ప్రీమియర్ షో పూర్తయినప్పటి నుంచి ది ప్యారడైజ్ మీద సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న రచ్చ అందరూ చూస్తున్నదే. పాజిటివ్ కన్నా ఎక్కువ నెగటివ్ కామెంట్స్, ట్రోలింగ్స్ ఒక ప్రవాహంలా జరుగుతూనే ఉన్నాయి. బ్లాక్ బస్టర్లు, డిజాస్టర్లు ఇండస్ట్రీ, ప్రేక్షకులు ఎప్పటి నుంచో చూస్తున్నదే. కొత్త కాదు, ఇకపై కూడా వస్తూనే ఉంటాయి. మరి కేవలం ప్యారడైజ్ మాత్రమే ఇంత డిస్కషన్ కు నోచుకోవడం విచిత్రం. తాజాగా నాని స్పందించాడు. తన మనసులో మాటలను ఎక్స్ లో పంచుకున్నాడు.
ఆ మెసేజ్ లో చెప్పిన దాని ప్రకారం నాని ఈ ప్యారడైజ్ కు సంబంధించిన స్పందనలన్నీ చూశాడు. ఎంత ప్రేమ చూపించారో కళ్లారా చూసి సంతోషపడ్డాడు. అదే విధంగా నవ్వుకునేలా ట్రోల్ చేసిన వైనాన్ని గమనించాడు. వీటిని హృదయపూర్వకంగా స్వాగతించాడు. క్రిటిక్స్ ఎత్తిచూపిన లోపాల నుంచి నేర్చుకున్నానని నిజాయితీగా ఒప్పేసుకున్నాడు. రక్తం, చెమట చిందించి ప్యారడైజ్ తీశామని, తీర్పులు ఇస్తారో ప్రేమిస్తారో అంతా మీ చేతుల్లోనే ఉందని కృతజ్ఞతలు చెబుతూ ముగించాడు.
ఇది మంచిదే. చుట్టూ జరుగుతున్న దాన్ని చూస్తూ కూడా ఏమి తెలియనట్టు నటించే కొందరు హీరోల కన్నా ఇలా ఉన్నది ఉన్నట్టు ఒప్పేసుకున్న నాని హానెస్టీని మెచ్చుకోవలసిందే. అయితే అదేదో ఇంకో రెండు మూడు రోజులు ఆగి చెప్పి ఉంటే బాగుండేదనే అభిప్రాయం ఫ్యాన్స్ నుంచి వ్యక్తమవుతోంది. తన సందేశంలో నాని ఎక్కడా ఫ్లాప్ అనే మాట వాడలేదు కానీ నేర్చుకుంటాను, ట్రోల్స్ తీసుకున్నానని చెప్పడం ఏమైనా నెగటివ్ అవుతుందేమోనని వాళ్ళ టెన్షన్.
ఏది ఏమైనా నాని ఇంత ఓపెన్ గా బయట పడటం సినీ ప్రియులను కదిలిస్తోంది. టాక్ సంగతి ఎలా ఉన్నా రెండో రోజు కూడా ప్యారడైజ్ బుకింగ్స్ బాగున్నాయి. వారాంతం వరకు బలంగా ఉంటే రికవరీ శాతం పెరుగుతుంది. సక్సెస్ లేదా ప్రెస్ మీట్ పెట్టే ఉద్దేశంలో నాని ఉన్నట్టు కనిపించడం లేదు. అలాంటిది ఏదైనా ఉంటే ఆదివారంలోపు ప్లాన్ చేసుకుంటే కలెక్షన్లకు కొంత బలం వస్తుంది. నాని తర్వాతి సినిమా బ్లడీ రోమియో అక్టోబర్ నుంచే సెట్స్ పైకి వెళ్లొచ్చని లేటెస్ట్ అప్డేట్.
This post was last modified on September 25, 2026 7:32 pm
స్టార్ హీరోలకు వేగం అవసరం. ఒకప్పుడు ఎన్టీఆర్, కృష్ణ, చిరంజీవి లాంటి వాళ్ళు ఏడాదికి పది నుంచి పదిహేను సినిమాలు…
ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోనూ పారిశ్రామిక పెట్టుబడి దారులను కలిసిన ఏపీ మంత్రి నారా లోకేష్.. ఏపీలో…
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను అభిశంసించాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఆ పదవికి ఆయన అనర్హుడని.. పేర్కొంటూ..…
ఎన్నికల సంఘం అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కాక్రోచ్ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజిత్ దీప్కే ఎన్నికల బహిష్కరణకు పిలుపునివ్వడం…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్ల జాబితా తీస్తే.. అందులో ‘దృశ్యం’ ముందు వరుసలో నిలుస్తుంది. మలయాళంలో సెన్సేషనల్…
మన దగ్గర తెరమీద కనిపించడం మానేసింది కానీ బాలీవుడ్ ఆఫర్లతో మిల్కి బ్యూటీ తమన్నా కెరీర్ దివ్యంగానే ఉంది. సినిమాలు,…