Movie News

‘మల్లెపూల పల్లకి’ విమర్శలపై దర్శకుడేమన్నాడంటే?

అయ్యప్ప స్వామి భక్తులు పాడుకునే పాటల్ల ో ‘మల్లెపూల పల్లకి’కి ఉన్న ఆదరణే వేరు. అయ్యప్ప మాల సీజన్ మొదలైందంటే ఈ పాట ఊర్లలో మార్మోగిపోతుంటుంది. మాస్ రాజా రవితేజను అయ్యప్ప భక్తుడిగా చూపిస్తూ ‘ఇరుముడి’ అనే సినిమా తీసిన మేకర్స్.. ఈ సినిమాలోనూ ‘మల్లెపూల పల్లకి’ పెడుతున్నారన్న వార్త బయటికి రావడంతో ఈ సాంగ్‌కు ముందే మంచి హైప్ వచ్చింది. పాట ఒక రేంజిలో ఉంటుందని ఊహించుకున్నారు. 

కానీ తీరా చూస్తే ఈ పాటను రిలీజ్ చేసినపుడు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ఒరిజినల్‌ సాంగ్‌ను యథాతథంగా కంపోజ్ చేసి ఉన్నా అదిరిపోయేదని.. జి.వి.ప్రకాష్ కుమార్ లాంటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌ ఒరిజినల్ ట్యూన్‌కు సరితూగేలా సాంగ్ కంపోజ్ చేయలేదని, ఒరిజినల్ సింగర్ డప్పు శ్రీనుతోనే ఈ పాట పాడించినా అసలు పాటను మ్యాచ్ చేయలేకపోయారని విమర్శలు వచ్చాయి. సినిమాలో ఈ పాట డీజే వెర్షన్‌ ఉంటుందని, అది పెద్ద సర్ప్రైజ్ అని మేకర్స్ అంటున్నప్పటికీ.. జనాల్లో అంచనాలు పెరగట్లేదు.

‘మల్లెపూల పల్లకి’ సాంగ్ మీద వస్తున్న విమర్శలపై దర్శకుడు శివ నిర్వాణ తాజాగా స్పందించాడు. ఒరిజినల్ సాంగ్‌లో ఉన్న బేస్ వాయిస్‌కు ‘ఇరుముడి’లో ఉన్న వాయిస్ సరితూగలేదన్న అభిప్రాయాన్ని శివ నిర్వాణ అంగీకరించాడు. అసలు పాటను పాడిన డప్పు శ్రీనుతోనే పాడించినా.. ఈ తేాడా ఎందుకు వచ్చిందో అతను వివరించే ప్రయత్నం చేశాడు.

ఒరిజినల్ సాంగ్‌ను డప్పు శ్రీను 15 ఏళ్ల కిందట పాడాడని.. ఇప్పుడు ఆయన వయసు పెరిగిందని, స్వరం మారిందని.. అందుకే ఒకప్పట్లా బేస్ వాయిస్ లేకపోవచ్చని అతనన్నాడు. ఒరిజినల్ సింగర్‌తో పాడించి గౌరవించాలన్న ఉద్దేశంతోనే డప్పు శ్రీనుతో ఈ పాట పాడించామని శివ తెలిపాడు.

మరోవైపు అయ్యప్పస్వామి మాల నేపథ్యంలోనే సాగే మలయాళ చిత్రం ‘మాలికాపురం’తో ‘ఇరుముడి’కి వస్తున్న పోలికల గురించి కూడా శివ నిర్వాణ స్పందించాడు. రెంటినీ పోల్చడంలో ఆశ్చర్యం లేదని.. కానీ తన సినిమాలో ఏం కంటెంట్ ఉందో తనకు తెలుసు కాబట్టి తాను ఎప్పడూ ఈ పోలికల గురించి కంగారుపడలేదని… తన సినిమా యునీక్‌గా ఉంటుందని.. ఈ విషయాన్ని ప్రేక్షకులు కూడా అంగీకరిస్తారని అతను ధీమా వ్యక్తం చేశాడు.

This post was last modified on August 19, 2026 4:40 pm

Share

Recent Posts

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

49 minutes ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

1 hour ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

3 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

3 hours ago

టీడీపీకి 58 కోట్లు.. వైసీపీకి 24 కోట్లు.. బీఆర్ ఎస్‌కు 16 కోట్లు..

భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…

4 hours ago

కార్తీ రేంజు ఇంత పడిపోయిందా

యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…

6 hours ago