మరోసారి బీఆర్ఎస్ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి. పదునైన మాటలు.. దానికి తగ్గట్లే వివరణ.. వీటికి తోడు లాజిక్ మిస్ కానట్లుగా ఉండే రేవంత్ మాటలకు భిన్నంగా తాజాగా ఆయన పోలిక ఉందని చెప్పాలి. ప్రాస కోసం పాకులాడినట్లు ఉన్నారే తప్పించి.. తాజా పోలిక తేలిపోయేలా.. ముఖ్యమంత్రి ఇమేజ్ ను దెబ్బ తీసేలా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత నుంచి ఇప్పటివరకు.. చాలా తక్కువ సందర్భాల్లో తప్పించి కేసీఆర్ విమర్శలు చేసింది లేదు. కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేసి.. సంగతి చూస్తానని చెప్పి.. ఆ తర్వాత ఎప్పటిలానే కామ్ గా ఉండిపోయిన పరిస్థితి.
కేసీఆర్ స్పందించినా.. స్పందించకున్నా.. ఆయన పేరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరచూ ప్రస్తావిస్తూ ఉంటారన్న సంగతి తెలిసిందే. ఒకవేళ సీఎం రేవంత్ ను ఉద్దేశించి కేసీఆర్ ఏదైనా ఘాటు విమర్శ చేస్తే.. దానికి కొనసాగింపుగా సీఎం ఎంతలా విరుచుకుపడతారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇదిలా ఉండగా.. తాజాగా రైతుభరోసా నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా కేసీఆర్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు సీఎం రేవంత్.
ఎప్పటిలానే గులాబీ బాస్ మీద ఘాటు విమర్శలు చేసిన ఆయన.. అందరిని ఆకర్షించే పోలిక ఒకటి తీసుకొచ్చారు. విన్నంతనే భలే అన్నారే.. అనిపించేలా ఉన్నా.. అందులో లాజిక్ లేకపోవటం.. ప్రాస కోసం ప్రయాస పడ్డారే తప్పించి.. అందులోని విషయం ప్రజలకు అర్థమయ్యేలా లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కేసీఆర్ చెప్పిన కాశీ మజిలీ కథలు విన్న తర్వాతే తెలంగాణ ప్రజలు ఓడించి ఫాంహౌస్ కు పరిమితం చేసినట్లుగా పేర్కొన్న రేవంత్.. హరీశ్ రావు.. కేటీఆర్ లను చిన్నరాక్షసులుగా పోల్చటం గమనార్హం. కేసీఆర్ అరుంధతి సినిమాలో రాక్షసుడి లాంటోడన్న రేవంత్.. ఫాంహౌస్ లో బంధించిన ఆ పశుపతిని మళ్లీ బయటకు రానివ్వొద్దన్నారు. పాపాల భైరవుడిని ఫాంహౌస్ కే పరిమితం చేయాలన్నారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలు విన్నంతనే.. కేసీఆర్ ను భలేగా అనేశారే అనిపించొచ్చు. కానీ.. సామాన్య ప్రజానీకానికి తాజా వ్యాఖ్యలు అలా అనిపించే అవకాశం లేదని చెప్పాలి.
ఎందుకంటే అరుంధతి సినిమాలో పశుపతిని బంధిస్తారు. కేసీఆర్ విషయానికి వస్తే.. ఎన్నికల్లో ఓటమి తర్వాత తనకు తానే ఫాంహౌస్ లో ఉండిపోయారు. అది పూర్తిగా ఆయన సొంత నిర్ణయం. తన సుదీర్ఘ రాజకీయ వ్యూహంలో భాగంగా కేసీఆర్ ఫాంహౌస్ (ఫార్మర్ హౌస్ గా పిలవాలని ఆ పార్టీ అగ్రనేతలు.. పార్టీ సైతం పలుమార్లు వివరణ ఇచ్చింది) లో ఉండిపోయారు. అలా అని ఆయన అన్నింటికి దూరంగా ఉన్నారనుకుంటే పొరపాటే. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ.. పరిస్థితుల్ని నిశితంగా గమనిస్తున్నారని చెప్పాలి.
