ప్రతి సంవత్సరం విజయ్‌కి స్పెషల్ పిక్‌తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఆయన్ని అన్ ఫాలో అయింది. కాబట్టి ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినట్లే. ఇద్దరూ విడిపోయినట్లే అని.. నిన్నట్నుంచి సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఐతే తన గురించి ఇంత రచ్చ జరుగుతుంటే ఒక రోజంతా సైలెంటుగా ఎంజాయ్ చేస్తూ ఉందో ఏమో కానీ.. మంగళవారం ఆమె అన్ని అనుమానాలకూ తెరదించేసింది.
దగ్గరుండి విజయ్‌తో కేక్ కట్ చేయించి తన పుట్టిన రోజు వేడుకను నిర్వహించడమే కాక.. దానికి సంబంధించి ఒక అందమైన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది త్రిష. అన్నిటికీ అర్హుడైన వ్యక్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ ఈ ఫొటోకు క్యాప్షన్ కూడా జోడించింది త్రిష. ఇది సోమవారం విజయ్ బర్త్ డే సందర్భంగా తీసిన ఫొటోలాగే ఉంది.
సీఎంగా సూటు బూటులో కనిపిస్తున్న విజయ్ చాన్నాళ్ల తర్వాత క్యాజువల్ లుక్‌లో కనిపించిన ఫొటో కావడం.. పైగా సోషల్ మీడియా రూమర్లకు చెక్ పెడుతూ షేర్ చేసిన ఫొటో కావడంతో ఇది వెంటనే వైరల్ అయిపోయింది.
తన భార్య సంగీత నుంచి విడాకులు తీసుకునే విషయంలో విజయ్ వెనక్కి తగ్గాడని ఇటీవల వార్తలు రాగా.. మరోవైపు తాను ఖాళీ చేసిన తిరుచిరాపల్లి నుంచి ఇంతకుముందు వార్తలు వచ్చినట్లు త్రిషను కాకుండా వేరొకరిని నిలబెట్టాలని విజయ్ భావిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఇలాంటి టైంలో త్రిష విజయ్‌కి బర్త్ డే విషెస్ చెప్పకపోవడం, ఇన్‌స్టాలో అన్ ఫాలో అయిందనే ప్రచారం వాళ్లిద్దరూ విడిపోయారనే అనుమానాలకు బలం చేకూర్చింది. కానీ ఒక పోస్టుతో అన్నింటికీ చెక్ పెట్టేసింది త్రిష.
This post was last modified on June 23, 2026 8:49 pm
నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…
రణబాలినే కాదు ఇకపై తన సినిమాలు దేనికీ తన పరిధి మేరకు టికెట్ రేట్ల పెంపు ఉండకుండా చూసుకుంటానని విజయ్…
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిరసన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు…
ఒక ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ ఆలస్యమైనప్పుడు, వాయిదాలు పడినప్పుడు దాని గురించి రకరకాల ప్రచారాలు జరగడం మాములే. బాహుబలి…
భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న…