ఒక సినిమాకు ఒక యాక్టర్‌ను ఎంపిక చేశాక.. మళ్లీ మార్పులు జరగడం సినీ పరిశ్రమలో మామూలే. కాల్ షీట్లు సర్దుబాటు కాకపోవడం కావచ్చు.. పారితోషకం దగ్గర ఏకాభిప్రాయం కుదరకపోవడం కావచ్చు.. లేదంటే సదరు పాత్రకు ఆ యాక్టర్ న్యాయం చేయలేరేమో అన్న డౌట్ రావడం వల్ల కావచ్చు.. లేదంటే ఆ యాక్టర్‌కే ఆ పాత్రకు తనకు కరెక్ట్ కాదని అనిపించొచ్చు.. ఇలా రకరకాల కారణాలతో యాక్టర్లను రేప్లేస్ చేస్తుంటారు.
ఐతే తనను ఒక సినిమా నుంచి తప్పించడానికి మాత్రం ఇవేవీ కారణం కాదని.. విచిత్రమైన రీజన్‌తో తనను రీప్లేస్ చేశారని అంటోంది బాలీవుడ్ భామ తాప్సి పన్ను. హీరో భార్యకు తాను నచ్చకపోవడం వల్ల తనను ఓ సినిమా నుంచి తప్పించినట్లు ఆమె వెల్లడించింది. ‘‘నేను నటించిన ఓ సినిమా నుంచి ఆఖరి నిమిషంలో నన్ను తప్పించారు. కారణమేంటి అని అడిగితే.. హీరో భార్యకు నువ్వు నచ్చలేదు అని చెప్పారు. ఆ మాట విని షాకయ్యా. ఒక సినిమా నుంచి నన్ను తప్పించడానికి చెప్పిన కారణాల్లో
ఇదే అత్యంత దారుణమైనది’’ అని తాప్సి పేర్కొంది.
ఇక మరో సినిమా నుంచి హీరోనే తనను తప్పించాడని.. బహుశా అతడికి ఇంకెవరితో అయినా నటించాలని అనిపించి ఉండొచ్చని.. కానీ తనను తప్పించడానికి కారణమేంటన్నది మాత్రం చెప్పలేదని తాప్సి ఆవేదన వ్యక్తం చేసింది. బాలీవుడ్లో మరో సినిమా నుంచి తనను పక్కన పెట్టిన విషయం తనకంటే ముందు మీడియాకే తెలిసిందని.. తన గురించి వార్త బయటికి వచ్చాక టీం తనకు ఫోన్ చేసి సారీ చెప్పిందని.. వాళ్లు కూడా తన మీద ఎందుకు వేటు వేశారన్నది మాత్రం చెప్పలేదని తాప్సి అంది.
ఇక కెరీర్ ఆరంభంలో చేసిన బోల్డ్ సీన్స్ గురించి తాప్సి మాట్లాడుతూ.. షూటింగ్ టైంలో అవి మామూలుగా అనిపించినా, స్క్రీన్ మీద చూసుకున్నపుడు మాత్రం అవి అనవసరంగా చేయించారని అనిపించేదని.. బోల్డ్ సీన్స్ లేకుండానే సినిమాల్లో గ్లామరస్‌గా కనిపించవచ్చని తనకు ఆలస్యంగా అర్థమైందని తాప్సి వ్యాఖ్యానించింది. తాప్సి లీడ్ రోల్ చేసిన ‘గాంధారి’ సినిమా ఈ నెల ఆరంభంలో నేరుగా నెట్‌ఫ్లిక్స్ ద్వారా రిలీజై యావరేజ్ రివ్యూలు తెచ్చుకుంది.
This post was last modified on September 26, 2026 11:44 am
దేశవ్యాప్తంగా ఒంటరి జీవులు పెరుగుతున్నారా? అంటే.. తాజాగా అసోచామ్ సహా మరో రెండు సంస్థలు చేసిన సర్వే ఔననే సమాధానమే…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత కొడాలి నాని చాలాకాలంగా మీడియాకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అడపాదడపా పార్టీ కార్యక్రమాల్లో…
చిరంజీవి కాకా స్పీడ్ మాములుగా లేదు. నిన్న జరిగిన సిగ్మా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ స్వయంగా కొన్ని…
ఒకప్పుడు గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తుండేవాడు మెగా కుర్రాడు సాయిధరమ్ తేజ్. కానీ రోడ్డు ప్రమాదం తర్వాత తన కెరీర్…
ది ప్యారడైజ్ సినిమాకు సోషల్ మీడియాలో వచ్చిన స్పందన, ట్రోలింగ్ గురించి నాని రెండో రోజే ఓపెన్ అయిపోవడం అందరినీ…
ది ప్యారడైజ్ సినిమా ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో కానీ.. ఈ సినిమాకు వచ్చిన హైప్, దీనికి జరిగిన అడ్వాన్స్…