ఇక్కడే కేసీఆర్ తీరును ప్రస్తావించాలి. సుదీర్ఘంగా సాగిన తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఆయన అత్యంత వ్యూహత్మకంగా వ్యవహరించేవారు. వాతావరణం తనకు అనుకూలంగా లేనంత కాలం కామ్ గా ఉండే ఆయన.. పరిస్థితులు తనకు అనుగుణంగా ఉన్నాయన్న నమ్మకం.. ధీమా కలిగినంతనే తెర మీదకు వచ్చి.. తాను కోరుకున్నది సాధించుకునే తత్త్వం కేసీఆర్ సొంతం. ఉద్యమ సమయంలోనూ.. ఆయన కోసం ప్రజలంతా వెయిట్ చేసేలా.. గులాబీ బాస్ వస్తేనే.. ఉద్యమానికి ఊపు వస్తుందన్న భావన కలిగేలా చేసుకోవటంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారని చెప్పాలి.
సీఎం రేవంత్ వ్యాఖ్యల విషయానికి వస్తే.. అరుంధతి మూవీలోని పశుపతితో కేసీఆర్ ను పోల్చే విషయంలో ప్రాస కోసం ప్రయత్నించారే తప్పించి.. లాజిక్ కు సెట్ అయ్యేలా విమర్శ చేయటంలో మాత్రం ఈసారి రేవంత్ వెనుకపడ్డారని చెప్పాలి. ఓవైపు పశుపతితో కేసీఆర్ ను పోల్చిన రేవంత్.. ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ప్రస్తావించి.. మరింత తీవ్ర వ్యాఖ్యలు చేయటం గమనార్హం. అయితే.. పశుపతి పోలిక కొత్తగా ఉండటంతో మీడియాలో ఈ అంశం హైలెట్ అయ్యింది.
పెళ్లాం.. మొగుడు మాట్లాడుకునే మాటల్ని వినేందుకు సిగ్గుండాలని.. తాను.. తన భర్త మాట్లాడే మాటలు కూడా విన్నారంటూ కేసీఆర్ సొంత బిడ్డ చెప్పినట్లుగా రేవంత్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే భార్యభర్తల మాట్లాడుకునే ఫోన్లను కూడా వింటాడని.. ఎవరినీ ప్రశాంతంగా సంసారం కూడా చేసుకోనివ్వడన్నారు.
‘‘ఇంకా ఆ బతుకు ఎందుకు? ఎండ్రీన్ తాగి బావిలో పడి చచ్చిపోయినా తప్పులేదు. కేసీఆర్ పాలనలో అన్ని సంస్కృతులు నాశనమయ్యాయి. తాగుడు సంస్కృతిని మాత్రమే అమలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబజార్‌లు తెస్తే.. కేసీఆర్ బెల్టు బజార్‌లు తెచ్చారు. చిన్న పిల్లలను కూడా తాగుబోతులుగా తయారుచేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు’’ అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి తీవ్ర వ్యాఖ్యలు రేవంత్ కు నల్లేరు మీద నడకలాంటిది. అయితే.. ఏదైనా పోలికలు పోల్చే వేళలో మాత్రం కాసిన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తమిళనాడు వ్యవహారాలు ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా పెద్ద చర్చకే తెర తీస్తున్నాయి. ఇటీవలే జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో…
ఏపీలో ఎప్పటికప్పుడు రాజకీయం వేడెక్కిపోతోంది. వాటన్నింటినీ తలదన్నేలా బుధవారం ఓ కీలక అంశం రంగంలోకి దిగింది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా…
తెలుగు ప్రేక్షకులకు అత్యంత ఇష్టమైన దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. ఆయనలా తెలుగుదనంతో, కుటుంబ అంశాలతో సినిమాలు తీసే అలాంటి…
తమిళంలో టీనేజీలోనే సంగీత దర్శకులుగా చాలా పెద్ద స్థాయికి ఎదిగిపోయారు జీవీ ప్రకాష్ కుమార్, అనిరుధ్ రవిచందర్. ఈ ఇద్దరిలో…
ఆ మధ్య పెద్ది విడుదలయ్యాక అందులో జాన్వీ కపూర్ పాత్ర గురించి ఎంత డిబేట్లు జరిగాయో తెలిసిందే. బికినీలు బూతులు…
ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల కాలంలో చిన్న చిన్న ఘటనలపై కూడా చాలా సెన్సిటివ్‌గా స్పందిస్తున్నారు. ఆయా ఘటనలపై తన…