నిన్న ఆదర్శ కుటుంబం ఏకె 47 నుంచి విడుదలైన నారాయణమ్మ పాట సోషల్ మీడియాలో డిస్కషన్ కు దారి తీస్తోంది. తమన్ కంపోజింగ్ లో రామజోగయ్య శాస్త్రి సాహిత్యంలో రూపొందిన ఈ సాంగ్ లో వెంకటేష్ తో పాటు శ్రీనిధి శెట్టి, నివేత పేతురాజ్, డింపుల్ హయతి ఆడి పాడారు. వెంటనే చార్ట్ బస్టర్ అనిపించే రేంజ్ కాదు కానీ మెల్లగా జనాలకు కనెక్ట్ అవుతోంది. అయితే తాజాగా ఈ పాటకు మూలం ఎప్పుడో వచ్చిన ఒక బ్లాక్ అండ్ వైట్ మూవీలో ఉందంటూ కొందరు ఎక్స్ లో తగులుకుంటున్నారు.
1967 అక్కినేని నాగేశ్వరరావు గారు హీరోగా తోడి కోడళ్ళు వచ్చింది. మంచి బ్లాక్ బస్టర్. అందులో మాస్టర్ వేణు స్వరపరిచిన పాటలన్నీ అద్భుతంగా ఉంటాయి. వాటిలో రేలంగి, రాజసులోచన మీద షూట్ చేసిన ‘నీ సోకు చూడకుండా నవనీతమ్మ’ అప్పట్లో జనాన్ని ఊపేసింది. మాధవపపెద్ది సత్యం, జిక్కి ఆలపించారు. కొసరాజు సాహిత్యం బాగా పేలింది. ఇదంతా యాభై సంవత్సరాల వెనుకటి ముచ్చట. దశాబ్దాలు గడిచినా ఆ సంగీత సౌరభాలు ఎప్పటికీ ఫ్రెష్ గానే ఉంటాయి.
మాములుగా త్రివిక్రమ్ మీద ఎక్కడెక్కడి నుంచో స్ఫూర్తి చెందుతారనే కామెంట్స్ ముందు నుంచీ ఉన్నాయి. వెంకటేష్ వారసుడొచ్చాడు మెయిన్ పాయింట్ ని మహేష్ బాబు అతడుకి వాడుకున్నారని, యద్దనపూడి నవల ఆధారంగా విజయనిర్మల తీసిన మీనానే నితిన్ అఆ అని, ఫ్రెంచ్ మూవీ లార్గో వించినే అజ్ఞాతవాసిగా మార్చారని ఇలా ఎన్నోసార్లు పోలికలు కామెంట్లు వస్తూనే ఉంటాయి. అల వైకుంఠపురములో మెయిన్ ట్విస్టు ఎన్టీఆర్ ఇంటిగుట్టుని పోలి ఉండటం నిజమే.
అందుకే ఇప్పుడు నవనీతమ్మ, నారాయణమ్మకు పోలికలు వచ్చేస్తున్నాయి. మాములుగా ఈ పేర్లు ఉత్తరాంధ్ర వైపు ప్రచారంలో ఉన్నవే. కానీ సినిమాల పరంగా శ్రీకారం చుట్టడం మాత్రం తోడి కోడళ్ళు నుంచి ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇప్పుడీ కంపారిజన్లు తీసుకొచ్చి అక్కినేని, దగ్గుబాటి ఫ్యాన్స్ పరస్పరం కవ్వించుకోవడం ఎక్స్ తదితర మాధ్యమాల్లో కనిపిస్తోంది. అయినా ఎక్కడి నుంచి ఇన్స్ పిరేషన్ తీసుకున్నా ఫైనల్ గా జనాన్ని మెప్పించి హిట్టు కొట్టడం ముఖ్యం. అది జరిగితే చాలు.
This post was last modified on September 28, 2026 4:10 pm
ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువతకు ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ చేసిన సూచన ఇప్పుడు వైరల్ అవుతోంది. ఉద్యోగం…
ఈ రోజుల్లో మంచి పని చేయడం ఎంత ముఖ్యమో...ఆ పనిపై జరిగే విషప్రచారాన్ని ఖండించడం కూడా అంతే ముఖ్యం. మరీ…
రాత్రి నిద్రపోయే ముందు ఫోన్ చూడటం చాలామందికి అలవాటుగా మారిపోయింది. గదిలో లైట్లు ఆపేసిన తర్వాత కూడా మొబైల్ స్క్రీన్…
సరిగ్గా ఇంకో పదకొండు రోజుల్లో ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల కానుంది. సంక్రాంతికి వస్తున్నాం లాంటి మూడు వందల…
ముంబైలోని గోరేగావ్‌లో పబ్లిక్ టాయిలెట్‌కు వెళ్లిన ఇద్దరు యువకులు అక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒకేసారి ఇద్దరు చనిపోవడంతో అసలు లోపల…
చిన్న సినిమాల్లో విషయం ఉంటే ఆదరణ దక్కి తీరుతుంది. ఈ విషయంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. సీతాకోకచిలుక నుంచి…