జూన్ 21.. ప్రపంచ యోగా దినోత్సవం. భారత్ లో రూపుదిద్దుకున్న ఈ ప్రాచీన యోగా విద్యను యావత్తు ప్రపంచం ఆనుసరించడం మొదలుపెట్టి ఇది 12వ ఏడాది. 12 ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం విశ్వవ్యాప్తంగా ఎక్కడికక్కడ యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఏపీలోని విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ప్రముఖ యోగా గుచువు రాందేవ్ బాబా ఆధ్వర్యంలో జరగగా… ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేశ్ లు స్వయంగా పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా రాందేవ్ బాబా పక్కనే యోగాసనాలు వేసిన చంద్రబాబు… రాందేవ్ కు ఏమాత్రం తగ్గని రీతిలో యోగాసనాలు వేసి అందరినీ అబ్బురపరిచారు.
చంద్రబాబు వయస్సు 76 ఏళ్లు. ఈ వయసులో ఇంకొకరైతే.. మంచానికి పరిమితం కాకున్నా యాక్టివ్ గా అయితే కనిపించరు. వయసురీత్యా దండెత్తే రోగాలు, శారీరక రుగ్మతలతో సతమతమవ్వడం ఖాయం. అయితే ఈ వయసులోనూ చంద్రబాబు యువతకు ఏమాత్రం తీసిపోని రీతిలో… ఇంకా చెప్పాలంటే ఈ కాలం యువకులను మించి చంద్రబాబు యమా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. 4 దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో కొనసాగుతున్న చంద్రబాబు…ఏనాడూ విశ్రాంతి తీసుకుని ఎరగరనే చెప్పాలి. తనదైన శైలి దినచర్యతో నిత్యం చురుకుగా కనిపించే చంద్రబాబు… నేటి తరం యువతకు నిజంగానే ఆదర్శమని చెప్పక తప్పదు.
ఇక ఆదివారం నాటి యోగాసనాల విషయానికి వస్తే… ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న యోగా దినోత్సవాల్లో చంద్రబాబు స్వయంగా పాలుపంచుకున్నారు. వేలాది మంది హాజరైన ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన వేదిక మీద.. రాందేవ్ బాబా పక్కనే వేదిక మీదే చంద్రబాబు ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా ఇన్ స్ట్రక్టర్ చెబుతున్న విషయాలను ఆసక్తిగా గమనిస్తూ.. ఆ మేరకే ఆసనాలు వేసిన చంద్రబాబు.. యోగా గురువు రాందేవ్ బాబాకు ఏమాత్రం తీసిపోని విధంగా ఆసనాలు వేశారు. ఒకటి రెండు ఆసనాల్లో బాబా కంటే బాబే మెరుగ్గా ఆసనాలు వేశారని చెప్పాలి.
మరకట ఆసనం, సేతు బంధాసనం, ఉత్తర పాదాసనం, పవన ముక్తాసనం ఇలా ఆసనాల పేర్లు వినిపిస్తుంటే..వాటికి తగ్గట్టుగా ఏమాత్రం ఆలస్యం లేకుండానే చంద్రబాబు ఆసనాలు వేశారు. కొన్ని ఆసనాల సమయంలో ఆయా ఆసనాలు వేసేందుకు చాలా మంది ఇబ్బంది పడ్డా.. చంద్రబాబు మాత్రం యోగాలో సమగ్ర పట్టు కలిగిన వారిలా ఆసనాలను పక్కాగా వేశారు. కాళ్లను గాల్లోకి పైకి లేపడంలో చంద్రబాబు ఈజీనెస్ చూసి అంతా ఆశ్చర్యానికి లోనయ్యారని చెప్పక తప్పదు. 76 ఏళ్ల వయసులోనూ చంద్రబాబు ఇంత చక్కగా ఆసనాలు వేసిన తీరు నిజంగానే ఆసక్తి రేకెత్తించింది. ఇక లోకేశ్ కూడా తన తండ్రి చంద్రబాబు మాదిరే యోగాసనాల్లో లీనమైపోయిన తీరు ఆకట్టుకుంది.
This post was last modified on June 21, 2026 12:11 pm
అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…
టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…
అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…