Movie News

శ్రీగౌరి నేర్చుకోవాల్సిన బేబీ పాఠాలు

మూడేళ్ళ క్రితం బేబీ విడుదలై బ్లాక్ బస్టర్ సాధించాక అందరి  అటెన్షన్ తీసుకున్న అమ్మాయి వైష్ణవి చైతన్య. అప్పటిదాకా చిన్న సపోర్టింగ్ రోల్స్ చేస్తూ యూట్యూబ్ పాపులారిటీకి పరిమితమైన ఈమెకు బేబీ ఇచ్చిన బ్రేక్ మామూలుది కాదు. కేవలం సక్సెస్ వరించడమే కాదు తన పెర్ఫార్మన్స్ గురించి పది మంది గొప్పగా మాట్లాడుకునేలా చేసింది. వైష్ణవి కాకుండా ఇంకెవరైనా కొత్తమ్మాయి చేసి ఉంటే బేబీ ఆ స్థాయిలో ఇంపాక్ట్ చూపించి ఉండేదా అంటే సమాధానం చెప్పడం కష్టం.

ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకంటే అదే బ్యానర్ లో శ్రీగౌరి ప్రియా సక్సెస్ అందుకుంది. చెన్నై లవ్ స్టోరీలో భగ్న ప్రేమికురాలిగా, తాగుబోతుగా, ఆఫీస్ లో ఉద్యోగిగా, స్నేహితుల మధ్య ముక్కోపిగా ఇలా రకరకాల షేడ్స్ గొప్పగా పండించింది. కొన్ని చోట్ల కిరణ్ అబ్బవరంతో సహా ఆర్టిస్టులను సైడ్ చేసేంత స్థాయిలో డామినేషన్ చూపించింది. సక్సెస్ మీట్, థియేటర్ విజిట్స్ లో శ్రీగౌరి అంత ఎమోషనల్ కావడం వెనుక కారణం ఉంది. గతంలో ఇంత గుర్తింపు రాకపోవడమే.

అసలు విషయానికి వస్తే వైష్ణవి చైతన్య బేబీ తర్వాత పొరపాట్లు చేసింది. కేవలం అగ్ర నిర్మాత ఆఫర్ చేశారని లవ్ మీ ఇఫ్ యు డేర్ ఒప్పుకుంది. అదేమో దారుణంగా డిజాస్టర్ అయ్యింది. సబ్జెక్టు విన్నప్పుడే తన పాత్రకు అంత ప్రాధాన్యం లేదని గుర్తించి ఉంటే ఒక ఫ్లాప్ వచ్చేది కాదు. ఆ తర్వాత సిద్ధూ జొన్నలగడ్డతో జాక్ చేసింది. అది నేనేం తక్కువా అనే రేంజ్ లో బాక్సాఫీస్ వద్ద తిరస్కారానికి గురయ్యింది. మూడు సంవత్సరాల్లో వైష్ణవి నటించింది రెండు సినిమాలే.

ఇప్పుడు ఆనంద్ దేవరకొండతో చేస్తున్న ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ విడుదలకు రెడీ అవుతోంది. శ్రీ గౌరీ ప్రియా ఇకపై ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం కాంబోల ఉచ్చులో పడినా అసలుకే మోసం వస్తుంది. సాయిపల్లవి లాగా గ్లామర్ కి దూరంగా ఉంటూ, నటననే నమ్ముకుంటే పెద్ద స్థాయికి వెళ్ళవచ్చు. అది కథల ఎంపికల మీద ఆధారపడి ఉంటుంది. మరి నివిగా చెన్నై లవ్ స్టోరీలో అదరగొట్టిన ఈ తెలుగు అమ్మాయి భవిష్యత్తుని ఎలా ప్లాన్ చేసుకుంటుందో వేచి చూడాలి. 

This post was last modified on July 25, 2026 4:43 pm

Share

Recent Posts

తెలంగాణ‌కు ప్రకృతి విపత్తులా మారిన ఎల్‌నినో

తెలంగాణలో ఎల్‌నినో ప్రభావం ప్రకృతి విపత్తులా మారింది. ఫ‌లితంగా రాష్ట్రంలో తీవ్రమైన వర్షపాత లోటు నెల‌కొంది. రాబోయే 6 నుండి…

45 seconds ago

ముద్ర‌గ‌డ కుటుంబ రాజకీయానికి అడ్డుకట్ట వేస్తుంది ఎవరు?

వైసీపీ త‌ర‌ఫున ముద్ర‌గ‌డ కుటుంబానికి ద‌క్కుతున్న ఆద‌ర‌ణ ఎంత‌? ప‌ద్మ‌నాభం మృతి చెందిన త‌ర్వాత‌.. ఆ కుటుంబాన్ని ఆదుకుంటామ‌ని చెప్పిన…

45 minutes ago

త్రివిక్రమ్‌ గుర్తించాల్సిన అసలు ముప్పు

ఆదర్శ కుటుంబం అఫీషియల్ డేట్ కేవలం పది రోజుల ముందు వచ్చింది. వెంకటేష్ ద్వారా ఆన్ లైన్ అనౌన్స్ మెంట్…

1 hour ago

ప్రతిసారీ పోలికంటే ఎలా తమన్?

పేరుకేమో తెలుగులో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్. పెద్ద పెద్ద హీరోలు, డైరెక్టర్లు అతనే కావాలంటారు. భారీ సినిమాలకు పని…

2 hours ago

వంగవీటి రాధా అందరివాడు

విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ స్థానానికి జనసేన తరపున కూటమి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న వంగవీటి రాధాకృష్ణ పై వ‌స్తున్న…

3 hours ago

ఈ కారణంతో సాయిపల్లవిని ద్వేషించడమా?

ఒకప్పుడు నటీనటుల అందచందాలు, యాక్టింగ్ స్కిల్స్‌ను బట్టే సినిమాలు చూసేవారు జనాలు. కానీ సోషల్ మీడియా జమానాలో సినిమాలు చూడ్డానికి,…

3 hours ago