రాహుల్ చెప్పారు. భవిష్యత్తులోనూ ఇలానే ప్రశ్నించాలని అన్నారు. ఆయన ప్రసంగం కొనసాగుతున్న సమయంలో కొందరు విద్యార్థినులు.. భద్రతా సిబ్బందిని బతిమాలి.. స్టేజ్ ఎక్కారు. సహజంగా ఇలాంటి సమయాల్లో.. తనతో సెల్ఫీలు తీసుకునేందుకు యువత వస్తున్నారని తెలిసిన.. రాహుల్ గాంధీ కూడా.. దీనిని లైట్ తీసుకున్నారు.
అయితే.. ఇలా స్టేజ్ ఎక్కిన విద్యార్థినిల్లో మరియం అనే విద్యార్థిని సెల్ఫీ ప్లీజ్ అంటూ.. రాహుల్‌కు చేరు వైంది. ఆమెతో సెల్ఫీ తీసుకునేందుకు రాహుల్ కూడా రెడీ అయిన సందర్భంలో అనూహ్యంలో రాహుల్ బుగ్గపై ఆమె ముద్దు పెట్టేసింది. అలానే సెల్ఫీ కూడా తీసేసుకుంది. ఈ ఘటన అక్కడే ఉన్న విద్యార్థిని లను ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే.. రాహుల్ దీనిని లైట్ తీసుకున్నారు. యువత చేరువ కావడం అంటే.. వారి అభిరుచులను కూడా గౌరవించడమేనని తనపై వచ్చిన విమర్శలకు సమాధానం చెప్పారు.
సమర్థించుకున్న మరియం..
మరోవైపు 11 వ తరగతి చదువుతున్న మరియం.. రాహుల్‌కు ముద్దు పెట్టడాన్ని సమర్థించుకుంది. తనకు రాహుల్ గాంధీ అంటే ఎంతో ఇష్టమని పేర్కొంది. విమర్శలు చేసేవారిని తాను పట్టించుకోనని తెగేసి చెప్పడం గమనార్హం. తాను కూడా రాహుల్‌గాంధీలా ఎదగాలని భావిస్తున్నానని.. అందుకే తాను రాహుల్ కు ముద్దు పెట్టానని దీనిలో ఎలాంటి తప్పూ లేదని పేర్కొంది.
భద్రతపై ఆగ్రహం..
తాజా చర్యపై రాహుల్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముద్దు కాబట్టి సరిపోయింది.. ఏదైనా ప్రమాదం సంభవిస్తే.. రాహుల్ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సరైన భద్రత కల్పించడం లేదని ఆరోపించారు. ఈ సందర్భంగా రాజీవ్‌గాంధీ ఉదంతాన్ని గుర్తు చేస్తున్నారు. అప్పట్లో దండ వేస్తానని ముందుకు వచ్చిన మహిళతనను తాను పేల్చేసుకుని రాజీవ్ మరణానికి కారణమైందని.. వారు చెబుతున్నారు. కేంద్రం భద్రతను కట్టుదిట్టం చేయాలని కోరుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates