“ప్లేస్ నువ్వు చెప్పినా సరే.. నన్ను చెప్పమన్నా సరే..టైమ్ నువ్వు చెప్పినా సరే.. నన్ను చెప్పమన్నా సరే.. ఎప్పుడైనా సరే.. ఎక్కడైనా సరే..కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా” అంటూ నరసింహనాయుడు సినిమాలో బాలయ్య చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ ఆయన ఫ్యాన్స్ కు ఇప్పటికీ గూస్ బంప్స్ తెప్పిస్తుంటుంది. అదే మాదిరిగా తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాజీ మంత్రి కేటీఆర్ చెప్పిన డైలాగ్ బీఆర్ఎస్ కార్యకర్తలకు గూస్ బంప్స్ తెప్పించింది. కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనపై ప్రతిపక్షాలతో చర్చకు సిద్ధం అంటూ రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ ను స్వీకరించారు కేటీఆర్.
ఆ క్రమంలోనే ఆ చర్చ జరిగే ప్లేస్, డేట్, టైమ్, టాపిక్…అన్నీ రేవంత్ ఇష్టం అని కేటీఆర్ ప్రతి సవాల్ చేశారు. ఆ చర్చకు చేతనైతే రేవంత్ వస్తారా…లేకుండా రాహుల్ గాంధీ వస్తారా…మీ ఇష్టం…ఈ సవాల్ కు సిద్ధమా అంటూ కేటీఆర్ చేసిన బస్తీ మే సవాల్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. సీఎం రేవంత్ విసిరిన సవాల్ కు తాను రెడీ అని, తమ పార్టీ తరఫున తాను ఆ చర్చకు వస్తానని కేటీఆర్ చెప్పారు. రేవంత్ చేసేదే చెత్త పాలన అని, పైగా దానిపై చర్చ అంటూ సవాల్ విసరడం హాస్యాస్పదమని కేటీఆర్ సెటైర్లు వేశారు.
రైతు డిక్లరేషన్ అంటూ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గొప్పలు పోయిన వరంగల్ చౌరస్తాలో చర్చ పెడదామా అని కేటీఆర్ ప్రశ్నించారు. నిరుద్యోగ యువతకు 2 లక్షల ఉద్యోగాలంటూ రాహుల్ గాంధీ డైలాగులు కొట్టిన అశోక్ నగర్ చౌరస్తాలో చర్చకు సిద్ధమా..తేల్చుకుందామా అంటూ కేటీఆర్ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డికి చేతనైతే ఆయన వస్తాడా..లేకుండా రాహుల్ గాంధీ వస్తాడా…ఎవడొస్తడో రండి..అని ఛాలెంజ్ చేశారు.
ఒకవేళ ఆ చర్చలో గణాంకాలతో సహా వారి తప్పులను బయటపెట్టకపోతే, వారి పరిపాలనా వైఫల్యాన్ని అశోక్ నగర్, వరంగల్ చౌరస్తాలో నగ్నంగా నిలబెట్టకపోతే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. ఈ సవాల్ కు సిద్ధమా అని కేటీఆర్ ప్రశ్నించారు. మరి, కేటీఆర్ ప్రతి సవాల్ ను స్వీకరించి రేవంత్ చర్చకు వస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. కేటీఆర్ కామెంట్స్ కు రేవంత్ కౌంటర్ ఏ విధంగా ఉండబోతోందో వేచి చూడాలి. ఏది ఏమైనా రేవంత్, కేటీఆర్ ల బస్తీ మే సవాల్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
This post was last modified on July 1, 2026 9:17 pm
తెలంగాణలోని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పదవిని కోల్పోయారు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 10 మేరకు ఆయన పదవిపై…
స్టార్ కాంబినేషన్లు పెట్టుకుని సరైన కథా కథనాలు లేకుండా సినిమాలు తీస్తే జనాలు ఎగబడి చూసే రోజులు పోయాయి. ముఖ్యంగా…
తెలంగాణలో రాజకీయాల్లో 2014 నుంచి కూడా జంపింగుల పర్వం కొనసాగుతోంది. నేడు కొత్తగా వచ్చింది కాదు.. భవిష్యత్తుల్లో పోయేదీ కాదని…
దేశంలోనే అత్యధిక సినీ అభిమానం ఉన్నది తెలుగు రాష్ట్రాల్లోనే అంటే అతిశయోక్తేమీ కాదు. కానీ ఇంతటి అభిమానం ఉన్న చోట…
పశ్చిమ బెంగాల్‌లో సుదీర్ఘకాలం పాటు పాలన సాగించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం…
ఎయిర్‌పోర్టులంటే పెద్ద సిటీల్లోనే ఉండాలనే నియమాలేమీ లేవిప్పుడు. టైర్-2 సిటీలు, పట్టణాలకు కూడా విమానాశ్రయాలు విస్తరిస్తున్నాయి. ఐతే మరో తెలుగు…