స్టార్ హీరోల వారసులు ఇండస్ట్రీలో అడుగు పెట్టడం సర్వసాధారణం. దక్షిణాదిలో అత్యధిక శాతం దీన్ని కొడుకులకే పరిమితం చేస్తూ ఉంటారు. రజనీకాంత్ తనయలు ఇద్దరు చాలా ఆలస్యంగా దర్శకులు, నిర్మాతలుగా మారారు తప్పించి కెమెరా ముందుకు వచ్చే రిస్క్ చేయలేదు. కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ ఈ విషయంలో గెలిచి చూపించింది. చిరంజీవి అసలా ఆలోచనే చేయకపోగా వెంకటేష్ కూడా అదే బాటలో పిల్లల లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ వచ్చారు.
ఒకపక్క నందమూరి అభిమానులు మోక్షజ్ఞ వస్తాడా రాడాని ఎదురు చూస్తుంటే ఊహించని విధంగా బాలకృష్ణ రెండో కూతురు తేజస్విని త్వరలో తెరంగేట్రం చేయబోతున్నట్టు లేటెస్ట్ అప్డేట్. ఆ మధ్య ఒక వాణిజ్య ప్రకటనతో పాటు రెండు డాన్స్ రీల్స్ ద్వారా సోషల్ మీడియాలో ఆమెకు మంచి పేరే వచ్చింది. పెళ్లి చేసుకుని తల్లయ్యాక కూడా ఇంత గ్రేస్ చూపించడం ఫ్యాన్స్ ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదంతా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కోసం ట్రయిల్స్ అని బహుశా వాళ్ళు ఊహించి ఉండరు.
ఒక ఫిమేల్ ఓరియెంటెడ్ సబ్జెక్టు తేజస్విని కోసం రెడీ అవుతోందట. మంచి మెసేజ్ తో పాటు స్క్రీన్ ప్లే ఓరియెంటెడ్ గా ఇది రాయిస్తున్నట్టు తెలిసింది. దర్శకుడు, ఇతర క్యాస్టింగ్ వివరాలు త్వరలో బయటికి రాబోతున్నాయి. బిజినెస్ కోణంలో కాకుండా ఒక మంచి చిత్రం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుకి బాలయ్య సలహాలు సూచనలు అందుతున్నాయని సమాచారం. తేజస్విని డెబ్యూ గ్రాండ్ గా చేస్తారా లేక సింపుల్ గా కానిచ్చి ఘనంగా విడుదల చేస్తారానేది వేచి చూడాలి.
గతంలో కృష్ణ గారి కూతురు మంజులని తెరకు పరిచయం చేయాలని కొందరు దర్శకులు ప్రయత్నించినప్పుడు ఫ్యాన్స్ వద్దన్నారు. దీంతో ఆవిడ షో అనే కంటెంట్ మూవీలో నటించి ఆ తర్వాత రెండు మూడు సినిమాలకు దర్శకత్వం వహించి సైలెంట్ అయిపోయారు. అప్పటి రోజులు అలా ఉండేవి. కానీ జెన్ జీ కాలంలో టాలెంట్ ముఖ్యం. అది ఉందంటే అతిగా ఆలోచించకుండా సినిమా నచ్చితే చాలు హిట్ ఇచ్చేస్తారు. తమ్ముడు కన్నా ముందు వస్తున్న తేజస్విని ఎలా మెప్పిస్తారో వేచి చూడాలి.
This post was last modified on July 31, 2026 2:15 pm
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…
తల్లిదండ్రులపై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వరకు ఉండాల్సిందే. కానీ, జ్యాతస్యహి ధ్రువో మృత్యు.. అన్నట్టుగా కాలం…