Political News

విపక్షాలు ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తున్నాయి?

ఎన్నికల సంఘం అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కాక్రోచ్ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజిత్ దీప్కే ఎన్నికల బహిష్కరణకు పిలుపునివ్వడం సంచలనం సృష్టిస్తోంది. విపక్షాలు ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల ఎన్నికలకు చట్టబద్దత కల్పించిన వారవుతున్నారన్న దీప్కే కామెంట్స్ ఆలోచన రేకేత్తించిందనే చెప్పాలి. దీంతో ఎన్నికల సంఘంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా ఉలిక్కిపడింది. దీప్కే పిలుపుకు విపక్షాల మద్దతు లభిస్తే రానున్న రోజుల్లో దేశంలో తీవ్రమైన రాజ్యాంగ సంక్షోభం తలెత్తే ప్రమాదం వుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అదే జరిగితే కేంద్రం దిగిరాక తప్పదు. ఎన్నికల సంఘాన్ని ప్రక్షాళన చేయక తప్పదని మేధావులు చెబుతున్నారు.

ఎన్నికల సంఘం అక్రమాలకు పాల్పడుతోందని కొద్ది రోజులుగా రచ్చ రచ్చ చేస్తున్న విపక్షాలనుద్దేశించి దీప్కే ఇవ్వాళ ఒక ట్విట్ చేశారు. ఎన్నికల్లో రిగ్గింగ్ జరుగుతున్నప్పుడు మీరెందుకు ఎన్నికల్లో పాల్గొంటున్నారని సూటిగా ప్రశ్నించారు. మీరు పోటీ చేయడం వల్ల ఎన్నికలు సజావుగా జరుగుతున్నట్లు ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. ఒకవైపు ఎన్నికల సంఘం ఎన్నికల్ని రిగ్గింగ్ చేస్తుందని ఆరోపిస్తూనే మరోవైపు అవే ఎన్నికల్లో పాల్గొనడం ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లే కదా అని నిలదీశారు. ఎన్నికల అక్రమాలను అడ్డుకోవాలంటే ఎన్నికలను బహిష్కరించడం ఒక్కటే పరిష్కారమని తేల్చి చెప్పారు.

అంతేకాకుండా మీకు ముఖ్యమైన రాష్ట్రంలో రిగ్గింగ్ జరిగినప్పుడు మాత్రమే మాట్లాడి మిగతా చోట్ల రిగ్గింగ్ జరిగినప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉండటంలో విపక్షాల ఉద్దేశ్యం ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలో రిగ్గింగ్ జరిగినా, దానివల్ల ఏ పార్టీకి నష్టం జరిగినా విపక్షాలన్ని మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నప్పటికీ సొంత మనుగడ కోసమే పోటీ చేస్తున్నారని, అంటే జరుగుతున్న అక్రమాలలో మీకు భాగస్వామ్యం వున్నట్లేనని చురకలంటించారు. మోసపూరిత ఎన్నికల్లో పాల్గొనడం మానుకోవాలని సూచించారు.

ఎన్నికల అక్రమాల వెనక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వుందని కాంగ్రెస్, టీఎంసీ, శివసేన తదితర పార్టీలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెల్సిందే. నిజానికి గత పదేళ్లుగా ఎన్నికల నిర్వహణ మీద ఆరోపణలు వస్తూనే వున్నాయి. ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయడం మానుకోవడం లేదు. దీన్నే తప్పు పట్టారు దీప్కే. ఆటలో తొండి జరుగుతున్నప్పుడు అలాంటి ఆట ఆడక పోవడమే మంచిది కదానేది దీప్కే మాట. ఒట్టి ఆరోపణలు చేసి మళ్ళీ అదే ఆట ఆడటం వల్ల ఉపయోగం లేదంటూ స్పష్టం చేస్తున్నాడు. చూడాలి…ఇప్పుడు విపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏమి చేస్తుందో.

This post was last modified on September 25, 2026 7:53 pm

Share

Recent Posts

ప్రియదర్శికి కలిగిన ప్రయోజనం ఎక్కువే

టాలెంట్ లోటు లేకపోయినా కథల ఎంపికలో చేసిన పొరపాట్ల వల్ల ప్రియదర్శి కెరీర్ రెండు హిట్లు నాలుగు ఫ్లాఫుల్లా సాగిపోతోంది.…

3 hours ago

నాయకులు చెబుతున్నా నేతలు కదలడం లేదు

త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ఉద్దేశించి టీడీపీ అధినేత‌, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లు సీరియ‌స్‌గా ఉన్న…

3 hours ago

జైలర్ 2 కోసం రెండో నెంబర్ అలెర్ట్

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన జైలర్ 2 మీద అంచనాలు ఏ స్థాయిలో…

3 hours ago

ధనుష్ నుంచి ఇది నేర్చుకోవచ్చు

స్టార్ హీరోలకు వేగం అవసరం. ఒకప్పుడు ఎన్టీఆర్, కృష్ణ, చిరంజీవి లాంటి వాళ్ళు ఏడాదికి పది నుంచి పదిహేను సినిమాలు…

4 hours ago

మోడీ ఇలాకాలో లోకేష్ దూకుడు

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజ‌రాత్‌లోనూ పారిశ్రామిక పెట్టుబ‌డి దారుల‌ను క‌లిసిన ఏపీ మంత్రి నారా లోకేష్‌.. ఏపీలో…

5 hours ago

సీఈసీ వివాదం… ఇది ఎవరి సమస్య?

కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్‌ను అభిశంసించాల‌న్న డిమాండ్ పెరుగుతోంది. ఆ ప‌ద‌వికి ఆయ‌న అన‌ర్హుడ‌ని.. పేర్కొంటూ..…

7 hours ago