Political News

చంద్రబాబు… అసలైన జెన్ జీ..!

ప్రస్తుత జెన్ జీ, జెన్ ఆల్ఫా వర్గానికి చెందిన యువతలానే నేనూ జెన్ జీని అంటున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. టెక్నాలజీ వినియోగంలో నేను జెన్ జీ వర్గమే అని చెప్పుకొచ్చారు. పరిపాలనకు టెక్నాలజీలు అనుసంధానం చేసే అతికొద్ది నేతలలో చంద్రబాబు నాయుడు పేరు మొదటిగా వినిపిస్తుంది.

రాజకీయాల్లో కూడా ప్రస్తుతం జెన్ జీ ట్రెండ్ నడుస్తోంది. భవిష్యత్తుని ముందుగానే ఊహించి దానికి అనుగుణంగా టెక్నాలజీని ప్రోత్సహించడంలో ఆయనకు ఆయనే సాటి. హైదరాబాదుకు ఐటీ ని తీసుకురావడంలో ఎంత కృషి చేశారో పలు సందర్భాల్లో ఆయనే వివరించారు. అదేవిధంగా అమరావతికి క్వాంటం కంప్యూటర్స్ తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. వాట్సప్ గవర్నెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వంటి వాటిని పరిపాలనలో భాగస్వామ్యం చేశారు.

జెన్ జీ ఆలోచనలకు కంటే ఆయన ఆలోచనలు వేగంగా ఉంటాయని ఈరోజు స్వయంగా చెప్పారు. మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కిష్టంశెట్టి పల్లెలో సంజీవని డిజిటల్ నెర్వ్ సెంటర్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ప్రస్తుత జెన్ జీ, జెన్ ఆల్ఫా వర్గానికి చెందిన యువతలానే నేనూ జెన్ జీని. భవిష్యత్తును ముందే ఊహించి దానికి అనుగుణంగా టెక్నాలజీని ప్రోత్సహిస్తున్నాను. ఏఐ, క్వాంటం టెక్నాలజీల్లో మన యువత నిష్ణాతులు కావాలని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

సంజీవని కార్యక్రమంలో కూడా టెక్నాలజీకి ప్రాధాన్యం ఇచ్చారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నుంచి జిల్లా ఆస్పత్రి, సూపర్ స్పెషాలిటీ కేర్ వరకూ వైద్య సేవలు అందేలా ఈ సంజీవని డిజిటల్ హెల్త్ రికార్డుల ద్వారా వ్యక్తిగత ఆరోగ్య పర్యవేక్షణ ఉంటుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి సూపర్ స్పెషాలిటీ వరకూ మొత్తం ఆరోగ్య వ్యవస్థను ఒకే డిజిటల్ వేదికపై అనుసంధానిస్తారు. సంజీవని ద్వారా డాక్టర్ అపాయింట్‌మెంట్ బుకింగ్, ఆరోగ్యంపై ఫాలోఅప్, వర్చువల్ కనెక్ట్ ద్వారా వైద్యసేవలు అందుతాయి. వైద్య రంగంలో టెక్నాలజీని అనుసంధానిస్తూ చంద్రబాబు నాయుడు ఆలోచనలు చేస్తున్నారు.

This post was last modified on June 27, 2026 9:05 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

5 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

7 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

7 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

7 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

7 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

8 hours ago