ఇరాన్ ప్రస్తుత అధ్యక్షుడు మొజ్తబా ఖొమేనీ సురక్షితంగా వున్నారని, సంపూర్ణ ఆరోగ్యంతో వున్నారని ఒక వీడియో విడుదల కావడంతో ఇరాన్ లో పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఫిబ్రవరి 28 వ తేదీన యుద్ధం ప్రారంభమైన తొలిరోజే ఇరాన్ అధ్యక్షుడు అయాతుల్లా ఖొమేనీ మృతి చెందారు. ఆయనతో పాటుగా పలువురు మంత్రులు కూడా మరణించారు.
ఆ దాడిలో ఖొమేనీ పెద్ద కుమారుడు మొజ్తబా కూడా మరణించినట్లు ప్రచారం జరిగింది. ముఖ్యంగా ఇజ్రాయిల్ ప్రభుత్వం, మీడియా ఈ విషయాన్ని విపరీతంగా ప్రచారం చేసింది. ఇరాన్ పాలక వర్గం మొత్తానికి న్ని తుడిచి పెట్టామని చెప్పడం ద్వారా ఇరాన్ సైన్యాన్ని ఆత్మరక్షణలో పడేయడం ఇజ్రాయిల్ వ్యూహం.
ఈ ప్రచారాన్ని ఇరాన్ తిప్పి కొట్టినప్పటికి మొజ్తబా ఖొమేని అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో ప్రపంచం వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఖొమేనీ బతికే వున్నాడని ఇరాన్ అనుకూల మీడియా, తీవ్రంగా గాయపడిన ఆయన మరణించాడని అమెరికా అనుకూల మీడియా ప్రచారం చేసాయి.
దీనికి ప్రతిగా ఇజ్రాయిల్ అధ్యక్షుడు బెంజిమెన్ నెతన్యాహును మట్టుబెట్టినట్లు ఇరాన్ మీడియా, ఐఆర్జీసీ ప్రచారం చేయడమే కాకుండా నెతన్యాహు నిర్జీవంగా పడివున్న చిత్రాలను సోషల్ మీడియాలో పోస్టు చేయడం జరిగింది. ఆ తర్వాత నెతన్యాహు స్వయంగా దీన్ని ఖండించడమే కాకుండా ఒక కాఫీ కేఫ్ లో కనిపించిన వీడియో ను పోస్ట్ చేశారు. కానీ ఇరాన్ మాత్రం మొజ్తబా సజీవంగా వున్నట్లు నిరూపించే వీడియో ఏది పెట్టలేదు. దాంతో ఖొమేనీ ఆరోగ్యంపై సందేహాలు వ్యక్తం అయ్యాయి.
ఒకవైపు ఈ డెత్ డ్రామా జరుగున్న సమయంలోనే ఇరాన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. అయినప్పటికీ ఖొమేనీ ఊసు మాత్రం లేదు. బాంబుదాడిలో గాయపడిన ఆయనను రష్యా తరలించి వైద్యం చేస్తున్నట్లు మరో ప్రచారం జరిగింది. ఈ లోపు అనేక పరిమణామాలు చోటు చేసుకున్నాయి. మధ్యలో కొంత కాలం సీజ్ ఫైర్ పేరుతో యుద్దాన్ని విరమించడం జరిగింది. మళ్ళీ దాడులు ప్రారంభం అయ్యాయి.
162 రోజుల తర్వాత ఖొమేనీ వీడియో విడుదల చేయడం సంచలనం సృష్టిస్తుంది. మొజ్తబా సంపూర్ణ ఆరోగ్యంతో వున్నట్లు మెహర్ వార్తా సంస్థ విడుదల చేసిన వీడియోలో మంత్రులు, అధికార ప్రతినిధులతో ఆయన చర్చలు జరుపుతున్నారు. ఇరాన్ ఇస్లామిక్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ పర్యవేక్షణలో పనిచేసే సంస్థ ఈ వీడియోను విడుదల చేయడంతో విశ్వసించ వచ్చని పాశ్చాత్య మీడియా చెబుతుంది. మరికొన్ని మీడియా సంస్థలు మాత్రం వీడియో చిట్రీకరించిన కాలం మీద అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఇరాన్ ప్రజలు మాత్రం తమ నాయకుడు ఆరోగ్యంగా వున్నాడని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates