Political News

ఆ రోడ్డుపై వైసీపీ దుష్ప్రచారం.. ఖండించిన డిప్యూటీ సీఎంవో

ఈ రోజుల్లో మంచి పని చేయడం ఎంత ముఖ్యమో…ఆ పనిపై జరిగే విషప్రచారాన్ని ఖండించడం కూడా అంతే ముఖ్యం. మరీ ముఖ్యంగా వైసీపీ వంటి పార్టీలు ఉన్న ఈ రాష్ట్రంలో అయితే.. అటువంటి విష ప్రచారాల పట్ల మరింత అలర్ట్ గా ఉండాలి. ఏజెన్సీలు, గిరిజన, మారుమూల ప్రాంతాల్లో ప్రజల దశాబ్దాల కష్టాలకు చరమ గీతం పాడేందుకు ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి పవన్ కల్యాణ్ అడవి తల్లి బాట కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే.

అయితే, ఆ కార్యక్రమంలో భాగంగా వేసిన ఒక తారు రోడ్డు కొట్టుకుపోయింది అంటూ వైసీపీ దుష్ప్రచారం మొదలుబెట్టింది. ఈ క్రమంలోనే ఆ ఫేక్ ప్రచారాన్ని గ్రామీణాభివ పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం కడగంటి నుంచి చాకలిగూడెం మీదుగా బొబ్బికి వెళ్లే రోడ్డు రాత్రికి రాత్రే కొట్టుకుపోయింది అంటూ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త గోపిరెడ్డి సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఈ ప్రభుత్వం వేసిన రోడ్లలో నాణ్యత లేదని, రాత్రికి రాత్రే రోడ్డు మొత్తం కొట్టుకుపోయిందని అదే రోడ్డు మీద నిల్చొని చేసిన వీడియో వైరల్ అయింది.

దీంతో, ఆ వీడియో పై డిప్యూటీ సీఎంవో ఆరా తీసింది. అయితే, అది రోడ్లుభవనాల శాఖ కిందకు వస్తుందని, అందులోనూ అది పదేళ్ల క్రితం వేసిన రోడ్డు అని, మోంథా తుపాను సమయంలో ఆ రోడ్డు మరింత పాడైందని తెలిపింది. ఇక, ఆ ప్రచారాన్ని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కూడా ఖండించింది. ఆ రోడ్డు అడవి తల్లి బాట కింద వేసింది కాదని క్లారిటీనిచ్చింది. అడవి తల్లి బాట కింద వేసిన రోడ్ల నాణ్యత విషయంలో రాజీ పడేది లేదని తేల్చి చెప్పింది. వాస్తవాలను తెలుసుకోకుండా తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది.

This post was last modified on September 28, 2026 2:50 pm

Share

Recent Posts

చీకట్లో మొబైల్‌ చూస్తున్నారా.. ఈ డేంజర్‌ గురించి తెలుసుకోండి..

రాత్రి నిద్రపోయే ముందు ఫోన్‌ చూడటం చాలామందికి అలవాటుగా మారిపోయింది. గదిలో లైట్లు ఆపేసిన తర్వాత కూడా మొబైల్‌ స్క్రీన్‌…

23 minutes ago

వెంకీ త్రివిక్రమ్ సినిమా స్థాయి బజ్ ఉందా?

సరిగ్గా ఇంకో పదకొండు రోజుల్లో ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల కానుంది. సంక్రాంతికి వస్తున్నాం లాంటి మూడు వందల…

1 hour ago

పబ్లిక్ టాయిలెట్‌లో ఇద్దరు యువకులు మృతి… ఏం జరిగింది?

ముంబైలోని గోరేగావ్‌లో పబ్లిక్ టాయిలెట్‌కు వెళ్లిన ఇద్దరు యువకులు అక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒకేసారి ఇద్దరు చనిపోవడంతో అసలు లోపల…

2 hours ago

అనుమానం రాకుండా అంతర్ధానం అవుతోంది

చిన్న సినిమాల్లో విషయం ఉంటే ఆదరణ దక్కి తీరుతుంది. ఈ విషయంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. సీతాకోకచిలుక నుంచి…

3 hours ago

జడలు విదిలించిన వసూళ్లు… ఇకపై అసలు సవాళ్లు

బుధవారం ప్రీమియర్లతో గురువారం విడుదల ఎంచుకున్న ది ప్యారడైజ్ ఎట్టకేలకు మొదటి వీకెండ్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రాధమిక సమాచారం…

4 hours ago

అమ్మ చేతులు అడుక్కోకూడదు

తెలుగులో లెజెండరీ స్టేటస్ ఉన్న దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకడు. బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న…

4 hours ago