Political News

సేనానికి అభిమానమే అడ్డు కాకూడదు

భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం ముంబై ఆసుపత్రిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. శనివారం పవన్ కు శస్త్ర చికిత్స జరగగా…ఆ మరునాడే ఆదివారం టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నేరుగా ముంబై వెళ్లి మరీ పవన్ ను పరామర్శించారు. ఈ సందర్భంగా పవన్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన బాబు… పవన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆపరేషన్ చేసిన వైద్యులతోనూ చంద్రబాబు మాట్లాడారు. సేనాని పూర్తిగా కోలుకునేందుకు ఎంత సమయం పడుతుందన్న దానిపై ఆయన ఆరా తీసినట్టు సమాచారం.

రాజకీయాల్లోకి రాకముందు జన సేనాని సినిమా నటుడిగా కొనసాగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 2018లో ఓ సినిమా షూటింగ్ లో జరిగిన చిన్నపాటి ప్రమాదం నేపథ్యంలో పవన్ రెండు భుజాలకు గాయాలయ్యాయి. ఆ గాయాలకు అప్పుడే చికిత్స తీసుకుని ఉండి ఉంటే సరిపోయ్యేదేమో. అయితే అప్పటికే షెడ్యూల్ ఖరారు అయిన సినిమా షూటింగ్ లు, ఇతరత్రా రాజకీయ కార్యక్రమాల నేపథ్యంలో ఆ చికిత్సలను పవన్ అలా వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఇటీవలే ముక్కుకు జరిగిన ఆపరేషన్ సందర్భంగా భుజం గాయాల తీవ్రతను పవన్ చెప్పడంతో తప్పనిసరి పరిస్తితుల్లో ఆయన ఆపరేషన్ కు తలూపారు.

సినిమా షూటింగ్ లోనే గాయం అయినా… జన బాహుళ్యంలోకి వచ్చినప్పుడు పవన్ తో చేయి కలపాలనే ఆయన అబిమానులు ఒక్కోసారి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఓ సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగిన పవన్ కు ఎనలేని అబిమాన గణం ఉంది. ఆ అభిమానులంతా కూడా పవన్ తో కరచాలనం చేయాలని కోరుకునేవారే. ఈ క్రమంలోనే చాలాసార్లు ఆయన చేతులను పట్టుకుని మరీ పవన్ ను లాగేసిన సందర్బాలు ఉన్నాయి. ఈ కారణంగా భుజం గాయాలు మరింతగా పవన్ ను బాధించాయి. అయినా ఓర్పుతో ఆ నొప్పిని భరిస్తూనే పవన్ సాగారు.

పవన్ కు పరామర్శ సందర్భంగా పవన్ ఫ్యాన్స్ కు చంద్రబాబు ఓ కీలక సూచన చేశారు. పవన్ హీరోనే…సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ సక్సెస్ సాధించి పవన్ ఏకంగా డిప్యూటీ సీఎం అయ్యారు. ఈ క్రమంలో పవన్ ఎప్పుడు బయటకు వచ్చినా…ఆయనతో కరచాలనం చేయాలనే ఆసక్తి ఉన్నా… పవన్ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా దానిని మానుకోవాలని ఫ్యాన్స్ కు బాబు సూచించారు. కేవలం కరచాలనం కోసమే పవన్ ను చుట్టుముడితే… భుజం గాయాలు మరింతగా పెచ్చరిల్లే ప్రమాదం లేకపోలేదన్న విషయాన్ని ఫ్యాన్స్ గమనించాలన్న వాదనను బాబు వినిపించారు. వెరసి అభిమానమే పవన్ కు అడ్డుకట్ట వేయరాదన్న భావనను బాబు వ్యక్తపరిచారు.

This post was last modified on July 12, 2026 7:18 pm

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

45 minutes ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

2 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

2 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

4 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

4 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

5 hours ago