Political News

ఆ ఇద్దరూ కలిసి సాధించారు!

నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి అనుకున్న ఫలితాన్ని సాధించారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కు మార్గం సుగమం అయ్యింది. ఇదంతా జరగడానికి కేవలం రెండు రోజుల సమయం మాత్రమే పట్టింది. హైదరాబాద్ మెట్రోను స్వాధీనం చేసుకోవడంతో పాటుగా ఫేజ్ 2 పనుల కోసం తెలంగాణ సర్కారు ప్రతిపాదిస్తే.. రాజకీయ రచ్చ తర్వాత కేంద్రం కూడా తోడ్పాటు అందించింది. ఫలితమే ఫేజ్ 2కు రోడ్ మ్యాప్ సిద్ధమవుతోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కబోతోంది.

హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 కోసం తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు ఆది నుంచి పకడ్బందీగానే ముందుకు సాగింది. ఫేజ్ 1 ప్రాజెక్టును స్వాధీనం చేసుకోవడంతో పాటుగా ఫేజ్ 2 ను సొంతంగానే చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కదిలింది. లార్సెన్ అండ్ టోబ్రో (ఎల్ అండ్ టీ) నుంచి ఫేజ్ 1 ను స్వాధీనం చేసుకునేందుకు అవసరమైన నిధులను ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ ఎఫ్ సీ) నుంచి రుణాన్ని కూడా సాదించింది. అయితే ఈ రుణం ఆలస్యం కావడంతో రేగిన రచ్చ.. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిల మధ్య వాగ్యుద్ధానికి దారి తీసింది. ఈ యుద్ధం కూడా మంచి ఫలితాన్నే ఇచ్చిందని చెప్పాలి.

మెట్రోపై నెలకొన్న రచ్చకు ముగింపు పలికే దిశగా సాగిన రేవంత్, కిషన్ రెడ్డిలు… సోమవారం నుంచి కలిసి ఢిల్లీలో చక్రం తిప్పారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన రేవంత్ రెడ్డి సోమవారం రాత్రి కిషన్ రెడ్డితో కలిసి రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రోపై వారి మధ్య కీలక చర్చ జరిగింది. రేవంత్ కాంగ్రెస్ అయినా.. కిషన్ రెడ్డి బీజేపీ అయినా… పార్టీలను పక్కనపెట్టి తన వద్దకు వచ్చిన ఆ ఇద్దరిని చూసి వైష్ణవ్ కూడా వారికి చేయందించారు. హైదరాబాద్ మెట్రో విస్తరణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని ఈ సమావేశంలో చర్చించారు.

సోమవారం రాత్రి పొద్దుపోయేదాకా ఈ సమావేశం జరగగా… మంగళవారం ఉదయమే రేవంత్, కిషన్ రెడ్డిలు కలిసి అశ్వనీ వైష్ణవ్ తో మరోమారు భేటీ అయ్యారు. ఈ సారి ఆ ఇద్దరు కాస్తా ముగ్గురికి పెరిగింది. వారు ముగ్గురూ కలిసి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వద్దకు వెళ్లారు. హైదరాబాద్ మెట్రో విస్తరణపై ఆయనతో చర్చించిన ఆ ముగ్గురు… కేంద్ర పట్టణాభివృద్ధి శాఖనూ ఒప్పించేశారు. ఇంకేముంది… హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 విలువ నిర్ధారణ, ఫేజ్ 2 సమగ్ర నివేదిక రూపకల్పనకు ఆమోద ముద్ర పడిపోయింది.

నివేదిక రూపకల్పనను ఎస్భీఐ క్యాప్స్ కు అప్పగించేందుకు ఏకగ్రీవ నిర్మాణం తీసుకోగా… ఆ పనిని కూడా అక్కడికక్కడే ముగించేశారు. ఇక ఈ అధ్యయనంలో ఎస్బీఐ కార్ప్ కు సహకారం అందించేందుకు కేంద్రం ప్రభుత్వం నుంచి ఓ అధికారి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరో అధికారిని ఎంపిక చేశారు. నివేదిక తయారీని వేగవంతం చేయడంతో పాటుగా ఎస్బీఐ క్యాప్స్ కు అవసరమైన సహకారాన్ని అందించడం వీరి బాధ్యతగా నిర్దేశించారు. వెరసి రాజకీయాలు పక్కనపెట్టేసిన రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డిలు హైదరాబాద్ మెట్రో మలిదశకు మార్గం సుగమం చేశారు.

This post was last modified on June 23, 2026 8:16 pm

Share

Recent Posts

నానీనే స‌వాల్ చేస్తున్న చిన్న హీరో

సంక్రాంతి, ద‌స‌రా లాంటి పెద్ద పండుగ‌ల‌ను ప‌క్క‌న పెడితే.. ఒక పెద్ద సినిమా రిలీజ‌వుతున్న‌పుడు చిన్న సినిమాలు పోటీలో ఉండ‌డం…

1 hour ago

ఆ భూములన్నీ తన కష్టార్జితమే అన్న కవిత!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా బుధవారం సాయంత్రం అసెంబ్లీలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబానికి చెందినవారు, ఆయన పార్టీకి…

1 hour ago

ఇక్కడ అమ్మాయి సుప్రియకు అదిరిపోయే పదవి!

ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…

3 hours ago

సంబరాలు అంత సాహసం చేస్తుందా

సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…

3 hours ago

కేసీఆర్ ఫ్యామిలీ భూముల లెక్క చూస్తే షాకే!

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…

3 hours ago

ఇలాంటి కొడుకులు కూడా ఉంటారు..

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…

4 hours ago