తెలంగాణలో విజయమే లక్ష్యంగా పనిచేయాలని.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ దిశానిర్దేశం చేశారు. దీనికిగాను ఈ ఏడాది జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. అక్కడ ప్రజా పోరాటాల ద్వారానే అధికారం దక్కించుకున్నామని నాయకులకు చెప్పారు. ఇదే తరహాలో తెలంగాణలో కూడా విజయం దక్కించుకోవాలన్నారు.
అయితే.. తెలంగాణలో బెంగాల్ ఫార్ములా పనిచేస్తుందా? అనేది కీలక ప్రశ్న. రాష్ట్ర విభజన అనంతరం.. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన పలు ప్రాజెక్టులు, నిధులు ఇప్పటి వరకు ఇవ్వలేదు. రాష్ట్ర విభజన జరిగింది యూపీఏ(కాంగ్రెస్) హయాంలోనే అయినా.. ఆతర్వాత..వరుసగా ఇప్పటివరకు 12సంవత్సరాలుగా బీజేపీనే అధికారంలో ఉంది. అలాంటప్పుడు.. రాష్ట్రాన్ని ఇచ్చామన్న క్రెడిట్‌లో తమకు భాగం ఉందని చెబుతున్నా.. విభజన చట్టంలో పేర్కొన్న మేరకు తెలంగాణకు ఏమేరకు సాయం అందించారన్నది ప్రశ్న.
ముఖ్యంగా బెంగాల్‌కు, తెలంగాణకు మధ్య పోలిక లేదు. అక్కడ క్షేత్రస్థాయిలో కమ్యూనిస్టులు పట్టుకోల్పోవడం, నిన్నటి వరకు అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీపై అవినీతి, అక్రమాల ముద్ర పడడం.. మమతా బెనర్జీ తర్వాత.. ఎవరు? అనే ప్రశ్నకు కుటుంబ పరంగా నాయకులు ముందుకు వచ్చిన దరిమిలా.. ప్రజలు వారిని తిరస్కరించడం అనేది బీజేపీకి కలిసి వచ్చింది. అదేసమయంలో బీజేపీకి.. సువేందు అధికారం ఐకాన్ నాయకుడిగా ఉన్నారు. ఇవన్నీ కలిసి వచ్చి.. బీజేపీ పాగా వేసిందనే అభిప్రాయం ఉంది.
కానీ, తెలంగాణ విషయానికి వస్తే.. ప్రస్తుత అధికార పార్టీపై అవినీతి, అక్రమాల ముద్ర పడలేదు. క్షేత్రస్థాయిలో అధికారులపై మాత్రమే ఆరోపణలు వస్తున్నాయి. వీటిని సరిచేసుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇక, బీజేపీలో బెంగాల్ తరహా ఐకాన్ నాయకుడు తెలంగాణలో లేకపోవడంతోపాటు.. పార్టీలో ఆధిపత్య, అంతర్గత కుమ్ములాటలు ఎక్కువగా జరుగుతున్నాయి. మరోవైపు.. ఓడిపోయినప్పటికీ.. బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో పట్టు సడలలేదు.
మరోవైపు.. కవిత వంటి నాయకురాళ్లు దండిగా ఉన్న నేపథ్యంలో బెంగాల్ తరహా రాజకీయాలు తెలంగాణలో చేయడం సాధ్యం కాదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇక, కీలకమైన మరో విషయం.. సీఎం రేవంత్ రెడ్డిపై బలమైన యువ నేతగా, మంచి గళం ఉన్న నాయకుడిగా కూడా గుర్తింపు ఉంది. సో.. ఇవన్నీ.. ఉండగా బెంగాల్ ఫార్ములాను నమ్ముకోవడం అన్నది తెలంగాణ బీజేపీకి సాధ్యం కాకపోవచ్చని అంటున్నారు.
This post was last modified on June 29, 2026 6:09 am
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…