Political News

ధర్మేంద్ర రాజీనామా… బొద్దింకలకు సరిపోదు!

కేంద్ర విద్యా శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. యువత భవిష్యత్తు కోసమే రాజీనామా చేశానని ఆయన చెప్పారు. దేశ భవిష్యత్తుకు, నవ భారతావనికి సరికొత్త వారసులు యువతేనని అన్నారు. 10 రోజులుగా జరుగుతున్న ఘటనలు తీవ్రంగా బాధించాయని, అందుకే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. కేంద్ర మంత్రిగా తనకు అవకాశం కల్పించిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద యువత సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పందించారు. తమకు రాజకీయాలు అవసరం లేదని ఆయన అన్నారు. శాంతియుతంగా చేసే ఆందోళనతో ఏ లక్ష్యమైనా తప్పక నెరవేరుతుందని మరోసారి నిరూపితమైందని, మహాత్మా గాంధీ స్ఫూర్తితో తాము శాంతియుత ఆందోళన చేశామని చెప్పారు. ఇది విద్యార్థుల విజయమని, విద్యార్థుల పోరాటం, నిరసనలు వృథా కాలేదని హర్షం వ్యక్తం చేశారు.

ఈ ఘటనతో విద్యార్థుల సత్తా ఏంటో తెలిసిందని, ప్రజాస్వామ్యం అంటే ఇదేనని అన్నారు. అయితే, తమకు రాజకీయాలు అక్కర్లేదని, తమ డిమాండ్లలో ఒకటి నెరవేరిందని, మరో రెండు కూడా నెరవేరేవరకు వేచి చూస్తామని అన్నారు. విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని, వారిపై దాడి చేసిన పోలీసులపై, ఢిల్లీ ఏసీపీ అజిత్ శర్మపై చర్యలు తీసుకోవాలని దీప్కే డిమాండ్ చేశారు.

విద్యా వ్యవస్థలో సమూల మార్పులు వచ్చేవరకు, సమగ్ర ప్రక్షాళన జరిగే వరకు ఈ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు కొవ్వొత్తులతో శాంతియుతంగా ర్యాలీ చేద్దామని యువతకు పిలుపునిచ్చారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

This post was last modified on July 25, 2026 3:26 pm

Share

Recent Posts

బీఆర్ఎస్‌కు క‌ష్ట కాల‌మా… న‌ష్ట కాల‌మా?!

దానం నాగేంద‌ర్‌పై వేటు ప‌డ‌డం.. ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావ‌డం.. ఇటీవ‌ల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…

3 hours ago

నాని న‌న్ను భ‌రించాల్సిందే… వేరే దారి లేదు – ఓదెల‌

శ్రీకాంత్ ఓదెల‌.. ఈ పేరు చెప్ప‌గానే అంద‌రికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…

5 hours ago

నానిని వీళ్లు పట్టుకున్నారు… వాళ్లు వదిలేశారు

నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…

5 hours ago

ప్యారడైజ్ మీటింగులో పదనిసలు

నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…

7 hours ago

ట్రబుల్ బృందానికి టైమ్ కలిసి వస్తోంది

వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…

8 hours ago

రామాయణ అలసత్వం వల్ల ఎవరికి లాభం

సెప్టెంబర్ అయిపోతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ప్రచారం చేసుకున్న రామాయణ పార్ట్ 1 విడుదలకు కేవలం నలభై రోజులు…

9 hours ago