Political News

చెడ్డపేరు చేతులారా కొని తెచ్చుకుంటున్నారు

అధికారంలో ఉండగా తమదైన బెదిరింపులకు పాల్పడిన వైపీపీ… అదికారం కోల్పోయాక మరింత దిగజారుడు తనాన్ని బయటపెట్టుకుంటోంది. మహిళలపై నిత్యం అకృత్యాలకు పాల్పడుతున్న వైసీపీ శ్రేణులు… తాజాగా ఓ మహిళా పోలీసు అధికారిపై వికృత చేష్టలకు పాల్పడి తమ నిజ నైజాన్ని బయటపెట్టుకున్నాయి. మహిళా పోలీసు అధికారిపై వైసీపీ శ్రేణులు సాగించిన అకృత్యాలకు సంబంధించిన వీడియో వైరల్ కాగా… దానిని చూసిన టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ చేస్తున్న ఈ తరహా దారుణాలకు తప్పనిసరిగా కఠిన దండన తప్పదని ఆయన సంచలన ప్రకటన చేశారు.

మహిళలపై తమకంటే గౌరవం చూపే వారు లేరని చెప్పే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… ఆస్తుల విషయంలో తల్లి, చెల్లిలతో గొడవ పడి వారిని బయటకు గెంటేశారన్న అపప్రదను మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. తోడబుట్టిన చెల్లికి ఆపరేషన్ జరిగినా స్పందించని జగన్…మహిళల పట్ల తనకు ఏ పాటి ఆత్మీయత ఉందన్న విషయాన్ని నిరూపించుకున్నారని చెప్పక తప్పదు. తమ అధినేత అడుగు జాడల్లోనే సాగుతున్న వైసీపీ శ్రేణులు… తాము కూడా తమ అధినేతకు ఏమాత్రం తీసిపోయేది లేదని నిరూపించుకుంటున్నారు. ఇందుకు నిదర్శనంగానే శ్రీకాకుళంలో జరిగిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.

ఇటీవలే వైసీపీ రాష్ట్రవ్యాప్త నిరసనలకు దిగిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా శ్రీకాకుళంలో ఆ పార్టీ శ్రేణులు పరిధి దాటి వ్యవహరించాయి. నిరసనలో బాగంగా గుంపుగా గూడిన వైసీపీ శ్రేణులను కట్టడి చేసేందుకు విధి నిర్వహణలో ఉన్న ఓ మహిళా ఎస్సై ఆ గుంపు మధ్యలోకి వెళ్లారు. ఈ సందర్భంగా పోలీసు అధికారి… అందులోనూ మహిళా పోలీసు అధికారి అని కూడా చూడకుండా ఆమెపై వైసీపీ శ్రేణులు దారుణంగా వ్యవహరించాయి. మహిళా ఎస్సైని చుట్టుముట్టిన వైసీపీ మూకలు… ఆమెను అసభ్యకరంగా తాకుతూ శునకానందం పొందాయి. మృగాళ్లుగా మారిన వైసీపీ నేతల నుంచి తప్పించుకునేందుకు కూడా ఆమెకు అవకాశం లేకపోయింది.

వైసీపీ శ్రేణులు తన ఒంటిపై చేతులు వేస్తూ వికృతానందం పొందుతూ సాగితే.. వారి బారి నుంచి తప్పించుకునేందుకు ఆ మహిళా ఎస్సై… తన శరీరానికి చేతులు అడ్డం పెట్టుకుని… ముఖాన్ని చేతుల్లో దాచుకుని… ఎటు వెళ్లాలో తెలియని స్థితిలో కొంతసేపు సతమతం అయ్యారు. ఈ దృశ్యాన్ని చూస్తే.. నిజంగానే వైసీపీ శ్రేణులపై ఎక్కడ లేని కోపం రాక మానదు. ఈ వీడియోను చూసిన వెంటనే లోకేశ్ ఘాటుగా స్పందించారు. మహాిళలన్ని అవమానించడం, రాక్షసానందం పొందం వైసీపీ డీఎన్ఏలోనే ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లి, చెల్లిని గెంటేసిన చరిత్ర జగన్ ది అయితే… కనిపించిన ప్రతి మహిళను వేధించడం వైసీపీ నాయకుల సంస్కృతిగా మారిందని ఆయన ఆక్షేపించారు. శ్రీకాకుళం ఘటనకు బాధ్యులైన వైసీపీ నేతలను గూండాలుగా అభివర్ణించిన లోకేశ్… వారికి కఠిన దండన తప్పదని తేల్చి చెప్పారు. 

This post was last modified on July 31, 2026 5:18 pm

Share

Recent Posts

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

2 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

3 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

3 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

4 hours ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

4 hours ago

తండ్రిపై ప్రేమ‌.. శ‌వాన్ని నాలుగేళ్లుగా.. !

తల్లిదండ్రుల‌పై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వ‌ర‌కు ఉండాల్సిందే. కానీ, జ్యాత‌స్య‌హి ధ్రువో మృత్యు.. అన్న‌ట్టుగా కాలం…

5 hours ago