Political News

పదో తరగతి విద్యార్థులే రూపారెడ్డి హంతకులు

నల్గొండ జిల్లా కొండమల్లెపల్లిలోని నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డి హత్య కేసులో చిక్కుముడి వీడింది. ఇద్దరు పదో తరగతి విద్యార్థులు ఆమెను హత్య చేసినట్టు పోలీసు విచారణలో తేలింది. దాంతో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజలు విస్తుపోయారు. చెడు వ్యసనాల బారిన పడిన విద్యార్థులు దైవంతో సమానంగా గౌరవించాల్సిన గురువును పొట్టన పెట్టుకోవడం కలకలం సృష్టిస్తోంది. గంజాయి మత్తులో జరుగుతున్న నేరాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అరకొర సిబ్బందితో ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగా వుంటున్నాయి.

ఇంతకూ ఏమి జరిగిందంటే… కొండమల్లెపల్లి మండలానికి చెందిన అనిల్, వంశీ అనే పదో తరగతి విద్యార్థులు చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయారు. గంజాయి సేవించి, విలాసాలు చేయడానికి డబ్బులు అవసరమయ్యాయి. దీంతో డబ్బుల కోసం ప్రిన్సిపాల్ రూపా రెడ్డిని లక్ష్యం చేసుకున్నారు. రూపారెడ్డి దినచర్యలను క్షుణ్ణంగా పరిశీలించారు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం ఆగస్టు 11వ తేదీ సాయంత్రం రూపారెడ్డి స్కూల్ నుంచి ఇంటికి రాకముందే గోడ దూకి ఇంట్లోకి చొరబడ్డారు.

రహస్యంగా వంటగదిలో మాటు వేశారు. ఇదంతా తెలియని రూపారెడ్డి ఎప్పటిలాగే ఇంటికి వచ్చారు. ఫ్రెషప్ అయింతర్వాత బెడ్ రూములోకి వెళ్లారు. అంతే… అప్పటి వరకు వంటగదిలో నక్కివున్న నిందితులు ఒక్కసారిగా ఆమె మీద పడ్డారు. తేరుకోకుండా కత్తితో 27 పోట్లు పొడిచారు. దాంతో రూపారెడ్డి అక్కడికక్కడే కన్నుమూశారు. ఈ హత్య తెలంగాణాలో పెను సంచలనం సృష్టించింది.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులకు ఈ కేసు అర్ధం కాలేదు. హత్య జరిగిన తీరును చూస్తే పెద్ద సుపారీ గ్యాంగ్ చేసినట్లు కనిపిస్తుంది. ఎవరో ప్రొఫెషనల్ కిల్లర్లు సాక్ష్యాలు దొరకకుండా హత్య చేసినట్లుంది. దాంతో ప్రాధామికంగా భర్త రాజేంద్ర రెడ్డితో సహా 80 మందిని విచారించారు. ఒక్క క్లూ కూడా దొరకలేదు. చివరికి సీసీ కెమెరాలను పరిశీలిస్తుండగా హత్య జరిగిన రోజు ఒక మైనర్ బాలుడు అనుమానంగా కనిపించాడు.

ఆ ఒక్క క్లూ నిందితులను పట్టించింది. అనిల్, వంశీలను అదుపులోకి తీసుకొని విచారించారు. దర్యాప్తులో వాళ్ళు చెప్పిన విషయాలు విని ఆశ్చర్యపోయారు. వీడియోల్లో చూసి హత్య సమయంలో పోలీసులకు సాక్ష్యాలు లభించకుండా గ్లౌజులు ధరించలేదని చెప్పారు. గంజాయికి అలవాటు పడి డబ్బుల కోసం హత్య చేసినట్లు అంగీకారించారు.

ఇప్పుడు ఆ స్కూల్లో విద్యార్థుల మొహాల్లో భయం కనిపిస్తుంది. ఇంత కాలం అంత భయంకరమైన నేర స్వభావం కలిగిన వారితో కలిసి చదువు కోవడం, తరగతి గదిలో కలిసి కూర్చోవడం తలచుకొని భయాందోళనకు గురవుతున్నారు. కొందరు విద్యార్థులు స్కూల్ కు వెళ్లాలంటే దడుసుకుంటున్నారు. పాఠశాలలు, కాలేజీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని గంజాయి విక్రయాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోకుంటే భవిష్యత్ తరాలు నేరస్తులుగా తయారవడం ఖాయమని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

This post was last modified on August 19, 2026 4:34 pm

Share

Recent Posts

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

5 minutes ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

20 minutes ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

20 minutes ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

2 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

2 hours ago

కన్నీటి పర్యంతమైన బొత్స

వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…

3 hours ago