Movie News

దృశ్యం-3… అసలు కంటే కొసరుకే క్రేజ్

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్ల జాబితా తీస్తే.. అందులో ‘దృశ్యం’ ముందు వరుసలో నిలుస్తుంది. మలయాళంలో సెన్సేషనల్ హిట్ అయ్యాక దాదాపు పది భాషల్లో రీమేక్ అయిన మూవీ ఇది. అందులో చైనీస్, సింహళీస్ లాంటి విదేశీ భాషలు కూడా ఉండడం విశేషం. అన్ని చోట్లా మంచి స్పందనే తెచ్చుకుంది. దీనికి కొనసాగింపుగా వచ్చిన ‘దృశ్యం-2’ కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంది. కానీ ఫస్ట్ సీక్వెల్ తర్వాత ఈ కథను ఇక్కడితో ముగించేస్తే బాగుండనే అనిపించింది.

ఇంకో సీక్వెల్ అనౌన్స్ చేసినపుడు ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన లేదు. కొన్ని నెలల ముందు మలయాళంలో విడుదలైన ‘దృశ్యం-3’ ప్రేక్షకులను నిరాశకు గురి చేసింది. అనవసరంగా ఈ కథను సాగదీసిన ఫీలింగ్ కలిగించిందీ మూవీ. ప్రి రిలీజ్ హైప్ వల్ల.. మోహన్ లాల్ స్టార్ పవర్ వల్ల ఈ చిత్రానికి వసూళ్లు వచ్చాయి కానీ.. ‘దృశ్యం’ ఫ్రాంఛైజీలో తొలి రెండు చిత్రాలకు ఈ మూవీ దరిదాపుల్లో కూడా నిలవలేకపోయింది. అందుకే దీని తెలుగు రీమేక్ పనులు కూడా ముందుకు సాగలేదు. ఆ సినిమా తీయొద్దని నిర్ణయించుకున్నారు. కన్నడలో కూడా దీని సీక్వెల్ ఆగిపోయింది.

ఐతే ఓవైపు మలయాళంలో జీతు జోసెఫ్ ‘దృశ్యం-3’ తీస్తుండగానే.. హిందీలో రీమేక్ పట్టాలెక్కింది. అజయ్ దేవగణ్, శ్రియ లీడ్ రోల్స్‌లో కొనసాగగా.. టబుతో పాటు మరికొన్ని పాత్రలను ఇందులో కొనసాగించారు. కొత్తగా ‘పాతాళ్ లోక్’ ఫేమ్ జైదీప్ అహ్లావత్‌ ఈ ప్రాజెక్టులోకి వచ్చాడు. అభిషేక్ పాఠక్ రూపొందిస్తున్న ఈ సినిమా కోసం కథ.. జీతు జోసెఫ్ నుంచి తీసుకున్నది కాదు. హిందీలో వేరుగా స్టోరీ చేసుకున్నారు.

ఈ మధ్యే రిలీజైన ‘దృశ్యం-3’ ట్రైలర్ చూస్తే చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించింది. మలయాళ వెర్షన్‌తో పోలిస్తే చాలా ఆసక్తి రేకెత్తించింది ఆ ప్రోమో. మలయాళంలో అనవసరంగా కథను సాగదీస్తున్న ఫీలింగ్ మరింత పెరిగిపోవడానికి కారణం.. కథను ముగించకుండా ఓపెన్ ఎండింగ్ ఇవ్వడం. దృశ్యం నుంచి మరింత పిండుకోవడం కోసం ఈ మధ్యే ఇంకో సీక్వెల్ కూడా అనౌన్స్ చేశారు.

కానీ హిందీలో మాత్రం పార్ట్-3తో ఈ ఫ్రాంఛైజీని ముగించేస్తున్నారు. అందుకే దీనికి ‘ది కంక్లూజన్’ అని ట్యాగ్ లైన్ కూడా పెట్టారు. సినిమాకు నార్త్ మార్కెట్లో మంచి హైప్ ఉంది. అక్టోబరు 2న రానున్న ఈ చిత్రం తొలి రోజు రూ.40 కోట్ల ఓపెనింగ్స్ సాధిస్తుందని ట్రేడ్ పండిట్లు అంచనా వేస్తున్నారు. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే.. అజయ్ దేవగణ్ కెరీర్లో అతి పెద్ద హిట్లలో ఇది ఒకటిగా నిలిచే అవకాశముంది.

This post was last modified on September 25, 2026 7:39 pm

Share

Recent Posts

ధనుష్ నుంచి ఇది నేర్చుకోవచ్చు

స్టార్ హీరోలకు వేగం అవసరం. ఒకప్పుడు ఎన్టీఆర్, కృష్ణ, చిరంజీవి లాంటి వాళ్ళు ఏడాదికి పది నుంచి పదిహేను సినిమాలు…

56 minutes ago

మోడీ ఇలాకాలో లోకేష్ దూకుడు

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజ‌రాత్‌లోనూ పారిశ్రామిక పెట్టుబ‌డి దారుల‌ను క‌లిసిన ఏపీ మంత్రి నారా లోకేష్‌.. ఏపీలో…

2 hours ago

సీఈసీ వివాదం… ఇది ఎవరి సమస్య?

కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్‌ను అభిశంసించాల‌న్న డిమాండ్ పెరుగుతోంది. ఆ ప‌ద‌వికి ఆయ‌న అన‌ర్హుడ‌ని.. పేర్కొంటూ..…

3 hours ago

నిజాయితీగా ఉండటం మంచిదే అయినా

ప్రీమియర్ షో పూర్తయినప్పటి నుంచి ది ప్యారడైజ్ మీద సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న రచ్చ అందరూ చూస్తున్నదే. పాజిటివ్…

3 hours ago

విపక్షాలు ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తున్నాయి?

ఎన్నికల సంఘం అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కాక్రోచ్ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజిత్ దీప్కే ఎన్నికల బహిష్కరణకు పిలుపునివ్వడం…

7 hours ago

తమన్నా కొత్త సినిమా చూడక్కర్లేదా

మన దగ్గర తెరమీద కనిపించడం మానేసింది కానీ బాలీవుడ్ ఆఫర్లతో మిల్కి బ్యూటీ తమన్నా కెరీర్ దివ్యంగానే ఉంది. సినిమాలు,…

8 hours ago