సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తి. ఏదైనా పని జరగాలి, మెసేజ్ జనానికి చేరాలి అంటే.. దీని ద్వారా వేగంగా సమాచారం వ్యాప్తి చెంది ఆశించిన ప్రయోజనం నెరవేరుతుంది. అదే సమయంలో ఇవ్వాలనుకున్న మెసేజ్ రాంగ్ వేలో కన్వే అయితే అసలుకే మోసం వస్తుంది. తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది.
టాలీవుడ్ యువ కథానాయకుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ ఇలాగే ఇబ్బందుల్లో పడ్డాడు. గణేష్ నవరాత్రుల సందర్భంగా తాను షేక్ పేటలో నివసించే కమ్యూనిటీకి దగ్గర్లో అర్గరాత్రి 2, 3 గంటల ప్రాంతంలో డీజే సౌండ్లతో హోరెత్తిస్తున్నారని, దీని మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినా ఫలితం లేకపోయిందని అతను ఇటీవల సోకిల మీడియాలో ఒక పోస్టు పెట్టాడు.
ఈ నెల 25 వరకు భరించక తప్పదని పోలీసులు చెప్పారని.. కానీ నిమజ్జనం అయ్యాక కూడా ఈ సౌండ్స్ అగట్లేదని.. దీని వల్ల తమ కమ్యూనిటీలో ఉన్న పెద్దవాళ్ళు, చిన్న పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారని పేర్కొంటూ ఒక వీడియో కూడా పోస్ట్ చేశాడు.
ఐతే ఈ పోస్టుతో శిరీష్ ఆశించిన ప్రయోజనం నెరవేరింది లేదో కానీ అతడికి సోషల్ మీడియాలో చాలా వ్యతిరేకత తెచ్చిపెట్టింది.
హిందూ పండగలపుడే ఈ సెలబ్రిటీలకు ఇలాంటి ఇబ్బందులు గుర్తుకు వస్తాయని.. హిందూ సంప్రదాయాలు, వేడుకలు అంటే అంత చిన్నచూపా అంటే అతడి మీద నెటిజన్లు విరుచుకు పడ్డారు. మసీదులు, చర్చిల నుంచి నుంచి వచ్చే సౌండ్స్ మాటేంటి.. వాటి మీద కూడా ఇలాగే రెస్పాండ్ అవుతారా అంటూ కొందరు ప్రశ్నించారు. అసలు నువ్వు సనాతనివేనా అంటూ నిలదీశారు.
దీంతో బెంబేలెత్తిన శిరీష్ తాను సనాతనిని, హిందూ భక్తుడిని అని రుజువు చేసుకోవాల్సి వచ్చింది. తాను పరమ ఆంజనేయ భక్తుడిని అని చాటుతూ.. కొన్ని ఫోటోలను రుజువుగా చూపిస్తూ మళ్ళీ ఒక పోస్ట్ పెట్టాడు శిరీష్. తాను హిందూ మతాన్ని ఆచరిస్తానని.. ఆంజనేయస్వామి భక్తుడిని అని చెబుతూ.. అర్ధరాత్రి 2 గంటలకు భారీ సౌండుతో పాటలు ప్లే చెయ్యడం భక్తి కాదు అని పేర్కొన్నాడు. తాను కంప్లైంట్ చేసింది సివిక్ సెన్స్ గురించే తప్ప భక్తి గురించి కాదని స్పష్టం చేశాడు.
This post was last modified on September 28, 2026 4:52 pm
నిన్న ఆదర్శ కుటుంబం ఏకె 47 నుంచి విడుదలైన నారాయణమ్మ పాట సోషల్ మీడియాలో డిస్కషన్ కు దారి తీస్తోంది.…
ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువతకు ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ చేసిన సూచన ఇప్పుడు వైరల్ అవుతోంది. ఉద్యోగం…
ఈ రోజుల్లో మంచి పని చేయడం ఎంత ముఖ్యమో...ఆ పనిపై జరిగే విషప్రచారాన్ని ఖండించడం కూడా అంతే ముఖ్యం. మరీ…
రాత్రి నిద్రపోయే ముందు ఫోన్ చూడటం చాలామందికి అలవాటుగా మారిపోయింది. గదిలో లైట్లు ఆపేసిన తర్వాత కూడా మొబైల్ స్క్రీన్…
సరిగ్గా ఇంకో పదకొండు రోజుల్లో ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల కానుంది. సంక్రాంతికి వస్తున్నాం లాంటి మూడు వందల…
ముంబైలోని గోరేగావ్‌లో పబ్లిక్ టాయిలెట్‌కు వెళ్లిన ఇద్దరు యువకులు అక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒకేసారి ఇద్దరు చనిపోవడంతో అసలు లోపల…