తెలంగాణలో ప‌వ‌న్‌… కిక్కిరిసిన అభిమానులు

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. తెలంగాణ‌లోని హ‌నుమకొండ‌లో ప‌ర్య‌టించారు. ఢిల్లీ నుంచి నేరుగా హైద‌రాబాద్‌కు చేరుకున్న ఆయ‌న‌.. అక్క‌డి నుంచి రోడ్డు మార్గంలో వ‌రంగ‌ల్ జిల్లాలోని హ‌నుమ‌కొండ‌కు వ‌చ్చారు. త‌న‌ను ఎన్నోళ్ల నుంచో చూడాల‌ని క‌ల‌వ‌రిస్తున్న 17 ఏళ్ల బాలుడిని ప‌వ‌న్ ప‌రామ‌ర్శించారు. హ‌నుమ‌కొండ‌లోని హ‌నుమాన్‌న‌గ‌ర్‌కు చెందిన నిరంజన్‌(15) కొన్నాళ్లుగా న‌రాల స‌మ‌స్య‌ను ఎదుర్కొంటూ.. మంచానికే ప‌రిమితం అయ్యాడు.

అత‌నికి ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటే.. మ‌హా పిచ్చి. ఈ నేప‌థ్యంలో త‌న చివ‌రి కోరిక‌.. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో ఒక్క‌సారైనా మాట్లాడ‌డ‌మేన‌ని.. ప‌వ‌న్ చేతిలో చేయి వేసి.. ప‌ల‌క‌రించ‌డ‌మేన‌ని చెప్పిన‌ట్టు నిరంజ‌న్ త‌ల్లి చెబుతున్నారు. ఈ విష‌యం తెలిసిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. త‌న అభిమానిని ప‌ల‌కించి.. ప‌రామ‌ర్శించేందుకు నేరుగా హ‌నుమకొండ‌కు వెళ్లారు. బాలుడికి అందుతున్న వైద్యాన్ని.. ప్ర‌స్తుత ఆరోగ్య ప‌రిస్థితిని తెలుసుకున్నా రు. ఏ అవ‌స‌రం ఉన్నా. తాను అండగా ఉంటాన‌ని హామీ ఇచ్చారు.

ఏంటీ స‌మ‌స్య‌..

17 ఏళ్ల నిరంజ‌న్‌.. వ‌య‌సులో అలా క‌నిపించ‌డు. కేవ‌లం రెండు మూడేళ్ల పిల్లాడిలా క‌నిపిస్తాడు. ఇదే న‌రాల జ‌బ్బు అని వైద్యులు చెబుతున్నారు. కాళ్లు రెండూ ప‌నిచేయ‌వ‌ని.. అన్నం కూడా స‌రిగా తిన‌లేడ‌ని త‌ల్లి తెలిపారు. చిన్న‌వ‌య‌సులో సోకిన వ్యాధి రాను రాను మ‌రింత పెరిగింద‌న్నారు. ఎంత మంది వైద్యు ల‌కు చూపించినా న‌యం కాలేద‌ని తెలిపారు. దీంతో ప్ర‌స్తుతం మంచానికే నిరంజ‌న్ ప‌రిమిత‌మ‌య్యాయి.

ప‌వ‌న్‌ను చూసేందుకు..

తెలంగాణ‌లోని వరంగ‌ల్‌కు వ‌చ్చిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను చూసేందుకు.. ఆయ‌న‌తో క‌ర‌చాల‌నం చేసేందుకు అభిమానులు తండోప‌తండాలుగా త‌ర‌లి వ‌చ్చారు. జ‌నసేన పార్టీ కార్య‌క‌ర్త‌లు కూడా భారీగా త‌ర‌లి రావ‌డం తో పోలీసులు ప్ర‌త్యేక భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేశారు. ఎక్క‌డా ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకున్నారు. ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న ప్ర‌శాంతంగా జ‌రిగేలా ఏర్పాటు చేసిన‌ట్టు స్థానిక డీఎస్పీ తెలిపారు.