కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో సినిమాలు తగ్గించుకునేవాళ్లు కొందరైతే.. పూర్తిగా కెరీర్‌కు గుడ్ బై చెప్పేసేవాళ్లు ఇంకొందరు. రెండు దశాబ్దాలుగా దక్షిణాది సినిమాలో అగ్ర కథానాయికలుగా కొనసాగుతున్న నయనతార, త్రిషలిద్దరూ ఒక దశలో సినిమాలకు టాటా చెప్పేసే ఉద్దేశంలోనే కనిపించారు. కెరీర్ బాగున్న టైంలోనే వ్యక్తిగత జీవితాల్లో స్థిరపడాలనుకున్నారు.
ప్రభుదేవాను పెళ్లి చేసుకుని పూర్తిగా సినిమాలకు తెరదించేయాలని ఒక దశలో నయనతార అనుకుంది. కానీ ఆ పెళ్లి క్యాన్సిల్ అవడంతో సినిమాల్లో యథావిధిగా కొనసాగింది. మునుపటికంటే పెద్ద స్థాయికి ఎదిగింది. విఘ్నేష్ శివన్‌ను పెళ్లాడాక కూడా ఆమె జోరు తగ్గలేదు. ఇక త్రిష విషయానికి వస్తే.. వరుణ్ మణియన్ అనే నిర్మాతను పెళ్లి చేసుకుని సినిమాలకు టాటా చెప్పేయాలని ఆమె అనుకుంది. కానీ అతడితో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నాక సినిమాల్లో ఫుల్ బిజీ అయిపోవడం తెలిసిందే.
వీరి బాటలోనే మలయాళ భామ నివేథా పెతురాజ్ కూడా.. నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నాక కెరీర్లో ఫుల్ బిజీ అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆమె మూడేళ్ల ముందు ఒక దుబాయ్ బేస్డ్ బిజినెస్‌మ్యాన్‌తో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే పెళ్లి అన్నారు కానీ.. అది జరగలేదు. కొన్ని నెలల ముందే ఆమె తన నుంచి విడిపోతున్నట్లు ప్రకటించింది. అప్పటికే ‘సింగ్ గీతం’ చిత్రంలో కీలక పాత్రకు ఎంపికైంది నివేథా. ఇటీవలే విడుదలైన ఆ చిత్రం మంచి స్పందన తెచ్చుకుంది. నివేథా చేసింది తక్కువ నిడివి ఉన్న పాత్రే అయినా ప్రశంసలు వచ్చాయి.
ఆ సినిమా రిలీజయ్యే టైంకే బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త చిత్రంతో పాటు విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’లోనూ అవకాశం అందుకుంది నివేథా. ఇవి తన కెరీర్లో అతి పెద్ద అవకాశాలుగా చెప్పొచ్చు. ఇప్పుడు నివేథా చేతికి ఇంకో మంచి సినిమా వచ్చింది. రామ్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న థ్రిల్లర్ మూవీలో నివేథానే కథానాయికగా ఎంపికైందట. మొత్తానికి నిశ్చితార్థం రద్దు చేసుకున్నాక సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకెళ్తున్న హీరోయిన్ల జాబితాలో నివేథా కూడా చేరిందన్నమాట.
This post was last modified on June 23, 2026 5:28 pm
ఒక ఇంట్లో దొంగ పడ్డాడు. నగలు, నట్రా దోచుకున్నాడు. యజమాని ... ఆ దొంగను గుర్తించాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.…
టీ20ల్లో 249 పరుగులు చేసినా గెలవలేకపోతే బౌలింగ్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియాకు అదే…
అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భారత ఐటీ కంపెనీలకు కొత్త సమస్య వచ్చిపడింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో సహా ఎనిమిది…
తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్రంగా వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి చేస్తున్న రాజకీయాలపై ఆసక్తికర…
ప్రస్తుతం విదేశీ విద్యకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఏపీ సహా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి అమెరికా, ఉక్రెయిన్, రష్యా సహా..…
టీ20 మ్యాచ్‌లో 249 పరుగులు చేస్తే గెలుపు దాదాపు ఖాయమని అనుకుంటాం. కానీ వెస్టిండీస్ బ్యాటర్లు ఆ అంచనాలను తలకిందులు…