Political News

పొరబడ్డారు… నేనలాంటి వాడిని కాదు: ఏబీవీ

రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీవీ వెంకటేశ్వరరావు గత వైసీపీ పాలనలో ఎదుర్కొన్న ఇబ్బందులు తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ఆయన పదవీ విరమణ చేశారు. అనంతరం రాష్ట్ర రాజకీయాలపై పలు సందర్భాల్లో తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. గతంలో కూటమి ప్రభుత్వానికి సూచనలు చేసిన సందర్భాల్లోనూ ఆయన విమర్శలు ఎదుర్కొన్నారు.

తాజాగా ఉపా చట్టం (యూఏపీఏ) వినియోగంపై తన అభిప్రాయాన్ని వెల్లడించిన ఏబీవీ, ఒక కార్యక్రమంలో మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుతో వేదికను పంచుకోవడంపై వస్తున్న విమర్శలకు స్పందించారు. ఆ వేదికపై అంబటి రాంబాబు ఏమి మాట్లాడారో తాను వినలేదని, ఆయన పక్కన కూర్చున్నాననే కారణంతో సభ మధ్యలో లేచి వెళ్లిపోవడం సభా మర్యాద కాదని చెప్పారు.

“మీ అందరితో హీరో అనిపించుకోవడం కోసం నేను సంస్కారం వదిలేయాలా? మీరు నా గురించి పొరబడ్డారు. నేనలాంటి వాడిని కాదు” అంటూ ఏబీవీ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. గతంలో జగన్ ప్రభుత్వం మాట్లాడే స్వేచ్ఛ ఇవ్వలేదని, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే విధంగా వ్యవహరించాలనుకుంటుందా? అని ప్రశ్నించారు.

ఇంతకుముందు అమరావతి భూసేకరణ అంశంపైనా ఏబీవీ స్పందించారు. రెండో విడతలో వేలాది ఎకరాల భూమిని సేకరించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతులు రోడ్డెక్కే పరిస్థితి వస్తే ప్రభుత్వానికి మద్దతుగా నిలవడం కష్టమవుతుందని హెచ్చరించారు. అలాగే అమరావతి నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేయకపోతే కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి తీరని అన్యాయం చేసినట్టేనని వ్యాఖ్యానించారు.

అలాగే జగన్ ప్రతిపాదించిన ‘మావిగన్’ అంశాన్ని కూడా తేలికగా తీసుకోవద్దని సూచించారు. యూట్యూబ్ వ్యాఖ్యలపై ఉపా చట్టాన్ని ప్రయోగించే విషయంలో రాజద్రోహం కేసు అవసరం లేదని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. దీంతో కూటమి కార్యకర్తల నుంచి విమర్శలు రావడంతో, తాను చేస్తున్న వ్యాఖ్యలను సద్విమర్శలుగా స్వీకరించాలని ఏబీవీ కోరుతున్నారు. ఈ నేపథ్యంలో వరుస పోస్టులు చేస్తూ తన వైఖరిని మరోసారి స్పష్టం చేశారు.

This post was last modified on July 13, 2026 8:55 am

Share

Recent Posts

జంతర్ మంతర్… కేసీఆర్ ముందే పసిగట్టారా?

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిరసన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు…

1 hour ago

డ్రాగన్ ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలి

ఒక ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ ఆలస్యమైనప్పుడు, వాయిదాలు పడినప్పుడు దాని గురించి రకరకాల ప్రచారాలు జరగడం మాములే. బాహుబలి…

2 hours ago

సెటైర్లు సీరియస్‌గా తీసుకోనవసరం లేదు

నిన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ ఓపెనింగ్స్ డీసెంట్ గా మొదలయ్యాయి. ఉదయం కొంచెం నెమ్మదిగా ఉన్నప్పటికీ సాయంత్రానికి పరిస్థితిలో మార్పొచ్చింది.…

5 hours ago

డబ్బింగ్ సినిమాల రేట్ల పెంపు సబబేనా

అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 మొదటి రోజు చెన్నై టికెట్ ధర కంటే ఆంధ్రప్రదేశ్ లోని ఒక…

5 hours ago

మార్చాల్సింది జ్ఞానేష్‌నా.. వ్య‌వ‌స్థ‌నా?!

ఒక ఇంట్లో దొంగ ప‌డ్డాడు. న‌గ‌లు, నట్రా దోచుకున్నాడు. య‌జ‌మాని ... ఆ దొంగ‌ను గుర్తించాడు. పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.…

6 hours ago

బుమ్రా, పాండ్యా లేకుంటే అంతేనా…

టీ20ల్లో 249 పరుగులు చేసినా గెలవలేకపోతే బౌలింగ్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియాకు అదే…

7 hours ago