తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆర్యదాస్ ముహమ్మద్ అవార్డుకు ఎంపికైనట్లుగా ప్రెస్ నోట రావటం తెలిసిందే. కేరళంకు చెందిన ఈ అవార్డును స్వీకరించేందుకు ముఖ్యమంత్రి కేరళం వెళ్లటం తెలిసిందే. ఇంతకూ సీఎం రేవంత కు ఏ విభాగంలో ఈ అవార్డును ప్రకటించారన్నది చూస్తే.. ఉత్తమ ప్రజాసేవకుడు 2026కు ఆయన ఎంపికయ్యారు. ఇంతకూ ఈ అవార్డు ఎవరి పేరు మీద ఏర్పాటు చేశారు? ఆయన ఎవరు? ఇంతకూ ఈ అవార్డుకు ఉన్న ప్రత్యేకత ఏంటి? ప్రతిష్టాత్మక అవార్డు అంటున్నారు కదా? గతంలో ఈ అవార్డు ఎవరెవరికి వచ్చింది? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే ఆసక్తికర సమాధానాలు లభించాయి.
కేరళంకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత దివంగత ఆర్యదాస్ ముహమ్మద్ గుర్తుగా దీన్ని ఏర్పాటు చేశారు. ఆయన సాదాసీదా నేత కాదనే చెప్పాలి. ఎందుకంటే.. కేరళం కాంగ్రెస్ నేతల్లో అత్యంత సీనియర్ గా గుర్తింపు పొందారు. ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలవటమే కాదు.. నాలుగుసార్లు మంత్రిగా సేవలు అందించారు. ఆయనకు ప్రజాప్రతినిధిగా మంచి ట్రాక రికార్డు ఉంది. ఆయన కాలం చేసిన తర్వాత ఆయన పేరు మీద ముహమ్మద్ ఫౌండేషన్ ను ఏర్పాటు చేశారు. ఈ రోజు నాలుగో వర్థంతిని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన పేరుతో ఏర్పాటు చేసిన అవార్డును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రదానం చేస్తున్నారు.
ఈ అవార్డును స్వీకరించటానికి ముఖ్యమంత్రి రేవంత్ కేరళంకు వెళ్లారు. ఇక.. ఈ అవార్డును 2024 నుంచి ప్రకటిస్తున్నారు. ఈ అవార్డును తొలిసారి కాంగ్రెస్ సీనియర్ నేత.. కాంగ్రెస్ అధిష్ఠానానికి అత్యంత సన్నిహితుడైన కేసీ వేణుగోపాల్ కు దక్కింది. ఆ సందర్భంలో ఆయనకు అవార్డును అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి, కాంగ్రెస్ మరో సీనియర్ నేత సిద్దరామయ్య అందజేశారు. 2025లో ఈ అవార్డును కేరళకు చెందిన కాంగ్రెస్ నేత వీడీ సతీషన్ కు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన కేరళం ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన వేళ.. పార్టీ విజయంలో కీలకంగా వ్యవహరించిన వీడీ సతీష్ ను సీఎంగా ఎంపిక చేయటం తెలిసిందే. 2026 సంవత్సరానికి ఈ అవార్డును తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎంపిక చేశారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఈ అవార్డు కోసం ఇప్పటివరకు ఎంపికైన నేతల్లో కేరళం రాష్ట్రానికి సంబంధం లేని మొదటి నేత రేవంత్ రెడ్డి కావటం విశేషం.
ఇంతకూ ఈ అవార్డు ఎంపిక కమిటీ ఎవరన్నది చూస్తే..అందులో ఒక ఎంపీ.. రాష్ట్ర మంత్రి.. మరొకరు ఉన్నారు. తెలంగాణలో రైతులు.. వెనుకబడిన వర్గాలు.. సామాన్య ప్రజల సంక్షేమానికి సీఎం రేవంత్ చేపట్టిన వినూత్న కార్యక్రమాల్ని గుర్తించి.. ఆయన్ను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లుగా పేర్కొన్నారు. ఈ పురస్కారం కింద రూ.లక్ష నగదు.. ప్రశంసాపత్రం.. జ్ఞాపికను అందజేస్తారు.
మొత్తంగా చూస్తే.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక సీనియర్ నేత పేరుతో ఏర్పాటు చేసిన అవార్డు.. ఆ పార్టీకి చెందిన వారినే ఎంపిక చేయటం.. వారిలో వారే ఇచ్చుకోవటంలా కనిపిస్తోంది. ఈ తరహా అవార్డులతో చిక్కేమంటే.. దీన్ని ప్రతిష్టాత్మక అవార్డుగా ప్రస్తావించటం.. విపరీతమైన హైప్ ఇవ్వటం కంటే.. వేరే రాష్ట్రానికి చెందిన వారు గుర్తించి.. ఇచ్చిన అవార్డుగా పేర్కొంటే బాగుంటుంది. ఈ తరహా పురస్కారాలకు పీఆర్ హైప్ ఎంత పరిమితంగా ఉంటే అంత బాగుంటుందని చెప్పాలి.
This post was last modified on September 26, 2026 1:01 pm
దేశవ్యాప్తంగా ఒంటరి జీవులు పెరుగుతున్నారా? అంటే.. తాజాగా అసోచామ్ సహా మరో రెండు సంస్థలు చేసిన సర్వే ఔననే సమాధానమే…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత కొడాలి నాని చాలాకాలంగా మీడియాకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అడపాదడపా పార్టీ కార్యక్రమాల్లో…
ఒక సినిమాకు ఒక యాక్టర్‌ను ఎంపిక చేశాక.. మళ్లీ మార్పులు జరగడం సినీ పరిశ్రమలో మామూలే. కాల్ షీట్లు సర్దుబాటు…
చిరంజీవి కాకా స్పీడ్ మాములుగా లేదు. నిన్న జరిగిన సిగ్మా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ స్వయంగా కొన్ని…
ఒకప్పుడు గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తుండేవాడు మెగా కుర్రాడు సాయిధరమ్ తేజ్. కానీ రోడ్డు ప్రమాదం తర్వాత తన కెరీర్…
ది ప్యారడైజ్ సినిమాకు సోషల్ మీడియాలో వచ్చిన స్పందన, ట్రోలింగ్ గురించి నాని రెండో రోజే ఓపెన్ అయిపోవడం అందరినీ…