బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఎప్పుడూ తన ఫిట్‌నెస్‌తో అభిమానులను ఎట్రాక్ట్ చేస్తుంటాడు. కానీ సడెన్‌గా ఆయన కాస్త నీరసంగా కనిపించేసరికి సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఒక సూపర్ స్టార్ వయసు పైబడటం, లేదా అలసిపోవడం అనేది సహజమే అయినా, అది క్షణాల్లో సెన్సేషన్ అవుతుంది. తన ఆరోగ్యం బాగాలేదంటూ వస్తున్న వదంతులకు కంగారు పడకుండా సల్మాన్ తనదైన స్టైల్‌లో అదిరిపోయే పంచ్ ఇచ్చాడు.
శుక్రవారం ముంబైలో జరిగిన స్లమ్ రిహాబిలిటేషన్ అథారిటీ డేటా సెంటర్ ప్రారంభోత్సవంలో సల్మాన్ పాల్గొన్నాడు. క్యాప్ ధరించి, చాలా సన్నగా, ముఖంలో అలసటతో కనిపించాడు. ఆ ఫోటోలు చూసిన అభిమానులు భాయ్ కి ఏమైంది, అనారోగ్యంతో ఉన్నాడా అంటూ ఆందోళన చెందారు. కొందరైతే ధర్మేంద్రలా వయసు పైబడిన ఛాయలు కనిపిస్తున్నాయంటూ కామెంట్స్ చేశారు.
పీఆర్ టీమ్ తో అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇప్పించడం కంటే, నేరుగా తానే రంగంలోకి దిగడం సల్మాన్ స్టైల్. ఆదివారం రాత్రి తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. అందులో కౌబాయ్ హ్యాట్, డెనిమ్ జాకెట్ వేసుకుని ఫుల్ యాక్టివ్‌గా ఫోజులిచ్చాడు. దానికి తోడు మీ అందరి ఆరోగ్యం ఎలా ఉంది అంటూ తనపై వస్తున్న పుకార్లకు సరదాగా కౌంటర్ వేశాడు.
సల్మాన్ వేసిన ఈ సెటైర్‌తో సోషల్ మీడియాలో నెగెటివ్ చర్చ మొత్తం ఒక్కసారిగా పాజిటివ్ గా మారిపోయింది. అప్పటిదాకా ఆందోళన చెందిన అభిమానులు ఆయన ఇచ్చిన ఈ రిప్లైకి ఫిదా అయిపోయారు. ఆరోగ్యపరమైన రూమర్స్ కి చెక్ పెట్టిన సల్మాన్ ఇప్పుడు తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ చేశాడు. అపూర్వ లఖియా దర్శకత్వంలో రూపొందుతున్న మాతృభూమి మే వార్ రెస్ట్ ఇన్ పీస్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సల్మా ఖాన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిత్రాంగద సింగ్ కూడా నటిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో రావాల్సిన ఈ సినిమా వాయిదా పడినా, ప్రాజెక్ట్ ఆగిపోలేదని మేకర్స్ స్పష్టం చేశారు.
This post was last modified on July 20, 2026 5:46 pm
వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…