రేపు లెనిన్ విడుదల కానుంది. ఉదయం అయిదు గంటల నుంచి షోలు మొదలవుతాయని నిర్మాణ సంస్థ ప్రకటించింది కానీ దాదాపు అన్ని చోట్ల ఏడు తర్వాతే ఆన్ లైన్ బుకింగ్స్ కనిపిస్తున్నాయి. సెన్సార్ నుంచి యు/ఏ రావడంతో ఫ్యామిలీస్ వెళ్ళడానికి ఇబ్బందేం లేదని అర్థమైపోయింది. పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత వస్తున్న పెద్ద సినిమాగా బయ్యర్లు దీని మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే లెనిన్ బాక్సాఫీస్ సాక్షిగా తీర్చాల్సిన బాకీలు ఎన్నో ఉన్నాయి.
మొదటిది అఖిల్. కెరీర్ మొదలుపెట్టి దశాబ్దం దాటినా ఇప్పటికీ ఒక సాలిడ్ బ్లాక్ బస్టర్ లేదు. ఆ కొరత తీర్చాల్సిన బాధ్యత లెనిన్ మీద ఉంది. తను కూడా చాలా నమ్మకంగా ఉన్నాడు.చాలా యాక్టివ్ గా ప్రమోషన్లు చేశాడు. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేకు అవకాశాల పరంగా లోటు లేకపోయినా వరస ఫ్లాపుల వల్ల ఇబ్బంది పడుతున్న వైనం వాస్తవం. విచిత్రంగా ఆంధ్రకింగ్ తాలూకా లాంటివి పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా నిలబడలేకపోయాయి. లెనిన్ లో పెర్ఫార్మన్స్ పరంగా చాలా పెద్ద స్కోప్ దక్కిందట.
ఇక నిర్మాత నాగవంశీ సైతం ఒక సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. సంక్రాంతికి నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు సంతృప్తి పరిచింది కానీ ఫంకీ గట్టి దెబ్బ వేసింది. అంతకు ముందు గత ఏడాది చాలా ఒడిదుడుకులున్నాయి. అవన్నీ లెనిన్ తో కవరైపోతే నెక్స్ట్ లిస్టులో ఉన్న ఇతర సినిమాలకు బూస్ట్ లాగా పని చేస్తుంది. దర్శకుడు మురళికిషోర్ అబ్బూరు కనక ఈ మూవీతో అఖిల్ కో హిట్ ఇస్తే స్టార్స్ నుంచి పిలుపులు వస్తాయి. ఆషామాషి కాదు ఓ రేంజ్ సక్సెస్ పడాలి.
ఇక తమన్ సైతం ట్రాక్ లో రావాల్సిన నేపథ్యంలో తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంత వరకు ఎలివేట్ చేస్తుందనేది కీలకంగా మారింది. నాగార్జున సైతం మనం తర్వాత అంత ఇన్వాల్వ్ అయిన సినిమా ఇదేనని చెప్పడం ఫ్యాన్స్ లో అంచనాలు పెంచేసింది. తండ్రిగా తాను ఎంత చేయాలో అంతా చేశానని చెప్పడం చూస్తే ఎంత బలంగా సబ్జెక్టుని నమ్మారో అర్థమవుతుంది. మరికొద్ది గంటల్లో షోలు వేసుకోబోతున్న లెనిన్ కి ఆడియన్స్ ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.
This post was last modified on July 9, 2026 9:31 pm
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…