డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలనుకునే వారికి ఆంధ్రప్రదేశ్‌లో కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. లెర్నర్ లైసెన్స్ కోసం ఇప్పటివరకు స్లాట్ బుక్ చేసుకొని రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లి పరీక్ష రాయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ టెస్ట్‌ను ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో రాసే అవకాశం కల్పించారు. పరీక్ష పాస్ అయితే LLRను కూడా డిజిటల్‌గా పొందొచ్చు. ఈ కొత్త విధానం ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది.
దరఖాస్తుదారులు సారథి పోర్టల్ ద్వారా వివరాలు నమోదు చేసి, ఆధార్ ఆధారంగా ధ్రువీకరణ పూర్తి చేయాలి. ఫీజు చెల్లించిన తర్వాత వచ్చే అప్లికేషన్ నంబర్‌తో పరీక్షకు వెళ్లొచ్చు. వెబ్‌క్యామ్ ఉన్న ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ అవసరం. టెస్ట్‌లో మొత్తం 20 ప్రశ్నలు ఉంటాయి. వాటిలో కనీసం 12 ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇస్తే పాస్ అవుతారు. ఆ తర్వాత LLR డిజిటల్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అయితే ఇంట్లో పరీక్ష అంటే పక్కన మరొకరిని కూర్చోబెట్టుకొని సమాధానాలు చెప్పించుకునే అవకాశం లేకుండా AI ఆధారిత పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. కెమెరా ద్వారా పరీక్ష రాసే వ్యక్తిని సిస్టమ్ గమనిస్తుంది. పరీక్ష సమయంలో తలను పక్కకు తిప్పడం, పక్క నుంచి మరొకరి మాటలు వినిపించడం వంటి పరిస్థితులను గుర్తిస్తే పరీక్షను నిలిపివేసి ఫెయిల్‌గా నమోదు చేసే విధానం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకే కంప్యూటర్ IP అడ్రస్ నుంచి రోజుకు గరిష్టంగా ఇద్దరికి మాత్రమే పరీక్ష రాసే అవకాశం ఉంటుంది.
ల్యాప్‌టాప్, కంప్యూటర్ లేనివారు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. ఆధార్ లేనివారు లేదా E-కేవైసీ పూర్తి చేయలేని వారు మాత్రం రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. LLR వచ్చిన నెల రోజుల తర్వాత నుంచి ఆరు నెలల గడువులోపు RTO ట్రాక్‌పై డ్రైవింగ్ టెస్ట్‌కు హాజరై పాస్ కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు సుమారు 6 వేల నుంచి 8 వేల LLRలు జారీ అవుతున్నట్లు రిపోర్టులు పేర్కొంటున్నాయి.
This post was last modified on September 28, 2026 3:35 pm
సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తి. ఏదైనా పని జరగాలి, మెసేజ్ జనానికి చేరాలి అంటే.. దీని ద్వారా…
నిన్న ఆదర్శ కుటుంబం ఏకె 47 నుంచి విడుదలైన నారాయణమ్మ పాట సోషల్ మీడియాలో డిస్కషన్ కు దారి తీస్తోంది.…
ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువతకు ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ చేసిన సూచన ఇప్పుడు వైరల్ అవుతోంది. ఉద్యోగం…
ఈ రోజుల్లో మంచి పని చేయడం ఎంత ముఖ్యమో...ఆ పనిపై జరిగే విషప్రచారాన్ని ఖండించడం కూడా అంతే ముఖ్యం. మరీ…
రాత్రి నిద్రపోయే ముందు ఫోన్ చూడటం చాలామందికి అలవాటుగా మారిపోయింది. గదిలో లైట్లు ఆపేసిన తర్వాత కూడా మొబైల్ స్క్రీన్…
సరిగ్గా ఇంకో పదకొండు రోజుల్లో ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల కానుంది. సంక్రాంతికి వస్తున్నాం లాంటి మూడు వందల…