ఆ మధ్య పెద్ది విడుదలయ్యాక అందులో జాన్వీ కపూర్ పాత్ర గురించి ఎంత డిబేట్లు జరిగాయో తెలిసిందే. బికినీలు బూతులు లేనిదే సినిమాలు తీయలేని కొందరు బాలీవుడ్ పెద్దలు సైతం ఈ పాయింట్ మీద గొంతు చించుకోవడం మహా విచిత్రం. దర్శకుడు బుచ్చిబాబు క్యారెక్టరైజేషన్ లో తప్పులు ఉండొచ్చేమో కానీ గతంలో ఎవరూ చేయలేదనే తరహాలో ప్రొజెక్ట్ చేయడం విమర్శలకు దారి ఇచ్చింది. సరే ఇదంతా గతమనుకుందాం. తాజాగా టాక్సిక్ టీజర్ కొత్తది వచ్చింది.
యష్ హీరోగా రూపొందుతున్న ఈ ప్యాన్ ఇండియా మూవీలోని స్త్రీలను ప్రేక్షకులకు పరిచయం చేశారు. నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్ తో పాటు హ్యూమా ఖురేషి ఇందులో మెయిన్ లేడీస్ క్యాస్టింగ్. కొన్ని యాక్షన్ విజువల్స్ తో పాటు బోల్డ్ సన్నివేశాలను ఇందులో చూపించారు. ముందే పిల్లలకు చూపించవద్దని హింట్ ఇచ్చారు కానీ స్మార్ట్ టీవీలు ఫోన్ల ప్రపంచంలో యూట్యూబ్ నుంచి వాటిని దాచడం అసలు జరిగే పనేనా. అందులోనూ కెజిఎఫ్ హీరోవి.
ముందు నుంచి దర్శకురాలు గీతూ మోహన్ దాస్ హైలైట్ చేసినట్టు ఇందులో వయొలెన్స్ తో పాటు రొమాన్స్ చాలా ఘాటుగా ఉండబోతోంది. కొత్త టీజర్ లో కూడా అదే ఫోకస్ చేశారు. ఫైట్లతో పాటు పిల్లలు కళ్ళుమూసుకునే సన్నివేశాలు చాలానే ఉండబోతున్నాయి. పెద్దిలో చూపించింది అంత పెద్ద తప్పు అయినప్పుడు మరి టాక్సిక్ లో కంటెంట్ గురించి ఎవరు మాట్లాడతారో చూడాలి. రిలీజయ్యే దాకా సైలెంట్ గా ఉంటారేమో.
ఆగస్ట్ 26 విడుదల కాబోతున్న టాక్సిక్ చేతిలో కేవలం 55 రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటి నుంచే ప్రమోషన్ల వేగం పెంచాలి. ఈసారి వాయిదా వేసే ఛాన్స్ లేదు. అందుకే పబ్లిసిటీ గేరు మార్చి రిలీజ్ టైంకి హైప్ పెంచే ప్రయత్నాల్లో ఉన్నారు. అడల్ట్స్ ఓన్లీ అని స్పష్టంగా మెసేజ్ చేస్తూ జనాల్లోకి తీసుకెళ్తున్న విధానం చూస్తుంటే యష్ కు ఫ్యామిలీ ఆడియన్స్ దూరమైనా పర్లేదనే ఫీలింగ్ వచ్చినట్టు ఉంది. చూడాలి మరి మొత్తం సినిమాలో ఇంతే మోతాదులో శృంగారం, పోరాటం ఉంటుందేమో.
This post was last modified on July 1, 2026 1:19 pm
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…
వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…
భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1…
వేణుంబాక విజయసాయిరెడ్డి… వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అధినేత జగన్ కు నమ్మినబంటు. పార్టీలో జగన్ తర్వాత నంబర్…