Movie News

పెద్ది OTT… తొందరపడటం లేదు

మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా నెట్ ఫ్లిక్స్ చేసుకునే ఓటిటి విండో 28 రోజులు ఉంటుంది. గుంటూరు కారం, సలార్, టిల్లు స్క్వేర్ ఈ మోడల్ లోనే నెలకే డిజిటల్ తెరల మీద ప్రత్యక్షమయ్యాయి. పుష్ప 2 లాంటి కొన్ని చిత్రాలు దానికి మినహాయింపుగా నిలిచాయి. ఇప్పుడు పెద్ది కూడా అదే దారిలో ఉంది. జూలై 2 అంటే ఇంకో రెండు రోజుల్లో పెద్ది స్ట్రీమింగ్ కానుందనే ప్రచారం సోషల్ మీడియాలో ఊపందుకున్న టైంలో విశ్వసనీయ వర్గాల నుంచి దానికి సంబంధించిన క్లారిటీ వచ్చేసింది.

పెద్ది తొందరపడటం లేదు. 42 రోజుల వ్యవధితో జూలై 16 నుంచి నెట్ ఫ్లిక్స్ లో వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే థియేటర్ రన్ దాదాపు పూర్తయిన నేపథ్యంలో ఇది మంచి నిర్ణయం అని చెప్పొచ్చు. ముందు చేసుకున్న ఒప్పందంలోనే ఈ మేరకు గ్యాప్ ఎంతనేది రాసుకున్నారట. వీకెండ్స్ వస్తే పెద్ది స్ట్రాంగ్ గానే ఉంది. నిన్న కూడా కోటిన్నర పైగా వసూలైనట్టు ట్రేడ్ రిపోర్ట్. పాతిక రోజులప్పుడు కూడా ఇంత మొత్తం అనేది ఖచ్చితంగా చిన్న విషయం కాదు.

చెప్పాలంటే ఇలాంటి స్ట్రాటజీ అందరూ అనుసరించాలి. మరీ నాలుగు వారాల గ్యాప్ ఉండటం వల్ల ప్రేక్షకులు యావరేజ్ టాక్ వచ్చిన సినిమాల కోసం థియేటర్లకు వెళ్లడం లేదు. ఎలాగూ త్వరలో ఓటిటిలో వస్తుందనే ధీమా వాళ్ళను ఆపేస్తోంది. పైగా మొదటి పది రోజులు టికెట్ రేట్ల పెంపు అమలులో ఉండటం మరో అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో ఇలా కనీసం 40 నుంచి 50 రోజుల స్పేస్ పెట్టుకోవడం డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకే కాదు ఇండస్ట్రీకీ మేలు చేసే నిర్ణయమే.

అయిదు వందల కోట్లను దాటుతుందని ఆశలు పెట్టుకున్న అభిమానులకు నిరాశ తప్పడం లేదు. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాల పెర్ఫార్మన్స్ వల్ల రెవిన్యూ తగ్గిపోయింది. ఒకవేళ ఏపీ తెలంగాణ తరహాలో అన్ని చోట్ల కలెక్షన్లు వచ్చి ఉంటే సులభంగా ఆ మార్కు అందుకునే ఛాన్స్ ఉండేది. మూడు వారాల తర్వాత అదనపు సీన్లు, కీలక మార్పులు చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం దక్కలేదు. ఇక క్లోజింగ్ నెంబర్స్ నిర్మాణ సంస్థ ఎంత ఇస్తుందనేది ఇంకో పది రోజుల్లో తేలనుంది.

This post was last modified on June 29, 2026 10:29 am

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

6 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

8 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

8 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

9 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

9 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

10 hours ago