వైసీపీ అధినేత జగన్‌ను ఉద్దేశించి ఆ పార్టీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి కీలక హెచ్చరికలు జారీ చేశారు. పర్యవసానాలు ఏమిటో గుర్తించారా? అంటూ.. ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమిలోకి జగన్ పార్టీ చేరే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయని సాయిరెడ్డి పేర్కొన్నారు. ఇదే జరిగితే.. పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇదంతా జగన్ కంటే ఎక్కువ ఎత్తులో కూర్చున్న ఓ వ్యక్తి చేయిస్తున్నారన్న అనుమానం ఉందని వ్యాఖ్యానించారు. కానీ, ఇలాంటి వాటి వల్ల సదరు ఎత్తులో కూర్చున్న వ్యక్తికి ఎలాంటి నష్టం ఉండకపోవచ్చన్నారు.
కానీ.. జగన్ పరిస్థితి అలా లేదని.. సాయిరెడ్డి నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఉన్న ఇండియా కూటమి పార్టీలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాయో అందరికీ తెలిసిందేనని చెప్పారు. ఇప్పుడు కమ్యూనిస్టుల మాట విని.. జగన్ ఇండియా కూటమిలో చేరితే.. మరుక్షణం పరిస్థితులు తల్లకిందులు అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నానని చెప్పారు. ఎత్తు కుర్చరీలో కూర్చున్న నాయకుడు గతంలో కమ్యూనిస్టులతో కలిసి తిరిగారని.. ఇప్పుడు ఆయన సూచనలనే జగన్ పాటిస్తున్నారని ఆరోపించారు.
ఇలాంటి పరిణామాలు.. జగన్ భద్రతకు, భవిష్యత్తు కూడా మంచిది కాదని సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. పలు కేసుల్లో చిక్కుకుని ఉన్న జగన్.. ఇప్పుడు పొరపాటు అడుగు వేస్తే.. అది మొత్తానికే ముప్పు తెచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఎవరోచెప్పారని.. కమ్యూనిస్టు లతో చేతులు కలిపి.. కాంగ్రెస్ కూటమిలో చేరితే.. అది ఎవరికి ప్రయోజనమో.. ఎవరికి ఇబ్బందులు తెచ్చిపెడుతుందో జగన్ ఆలోచన చేయాలని సూచించారు.
ఈ విషయాలను తాను రాజకీయ దురుద్దేశంతో చెప్పడం లేదన్నారు. జగన్ భవిష్యత్తు బాగుండాలని కోరుకునే ఏ ఒక్కరూ ఈ పరిణామాలను సహించబోరని వ్యాఖ్యానించారు. ఇలాంటి వారి విషయంలో.. వారిచ్చిన సూచనల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయాలని సాయిరెడ్డి సూచించారు.
This post was last modified on September 26, 2026 11:33 am
ఒకప్పుడు గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తుండేవాడు మెగా కుర్రాడు సాయిధరమ్ తేజ్. కానీ రోడ్డు ప్రమాదం తర్వాత తన కెరీర్…
ది ప్యారడైజ్ సినిమాకు సోషల్ మీడియాలో వచ్చిన స్పందన, ట్రోలింగ్ గురించి నాని రెండో రోజే ఓపెన్ అయిపోవడం అందరినీ…
ది ప్యారడైజ్ సినిమా ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో కానీ.. ఈ సినిమాకు వచ్చిన హైప్, దీనికి జరిగిన అడ్వాన్స్…
ఎమ్మెల్యేలు రెండు పెళ్లిళ్లు చేసుకుంటున్నారని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ తేనెతెట్టును కదిపారు. దాంతో ఇప్పుడు కర్ణాటకలో రెండు పెళ్లిళ్లు…
వైసీపీ అధినేత జగన్ పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇతర పార్టీలతో ఎప్పుడూ పొత్తులు పెట్టుకోలేదు. ఎన్నికల్లో…
మెగాస్టార్ చిరంజీవి ఏ ఈవెంట్‌కు హాజరైనా తనదైన శైలిలో పంచులు వేస్తూ.. హుషారుగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంటారు. తెర మీదే…