తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ వర్సెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్న రీతిలో జరుగుతున్న మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ కు మద్దతిచ్చిన కడియం శ్రీహరి తన ఇలాకాలో వేలు పెడుతున్నారంటూ కొండా సురేఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కడియం శ్రీహరిపై తాజాగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే కడియం శ్రీహరి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని, ఆ తర్వాత మంత్రి పదవి తెచ్చుకోవాలని సవాల్ విసిరారు.
ముందు నుంచి కడియం శ్రీహరి బుద్ధి ఇంతేనని, మాజీ మంత్రి అయిన శ్రీహరి ఎమ్మెల్యేగా ఇమడలేకపోతున్నారని సురేఖ విమర్శించారు. అటువంటి సందర్భంలో రాజీనామా చేసి నోర్మూసుకుని ఇంట్లో కూర్చోవాలని లేదంటే మంత్రి పదవి తెచ్చుకునేందుకు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా, తనను బ్లేమ్ చేయాలని చూసినా, జిల్లాను డిస్టర్బ్ చేయాలని చూసిన ఊరుకునే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు.
దేవాదయ శాఖకు సంబంధించిన అంశాలపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఏకపక్షంగా సమీక్షా సమావేశం నిర్వహించడంపై కొండా సురేఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే శ్రీహరిపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కు ఆమె ఫిర్యాదు చేశారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం, 15 ఏళ్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న కడియం శ్రీహరికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలిస్తే ఆయన చేసింది తప్పు అని ఒప్పుకుంటారని సురేఖ అన్నారు. అలా కాకుండా, ఆయన తనపై ఎదురు దాడికి దిగడం కరెక్ట్ కాదని హితవు పలికారు.
కడియంతో తాడోపేడో తేల్చుకుంటానని చెప్పారు. పార్టీ ప్రతిష్టను ఇటువంటి అంశాలు దెబ్బతీస్తాయని, అందువల్లే మొదట్లోనే ఈ తరహా అంశాలను అడ్డుకునేందుకు తాను మీడియా ముందుకు వచ్చి మాట్లాడానని వివరణనిచ్చారు.
This post was last modified on July 9, 2026 8:27 pm
టార్గెట్ కేటీఆర్.. లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న…
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…