Political News

ఓజీ కలిసి చూద్దామన్న మాట… నెరవేరకముందే విషాదం

జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీరాభిమాని పొనుగంటి నిరంజన్ (17) మంగళవారం రాత్రి కన్నుమూశాడు. హనుమకొండ హనుమాన్‌నగర్‌కు చెందిన నిరంజన్ అరుదైన జన్యుపరమైన డ్యూచెన్ మస్క్యులర్ డిస్ట్రోఫీ వ్యాధితో చిన్నప్పటి నుంచే పోరాడుతున్నాడు. కొంతకాలంగా చికిత్స పొందుతున్న అతడు ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచాడు. ఈ వార్త కుటుంబ సభ్యులతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది.

నిరంజన్ మూడేళ్ల వయసులోనే ఈ అరుదైన వ్యాధి బారిన పడ్డాడు. అప్పటి నుంచే మంచానికే పరిమితమయ్యాడు. వ్యాధి తీవ్రత కారణంగా 17 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ నాలుగేళ్ల చిన్నారి రూపంలోనే ఉండిపోయాడు. అయితే తన అభిమాన నటుడు, నాయకుడు పవన్ కళ్యాణ్‌ను ఒక్కసారి అయినా కలవాలన్న కోరికను మాత్రం ఎప్పుడూ వదల్లేదు.

ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గత నెల 17న స్వయంగా నిరంజన్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదాన్ని అందజేసి, అతని ఆరోగ్యం మెరుగుపడాలని ఆకాంక్షించారు. నిరంజన్‌తో ఆప్యాయంగా మాట్లాడి, అతని అభిరుచులు తెలుసుకున్నారు.

జనసేన డైరీపై “ప్రియమైన నిరంజన్‌కు ప్రేమతో… అమ్మ దుర్గామాత ఆశీస్సులతో నువ్వు చల్లగా ఉండాలని కోరుకుంటూ…” అంటూ స్వహస్తాలతో సందేశం రాసి సంతకం చేశారు. అలాగే ఆర్థిక సాయం అందించి, కుక్కపిల్లను బహుమతిగా ఇచ్చారు. “ఓజీ సినిమా ఇద్దరం కలిసి చూద్దాం” అంటూ ధైర్యం చెప్పిన ఆ క్షణాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అయ్యాయి.

కానీ విధి మరోలా తీర్పు చెప్పింది. ఆరోగ్యం మరింత క్షీణించడంతో నిరంజన్ మంగళవారం రాత్రి కన్నుమూశాడు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నెరవేరకముందే అతని జీవన ప్రయాణం ముగియడం అభిమానులను కలచివేసింది. 

This post was last modified on July 8, 2026 2:23 pm

Share

Recent Posts

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

58 minutes ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

2 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

2 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

3 hours ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

3 hours ago

తండ్రిపై ప్రేమ‌.. శ‌వాన్ని నాలుగేళ్లుగా.. !

తల్లిదండ్రుల‌పై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వ‌ర‌కు ఉండాల్సిందే. కానీ, జ్యాత‌స్య‌హి ధ్రువో మృత్యు.. అన్న‌ట్టుగా కాలం…

3 hours ago