వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ ఒకదారి అయితే ఉలిపికట్టేది మరొక దారి అన్నట్లుందని గణేష్ కామెంట్స్ పై భగ్గుమంటున్నారు నేటిజన్లు.
భోగాపురం ఎయిర్ పోర్టును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది. 3 లక్షల మందికి పైగా ప్రజలు బహిరంగ సభకు తరలి రావడంతో రాష్ట్రంలో భోగాపురం ఎయిర్ పోర్టు హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఏమి చేయాలో దిక్కు తోచని వాసుపల్లి గణేష్ మీడియా ముందుకు వచ్చారు. ఏం మాట్లాడుతున్నారో అర్ధం కాకుండా ఏదేదో మాటాడేసారు. విమానాశ్రయానికి పిల్ల పెళ్ళికి ముడేసి నోరుజారి నెటిజన్ల చేతికి చిక్కారు.
విశాఖ మ్యాపులో ఇపుడు ఎయిర్ పోర్టు లేదని, ఉత్తరాంధ్ర ఎయిర్ పోర్టు అంటారని చెప్పిన గణేష్ ఎవరైనా పిల్లను ఇవ్వాలంటే మీ వైజాగ్ లో ఎయిర్ పోర్టు లేదుకదాని అడుగుతున్నారని చెప్పారు. మీకు ఎయిర్ పోర్టు లేదని తిరస్కరిస్తున్నారని అన్నారు. ఎక్కడో 58 కిలో మీటర్ల దూరంలో ఎయిర్ పోర్టు పెట్టి సంకలు గుద్దుకుంటున్నారని చంద్రబాబుపై పరోక్షంగా విమర్శలు చేశారు. అయినా ఎవరైనా అబ్బాయి ఏమి చదివాడు, ఎంత సంపాదిస్తున్నాడు అని చూస్తారు కానీ మీ ఊరికి విమానాలు వస్తాయా లేదా అని చూడరు కదా.. ఇదే ప్రశ్న అడుగుతున్నారు నెటిజన్లు.
అసలు భోగాపురం విమానాశ్రయాన్ని తెచ్చింది మేమే అంటూ రెండు రోజుల నుంచి వైసీపీ అధిష్టానం, పార్టీ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు. విమానాశ్రయం క్రెడిట్ మాదేనంటూ జగన్ సైతం మెసేజ్ పెట్టారు. ఒకవైపు భోగాపురం క్రెడిట్ కోసం ఫ్యాను పార్టీ తహ తహలాడుతుంటే వాసుపల్లి గణేష్ మాత్రం తప్పులో కాలేసి నాలుక్కరుచుకున్నారు. ఇప్పుడు వైసీపీ పరిస్థితి లాక్కొలేక పీక్కోలేక అన్నట్లు తయారైందని ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates

