Political News

మీనాక్షికి ఊరట దక్కలేదు!

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ తో పాటు గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు షాకిచ్చింది. రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిచిన మీనాక్షి నటరాజన్ నామినేషన్ ను సాంకేతిక కారణఆలతో తిరస్కరించిన తీరును సవాల్ చేస్తూ కాంగ్రాస్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. అంతేకాకుండా ఈ వ్యవహారంలో అన్యాయం జరిగిందని భావిస్తే.. నేరుగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవాలని, ఈ విషయంలో తానేమీ జోక్యం చేసుకోలేనని కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.

మధ్యప్రదేశ్ కు చెందిన మీనాక్షి ఆ రాష్ట్రంలో ఖాళీ కానున్న మూడు రాజ్యసభ సీట్లలో ఓ సీటుకు నామినేషన్ దాఖలు చేశారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలాన్ని బట్టి చూస్తే… మీనాక్షి గెలుపు సులభమేనని చెప్పాలి. అయితే తనకు సరిపడ బలం లేకున్నా కూడా బీజేపీ తన మూడో అభ్యర్థిని బరిలోకి దించి మీనాక్షిని టెన్షన్ లో పెట్టేసింది. అంతేకాకుండా మీనాక్షి తన నామినేషన్ లో క్రిమినల్ కేసుల వివరాలు వెల్లడించలేదని రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును పరిశీలించిన రిటర్నింగ్ అదికారి… మీనాక్షి నామినేషన్ ను తిరస్కరించారు.

రిటర్నింగ్ అదికారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మీనాక్షి, కాంగ్రెస్ పార్టీలు న్యాయ పోరాటానికి దిగాయి. ముందుగా ఈసీకి ఫిర్యాదు చేసేందుకు యత్నించాయి. ఆ తర్వాత నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థికి న్యాయం చేయాలని కోరింది. ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఏమీలేదని తేల్చేసిన సుప్రీం.. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందన్న దానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తింది.

అనుకున్నట్టుగానే శుక్రవారం కాంగ్రెస్ పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు… ఎన్నికల సంఘం విధుల్లో తాను జోక్యం చేసుకోలేనని చెప్పింది. అంతేకాకుండా రిటర్నింగ్ అధికారి తీసుకున్న నిర్ణయంలోనూ తాను జోక్యం చేసుకోలేనని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ విషయంలో అన్యాయం జరిగిందని బావిస్తే.. ఈసీనే ఆశ్రయించండి అని సలహా ఇచ్చింది.

అనంతరం ఈ పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. ఇదిలా ఉంటే… సుప్రీంకోర్టు విచారణ, తీర్పు కంటే ఓ రోజు ముందుగానే అంటే… గురువారమే రాజ్యసభ ఎన్నికల ఫలితాలను ఈసీ ప్రకటించింది. మీనాక్షి సీటులో ఒకే అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి విజయం సాదించినట్లుగా ప్రకటించడం గమనార్హం.

This post was last modified on June 12, 2026 3:04 pm

Share

Recent Posts

బ్లడీ రోమియోకి లెక్కలు కుదురుతున్నాయి

మాస్ మార్కెట్ ని మరింత బలపరుచుకునే ఉద్దేశంతో నాని ఏరికోరి చేసిన ది ప్యారడైజ్ ఫైనల్ ఫలితం ఏంటనేది ఇంకా…

5 hours ago

డ్రాగన్ మాట మీద నిలబడితే చాలు

ఆ మధ్య షూటింగ్ లో ప్రమాదానికి గురైన జూనియర్ ఎన్టీఆర్ కొన్ని వారాల విశ్రాంతి తర్వాత పూర్తిగా రికవర్ అయ్యాడు.…

5 hours ago

బలహీనపడటాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు

కీలకమైన వీక్ డేస్ పరీక్షలో ప్యారడైజ్ తడబడుతోంది. మొదటి నాలుగు రోజులు ఆదివారం దాకా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడిన…

6 hours ago

ఏపీలో లిక్కర్ క్వాలిటీ చెకింగ్ కు క్యూఆర్ కోడ్!

2019-24 మధ్య జగన్ జమానాలో ఏపీలో నాణ్యమైన మద్యం కరువైన సంగతి తెలిసిందే. తన మంత్రులు, అనుయాయులకు సంబంధించిన డిస్టిలరీల…

8 hours ago

అప్పుడు అనారోగ్యం గుర్తు లేదా అంబటి?

ఏపీ లిక్కర్ రవాణా కుంభకోణం కేసు దర్యాప్తునకు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఏవో కారణాలు చెప్పి…

8 hours ago

తేజ సజ్జ తెలివికి ఇదే నిదర్శనం

యూత్ హీరోలు ప్లానింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఆర్థికంగా ఏమో కానీ కెరీర్ పరంగా ఇబ్బందులు చూడాల్సిన పరిస్థితులు ఇండస్ట్రీలో…

8 hours ago