మన దగ్గర తెరమీద కనిపించడం మానేసింది కానీ బాలీవుడ్ ఆఫర్లతో మిల్కి బ్యూటీ తమన్నా కెరీర్ దివ్యంగానే ఉంది. సినిమాలు, వెబ్ సిరీస్ తో డైరీ ఖాళీ లేకుండా జరిగిపోతోంది. ప్రియుడు విజయ్ వర్మతో బ్రేకపయ్యాక కొంత గ్యాప్ తీసుకున్న తమన్నా తాజాగా ది వాన్ అనే కొత్త మూవీతో థియేటర్లకు వచ్చింది. పంచాయత్ లాంటి బ్లాక్ బస్టర్ సిరీస్ తీసిన దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వంలో రూపొందిన ఈ హారర్ డ్రామాకి పబ్లిసిటీ బాగానే చేశారు కానీ ఆశించిన ఓపెనింగ్ దక్కలేదని బుకింగ్స్ స్పష్టం చేస్తున్నాయి.
ముందు కథేంటో చూద్దాం. రిషి(సిద్దార్థ్ మల్హోత్రా) సివిల్ ఇంజనీర్. భార్య మమత(తమన్నా భాటియా)తో కలిసి పిల్లలు లేరనే లోటుతో ముంబై జీవితాన్ని నెట్టుకొస్తూ ఉంటాడు. సాంప్రదాయ ఛత్ పూజ కోసం దంపతులు రిషి స్వంత గ్రామమైన దేవాంచల్ వెళ్తారు. అక్కడ తన భూమిని రోడ్డు డెవలప్ మెంట్ కోసం అమ్మాలనే ప్లాన్ రిషిది. కానీ వన దేవత ఆలయం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. ఇదంతా మూఢనమ్మకమని కొట్టి పారేసిన రిషి స్వంతంగా అడవిలోకి వెళ్తాడు. ఆ తర్వాత జరిగేది అసలు కథ.
ఇప్పటికే లెక్కలేనన్నిసార్లు వచ్చిన ఇలాంటి బ్యాక్ డ్రాప్ నే మళ్ళీ తీసుకోవడం ఏమిటో ఎంత బుర్ర గోక్కున్నా అంతు చిక్కదు. శ్రద్ధ కపూర్ స్త్రీతో మొదలుపెట్టి కాజోల్ మా దాకా ఎన్ని వచ్చాయో లెక్కలేదు. భూత్ బంగ్లా కూడా ఈ లైన్ కు దగ్గరగా ఉంటుంది. అయినా సరే ఏదో జనాన్ని భయపెట్టాలని దర్శకుడు దీపక్ కుమార్ చేసిన ప్రయత్నం ఆశించిన ఫలితం ఇవ్వలేదు. టీవీ సీరియల్ తరహా టేకింగ్ తో ముఖ్యంగా సెకండాఫ్ లో థియేటర్లకు వచ్చిన ప్రేక్షకుల సహనంతో ఫుట్ బాల్ ఆడుకుంటాడు.
అవసరం లేని కామెడీ, బలవంతంగా ఇరికించిన ఎమోషన్లు, రొటీన్ అనిపించే కొన్ని ట్విస్టులు ఎప్పుడెప్పుడు క్లైమాక్స్ వస్తుందా అనిపించేలా చేస్తాయి. బ్యాక్ స్టోరీస్ ఎక్కువైపోవడం నిడివిని పెంచింది. విఎఫ్ఎక్స్ కూడా అంతంత మాత్రమే. క్వాలిటీ విషయంలో నిర్మాతలు జాగ్రత్తలు తీసుకోలేదు. తమన్నా, సిద్దార్థ్ మల్హోత్రా నటన ఓకే కానీ సునీల్ గ్రోవర్, మనీష్ పాల్ పాత్రలు కామెడీ చేయబోయి రివర్స్ అయ్యాయి. ఓపిక బోలెడు ఉంటే తప్ప వాన్ చివరిదాకా భరించడం కష్టమనేలా ఉంది.
This post was last modified on September 25, 2026 3:11 pm
టాలెంట్ లోటు లేకపోయినా కథల ఎంపికలో చేసిన పొరపాట్ల వల్ల ప్రియదర్శి కెరీర్ రెండు హిట్లు నాలుగు ఫ్లాఫుల్లా సాగిపోతోంది.…
త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ఉద్దేశించి టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లు సీరియస్‌గా ఉన్న…
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన జైలర్ 2 మీద అంచనాలు ఏ స్థాయిలో…
స్టార్ హీరోలకు వేగం అవసరం. ఒకప్పుడు ఎన్టీఆర్, కృష్ణ, చిరంజీవి లాంటి వాళ్ళు ఏడాదికి పది నుంచి పదిహేను సినిమాలు…
ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోనూ పారిశ్రామిక పెట్టుబడి దారులను కలిసిన ఏపీ మంత్రి నారా లోకేష్.. ఏపీలో…
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను అభిశంసించాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఆ పదవికి ఆయన అనర్హుడని.. పేర్కొంటూ..…