Political News

సీఆర్ డీఏ ముద్దు… అమ‌రావ‌తి మాత్రం వద్దా జగన్?

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌తిపాదించిన మావిగ‌న్‌(మ‌చిలీప‌ట్నం-విజ‌య‌వాడ‌-గుంటూరుతో కూడిన రాజ‌ధాని) ప్రాంతం ప్ర‌స్తుతం ఉన్న సీఆర్ డీఏ(క్యాపిట‌ల్ రీజియ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ) ప‌రిధిలోనే ఉంద‌ని… దీనిని తాము వ్య‌తిరేకించ‌డం లేద‌ని వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. అందుకే జ‌గ‌న్ కూడా మావిగ‌న్ ప్ర‌తిపాద‌న చేశార‌ని చెబుతున్నారు. అంతేకాదు.. వాస్త‌వానికి గ‌తంలోనే.. అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే.. ఈ మావిగ‌న్ ప్ర‌తిపాద‌న వ‌చ్చింద‌ని కూడా వైవీ చెప్పుకొచ్చారు. దీంతో అమ‌రావ‌తిని ఎందుకు వ్య‌తిరేకిస్తున్నారు? సీఆర్ డీఏను ఎందుకు స‌మ‌ర్థిస్తు న్నార‌న్న ప్ర‌శ్న తెర‌మీదికి వ‌చ్చింది.

రాజ‌ధానిపై దోబూచులు..

అమ‌రావ‌తిని నేరుగా కాద‌ని చెప్ప‌డంతో గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీకి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది. ఫ‌లితంగానే 151 స్థానాల నుంచి ఆపార్టీ 11 సీట్ల‌కు ప‌రిమితం అయింది. అలాగ‌ని అమ‌రావ‌తిని స‌మ‌ర్థించ‌లేని ప‌రిస్థితి వైసీపీలో క‌నిపిస్తోంది. ఇత‌ర నాయ‌కులు దీనిని స‌మ‌ర్థించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నా.. జ‌గ‌న్ మాత్రం స‌మ‌ర్థించ‌లేక పోతున్నారు. ఈ నేప‌థ్యంలో అటు అమ‌రావ‌తి కాకుండా ఇటు.. `మావిగ‌న్` అనే ప్ర‌తిపాద‌న‌ను తెర‌మీదికి తెచ్చారు. నిజానికి మావిగ‌న్ కూడా అమ‌రావ‌తి రాజ‌ధాని ప‌రిధిలోనే ఉంద‌ని చంద్ర‌బాబు సైతం ప‌దే ప‌దే చెబుతున్నారు.

అయిన‌ప్ప‌టికీ.. మావిగ‌న్ మాటనే జ‌గ‌న్ ప‌ఠిస్తున్నారు. ఇక‌, ఇప్పుడు మావిగ‌న్ కూడా సీఆర్‌డీఏ ప‌రిధిలోనే ఉంటుంద‌ని వైవీ వ్యాఖ్యానించారు. ప‌నిలో ప‌నిగా ఆయ‌న సీఆర్ డీఏను తాము వ్య‌తిరేకించ‌డం లేద‌ని అన్నారు. అంటే.. పూర్తిస్థాయిలో సీఆర్ డీఏను స‌మ‌ర్థిస్తూనే.. మ‌రోవైపు అమ‌రావ‌తికి వ్య‌తిరేకంగా మావిగ‌న్ మాట‌ను వినిపిస్తున్నారు. ఈ రెండు నాల్క‌ల ధోర‌ణి రాజ‌కీయంగా వైసీపీని మ‌రింత డైల్యూట్ చేస్తోంద‌న్న‌ది విశ్లేష‌కులు చెబుతున్న మాట‌. అయిన‌ప్ప‌టికీ.. త‌మ పంతం త‌మదే అన్న‌ట్టుగా వైసీపీ ముందుకు సాగుతోంది. అమ‌రావ‌తిని నేరుగా స‌మ‌ర్థిస్తే.. అది చంద్ర‌బాబును ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా స‌మ‌ర్థించిన‌ట్టే అవుతుంద‌న్న భావ‌న జ‌గ‌న్‌లో ఉంది. అందుకే ఆయ‌న అమ‌రావ‌తిని వ్య‌తిరేకిస్తున్నార‌ని చెబుతున్నారు.

ఎన్నిక‌ల నాటికి ఈ మాట కూడా మారే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం రాష్ట్ర ప్ర‌జ‌లే కాదు.. దేశం మొత్తం అమ‌రావతిని అంగీక‌రించింద‌ని విశ్లేష‌కులు గుర్తు చేస్తున్నారు. ఈ వాద‌న‌ను కాద‌ని జ‌గ‌న్ ముందుకు సాగితే.. అది ఆయ‌న‌కు డ్యామేజీ ని మ‌రింత పెద్ద‌ది చేసే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే నెమ్మ‌దిగా మావిగ‌న్‌.. సీఆర్‌డీఏ ప‌రిధిలోనే ఉంద‌న్న వాద‌న‌ను త‌న వారితో చెప్పించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని చెబుతున్నారు. ఎన్నిక‌ల నాటికి ఈ విష‌యంలో జ‌గ‌న్ యూట‌ర్న్ తీసుకున్నా.. ఆశ్చ‌ర్యం ఉండ‌క‌ పోవ‌చ్చ‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌. అయితే.. త‌మ మేనిఫెస్టోలో సైతం మావిగ‌న్ చేరుస్తామ‌ని జ‌గ‌న్ చెప్పిన ద‌రిమిలా.. ఏం జ‌రుగుతుంద‌న్న‌ది చూడాలి. ఏదేమైనా వైసీపీ రాజ‌కీయ‌కోణంలో రాజ‌ధానిని చూడ‌డం.. దీనిని ప్ర‌జ‌ల‌పై రుద్దే ప్ర‌య‌త్నం చేయ‌డం వంటివి వాటిపై చ‌ర్చ జ‌రుగుతూనే ఉండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on July 20, 2026 8:50 am

Share

Recent Posts

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

3 minutes ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

2 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

3 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

3 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

11 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

13 hours ago