Movie News

8 నెలలు వెతికిన విలన్ న్యాయం చేశాడా

తాజాగా విడుదలైన ది ప్యారడైజ్ మీద చర్చలు, ట్రోల్స్, కలెక్షన్ల మీద డిబేట్లు అన్నీ సోషల్ మీడియాలో జరుగుతూనే ఉన్నాయి. నాని కెరీర్ హయ్యెస్ట్ ఓపెనింగ్ వచ్చినా కూడా అభిమానులు పూర్తి ఆనందంలో లేరు. కారణం ఆన్ లైన్ లో కనిపిస్తున్న ప్రతికూల ప్రచారం. అధిక శాతం ఆడియన్స్ కంటెంట్ పట్ల సానుకూలంగా స్పందించకపోవడం వసూళ్ల మీద ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికైతే బుకింగ్స్ బాగున్నాయి కానీ వీకెండ్ తర్వాత ఎంత వరకు హోల్డ్ ఉంటుందనేది వేచి చూడాలి.

ఇదిలా ఉండగా ప్యారడైజ్ లో కొన్ని పాత్రల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. వాటిలో ఒకటి రాఘవ్ జుయెల్ పోషించిన విక్రమ్ మాలిక్ క్యారెక్టర్. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చెప్పిన ప్రకారం ముందు చాలా మంది టాలీవుడ్ ఆర్టిస్టులను ట్రై చేశారు. తరువాత టీమ్ సభ్యులు రాఘవ్ ఫోటో చూపిస్తే వేరే ఆలోచన చేయకుండా వెంటనే కలిశారు. అప్పటికే తనకు ‘కిల్’లో చూపించిన విలనీకి చాలా పేరొచ్చింది. తర్వాత మళ్ళీ అంత బ్రేక్ ఇచ్చే మూవీ ప్యారడైజ్ అవుతుందని తీసుకొచ్చారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాఘవ్ చూపించిన ఎనర్జీ అంతా ఇంతా కాదు. స్టేజి మీద డాన్సు చేశాడు. నాని, శ్రీకాంత్ ఓదెల మీద భక్తి ప్రదర్శించాడు. డబ్బులు ఎక్కువ ఇచ్చారని నిర్మాత సుధాకర్ చెరుకూరిని ప్రశంశలతో ముంచెత్తాడు. ఇంతా చేసి విక్రమ్ మాలిక్ క్యారెక్టర్ కేవలం ఫస్ట్ హాఫ్ కే పరిమితమయ్యింది. బారుడు మీసం, ఒంటి నిండా నగలతో ఉన్నంతలో డిఫరెంట్ గా మెప్పించే ప్రయత్నం చేశాడు. ఇప్పటిదాకా తెరపై చూడని విలన్ పాత్ర అయితే కాదు.

రాఘవ్ జుయెల్ ప్రస్థానం పన్నెండేళ్ల క్రితం సోనాలి కేబుల్ తో మొదలయ్యింది. ఇంత సుదీర్ఘమైన కెరీర్ లో ఎక్కువ సినిమాలు చేయలేదు. కిల్ వచ్చేదాకా ఇతను ఉన్నాడనే విషయం థియేటర్ ఆడియన్స్ కి పెద్దగా అవగాహన లేదు. టీవీలో మటుకు యాంకర్, సీరియల్స్ నటుడిగా బోలెడు పేరు ప్రఖ్యాతులున్నాయి. అవార్డులు కూడా సాధించాడు. డిసెంబర్ లో రిలీజ్ కాబోయే షారుఖ్ ఖాన్ కింగ్ లో రాఘవ్ జుయెల్ ముఖ్య పాత్ర పోషించాడు. చూడాలి అదెలాంటి బ్రేక్ ఇస్తుందో.

This post was last modified on September 25, 2026 3:03 pm

Share

Recent Posts

ధనుష్ నుంచి ఇది నేర్చుకోవచ్చు

స్టార్ హీరోలకు వేగం అవసరం. ఒకప్పుడు ఎన్టీఆర్, కృష్ణ, చిరంజీవి లాంటి వాళ్ళు ఏడాదికి పది నుంచి పదిహేను సినిమాలు…

32 minutes ago

మోడీ ఇలాకాలో లోకేష్ దూకుడు

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజ‌రాత్‌లోనూ పారిశ్రామిక పెట్టుబ‌డి దారుల‌ను క‌లిసిన ఏపీ మంత్రి నారా లోకేష్‌.. ఏపీలో…

2 hours ago

సీఈసీ వివాదం… ఇది ఎవరి సమస్య?

కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్‌ను అభిశంసించాల‌న్న డిమాండ్ పెరుగుతోంది. ఆ ప‌ద‌వికి ఆయ‌న అన‌ర్హుడ‌ని.. పేర్కొంటూ..…

3 hours ago

నిజాయితీగా ఉండటం మంచిదే అయినా

ప్రీమియర్ షో పూర్తయినప్పటి నుంచి ది ప్యారడైజ్ మీద సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న రచ్చ అందరూ చూస్తున్నదే. పాజిటివ్…

3 hours ago

విపక్షాలు ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తున్నాయి?

ఎన్నికల సంఘం అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కాక్రోచ్ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజిత్ దీప్కే ఎన్నికల బహిష్కరణకు పిలుపునివ్వడం…

7 hours ago

దృశ్యం-3… అసలు కంటే కొసరుకే క్రేజ్

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్ల జాబితా తీస్తే.. అందులో ‘దృశ్యం’ ముందు వరుసలో నిలుస్తుంది. మలయాళంలో సెన్సేషనల్…

7 hours ago