Movie News

నిర్మాత సుకుమార్… డ‌బ్బులు పెడ‌తారా?

సుకుమార్ అంటే ఇప్పుడు కేవ‌లం ఒక ద‌ర్శ‌కుడు కాదు.. ఒక వ్య‌వ‌స్థ‌. కేవ‌లం ద‌ర్శ‌క‌త్వానికి ప‌రిమితం కాకుండా ఆయ‌న నిర్మాత‌గానూ వ‌రుస‌గా సినిమాలు తీస్తున్నారు. ఎక్కువ‌గా త‌న శిష్యులు తీసే సినిమాల్లో ఆయ‌న నిర్మాణ భాగ‌స్వామిగా ఉంటున్నారు. ఇటీవ‌ల రిలీజైన పెద్ది సినిమా పోస్ట‌ర్ మీదా సుకుమార్ రైటింగ్స్ బేన‌ర్ ప‌డింది.

తాజాగా ఇడుపు కాయితం అనే సినిమాలోనూ ఆయ‌న నిర్మాణ భాగ‌స్వామిగా మారారు. ఈ చిత్రాన్ని బ‌న్నీ వాసు నిర్మిస్తున్నారు. త్వ‌ర‌లో మ‌రి కొన్ని చిత్రాల్లో సుకుమార్ భాగ‌స్వామి కాబోతున్నారు. ఐతే ఈ చిత్రాల‌న్నింట్లో సుకుమార్ డ‌బ్బులు పెడ‌తాడా.. ఆయ‌న ద‌గ్గ‌ర అంత డ‌బ్బులున్నాయా.. సినీ నిర్మాణం ఎంతో రిస్కీగా మారిపోయిన ఈ రోజుల్లో ఈ లెక్క‌ల మాస్టారు ఎందుకింత సాహ‌సం చేస్తారు అని అనుమానాలు క‌ల‌గ‌డం స‌హ‌జం.

ఐతే నిర్మాత‌గా సుకుమార్ లెక్క‌లు వేరు. ఆయ‌న ఏ సినిమాల్లోనూ డ‌బ్బులు పెట్ట‌రు. త‌న బ్రాండును ఆయా సినిమాల‌కు వాడుతున్నందుకు, త‌న క్రియేటివ్ ఇన్ పుట్స్ తీసుకున్నందుకు ఆయ‌న వాటా తీసుకుంటారు. అదే ఆయ‌న పెట్టుబ‌డి. సినిమా స్థాయిని బ‌ట్టి వ‌చ్చే లాభాల్లో ఆయ‌న షేర్ ఉంటుంది. చిన్న సినిమాల‌కు ఆయ‌న 30 శాతం దాకా లాభాల్లో వాటా అందుకుంటార‌ని స‌మాచారం.

అంటే వ‌చ్చిన ఆదాయంలో ప్రొడ‌క్ష‌న్ కాస్ట్ మైన‌స్ చేసి వ‌చ్చేదాంతో సుక్కుకు వాటా ఇస్తారు నిర్మాత‌లు. ఒక‌వేళ సినిమా హిట్ కాక‌పోతే సుక్కుకు ఏమీ రాదు. హిట్ట‌యితే మాత్రం లాభాల్లో వాటా వ‌స్తుంది. తాను ద‌ర్శ‌క‌త్వం వ‌హించే చిత్రాల‌కు కూడా సుకుమార్ వాటానే తీసుకుంటున్నారు. పుష్ప‌, పుష్ప‌-2 చిత్రాల‌కు ఇదే జ‌రిగింది. ఆ చిత్రాల ద్వారా ఆయ‌న భారీగా ఆదాయం అందుకున్నారు.

సుకుమార్ నిర్మాణ భాగ‌స్వామిగా ఉండే చిన్న సినిమాల విష‌యంలో ఆయ‌న‌కు ప్ర‌తిసారీ బాగానే వ‌ర్క‌వుట్ అవుతోంది. సుకుమార్ రైటింగ్స్ పేరు ప‌డ‌డంతోనే చిన్న సినిమాల‌కు ఈజీగా ఓటీటీ అవుతుంది. ప్రేక్ష‌కులు కూడా న‌మ్మ‌కంతో థియేట‌ర్ల‌కు వ‌స్తారు. త‌ద్వారా వాటికి లాభాలు ఖాయంగా వ‌స్తాయి. బుచ్చిబాబు సానా తొలి చిత్రం ఉప్పెన‌కు తన బ్రాండుతో పాటు క్రియేటివ్ ఇన్ పుట్స్ ఇచ్చినందుకు ఆయ‌న భారీ లాభం అందుకున్నారు. పెద్ది సినిమాకు కూడా ఇలాంటి స‌హ‌కార‌మే అందించ‌గా.. ఆ చిత్రం సుక్కుకు అనుకున్నంతాగా వ‌ర్క‌వుట్ కాలేద‌ని స‌మాచారం.

This post was last modified on June 29, 2026 6:05 am

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

8 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

10 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

10 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

10 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

10 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

11 hours ago