ఒకప్పుడు గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తుండేవాడు మెగా కుర్రాడు సాయిధరమ్ తేజ్. కానీ రోడ్డు ప్రమాదం తర్వాత తన కెరీర్ స్లో అయింది. రీఎంట్రీ మూవీ విరూపాక్షతో పెద్ద హిట్ కొట్టినప్పటికీ.. ఆ తర్వాత వేగంగా సినిమాలు చేయట్లేదు. పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించిన బ్రో తర్వాత మూడేళ్లుగా తన సినిమా ఏదీ రిలీజ్ కాలేదు. కొంచెం గ్యాప్ తర్వాత సంబరాల యేటిగట్టు అనే సినిమాను పట్టాలెక్కించినా.. దీని షూటింగ్ ఒక పట్టాన పూర్తి కావట్లేదు.
గత ఏడాది దసరాకు అనుకున్న సినిమా.. ఈ ఏడాది ఆ పండక్కి కూడా రిలీజ్ కావట్లేదు. ఈ మధ్య 2027 సంక్రాంతి రిలీజ్ అంటూ పోస్టర్ వదిలినా.. జనాలకు నమ్మకం కుదరడం లేదు. ఆ టైంకి సినిమా రెడీ కాకపోవవచ్చన్నది ఒక అనుమానం అయితే.. సంక్రాంతి పండక్కే చిరంజీవి సినిమా కాకా రిలీజవుతుండడంతో మావయ్యతో మేనల్లుడు పోటీ పడడేమో అన్నది ఇంకో డౌట్.
కానీ సంబరాల యేటిగట్టు నిర్మాత చైతన్య రెడ్డి మాత్రం సంబరాల యేటిగట్టు సంక్రాంతి రిలీజ్ విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తమ సినిమా నూటికి నూరు శాతం సంక్రాంతికి వస్తుందని ధీమా వ్యక్తం చేసింది. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్‌కు అధిక ప్రాధాన్యం ఉందని, వాటి మీదే టీం పని చేస్తోందని.. ఆ వర్క్ అంతా తాము అనుకున్నట్లు ప్రణాళిక ప్రకారం జరుగుతోందని.. కాబట్టి సినిమా వాయిదా పడదని ఆమె స్పష్టం చేసింది. ఇక ఈ మూవీ బడ్జెట్ పెరిగిపోవడం, బడ్జెట్‌కు తగ్గట్లు బిజినెస్ జరగని పరిస్థితి రావడం గురించి మీడియాలో వస్తున్న వార్తల గురించి చైతన్య రెడ్డి స్పందించింది.
వారణాసి లాంటి సినిమా గురించి కూడా నెగెటివ్ న్యూస్‌లు వస్తున్నాయని.. ఆ సినిమా డిజిటల్ రైట్స్ అనుకున్నంత రేటుకు అమ్ముడుబోవట్లేదని ప్రచారం చేస్తున్నారని.. ఇలా ప్రతి సినిమాకూ జరుగుతుందని.. వాస్తవాలు ఎవరికీ తెలియవని.. తాము మాత్రం కథను నమ్మి దానికి ఏం కావాలో అదంతా చేస్తున్నామని చైతన్య అన్నారు. తమ సంస్థలో రామ్ చరణ్‌తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని.. అందుకోసం కథ కూడా రెడీ అయిందని, అందులో చరణ్ నెవర్ బిఫోర్ అవతార్‌లో కనిపిస్తారని, ఆయనకు ఇది ఇంద్ర లాంటి సినిమా అవుతుందని చైతన్య చెప్పడం విశేషం.
This post was last modified on September 26, 2026 11:16 am
ది ప్యారడైజ్ సినిమాకు సోషల్ మీడియాలో వచ్చిన స్పందన, ట్రోలింగ్ గురించి నాని రెండో రోజే ఓపెన్ అయిపోవడం అందరినీ…
ది ప్యారడైజ్ సినిమా ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో కానీ.. ఈ సినిమాకు వచ్చిన హైప్, దీనికి జరిగిన అడ్వాన్స్…
ఎమ్మెల్యేలు రెండు పెళ్లిళ్లు చేసుకుంటున్నారని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ తేనెతెట్టును కదిపారు. దాంతో ఇప్పుడు కర్ణాటకలో రెండు పెళ్లిళ్లు…
వైసీపీ అధినేత జగన్ పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇతర పార్టీలతో ఎప్పుడూ పొత్తులు పెట్టుకోలేదు. ఎన్నికల్లో…
మెగాస్టార్ చిరంజీవి ఏ ఈవెంట్‌కు హాజరైనా తనదైన శైలిలో పంచులు వేస్తూ.. హుషారుగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంటారు. తెర మీదే…
పెళ్లంటే నూరేళ్ళ పంట అనేది పాత సినిమాలో హిట్టయిన పాట. హరియాణాకు చెందిన గ్యాంగ్ స్టర్ మైనపాల్ ఢిల్లా మాత్రం…