అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత వివాదాస్పదమైన కామెంట్స్ చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారం సందర్బంగా ఆయన బిర్యానీ మీద చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.
అస్సాంలో నాగావ్ లోక్ సభ ఎంపీ ప్రద్యుత్ బోర్డోలోయ్ అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన దిస్పూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దాంతో నాగావ్ పార్లమెంటరీ స్థానానికి రాజీనామా చేయడంతో ఈ లోక్‌సభ సీటు ఖాళీ అయింది. ఉప ఎన్నిక అనివార్యమైంది.
ఇప్పుడు నాగావ్స్థానానికి ఈ నెల 6 వ తేదిన ఉప ఎన్నిక జరుగుతోంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, కాంగ్రెస్ సీనియర్ ఎంపీ రకీబుల్ హుస్సేన్ మధ్య తీవ్రమైన వాగ్వాదం జరుగుతుంది. నువ్వొకటి అంటే నేను రెండంట అన్న రీతిలో ప్రచారం కొనసాగుతోంది.
రకీబుల్ హుసేన్ను పురాణాల్లోని బకాసురుడితో పోలుస్తూ ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ విమర్శలు చేశారు. బకాసురుడు అంటే ఎక్కువ ఆకలి కలిగిన రాక్షసుడన్న సంగతి తెలిసిందే కదా. దీనికి కాంగ్రెస్ ఎంపీ రకీబుల్ హుస్సేన్ తనదైన శైలిలో స్పందించారు. భగవంతుడు నన్ను ఈ భూమిపైకి బిర్యానీ తినడానికే పంపించాడు, నన్ను ధనవంతుడిని చేశాడు అని వ్యంగంగా వ్యాఖ్యానించారు. దీంతో సీఎం హిమంత తన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. జురియాలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ తల్లిపాలు తాగేందుకు పుట్టినవారు మనుషులని, కేవలం బిర్యానీ తినడానికే పుట్టినవారు జంతువులంటూ విమర్శలు చేశారు.
సీఎం హిమంత విమర్శలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఆయన ఈ ఏడాది మే 12న రెండోసారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. గత ఇదేళ్లలో ఆయన రాష్ట్రానికి చేసిందేమీ లేకపోవడం వల్లనే ప్రజల దృష్టిని మరల్చే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. బిర్యానీ అంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడతారని, బిర్యానీని మనుషులే తింటారని, జంతువులు తినవని కౌంటర్ విమర్శలు చేస్తున్నారు. దాంతో అస్సాంలో ఉప ఎన్నిక ఎల్ నీనో ఎండలతో పోటీ పడుతోందని రాజకీయ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
