Movie News

డ్రాగన్ మాట మీద నిలబడితే చాలు

ఆ మధ్య షూటింగ్ లో ప్రమాదానికి గురైన జూనియర్ ఎన్టీఆర్ కొన్ని వారాల విశ్రాంతి తర్వాత పూర్తిగా రికవర్ అయ్యాడు. తాజాగా జరిగిన డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అతిథిగా రావడం ద్వారా రాజమౌళి ఫ్యామిలీతో తనకున్న అనుబంధాన్ని మరోసారి చాటడంతో పాటు, అభిమానుల టెన్షన్ కు పూర్తిగా తెరవేస్తూ తనెంత ఆరోగ్యంగా ఉన్నాడో పూర్తి క్లారిటీ ఇచ్చేశాడు. ఇప్పుడు అందరి దృష్టి వచ్చే ఏడాది విడుదల కానున్న డ్రాగన్ మీద ఉంది. అయితే మాట మీద ఉంటుందానే అనుమానాలు లేకపోలేదు.

ఇవాళ మైత్రి రవిశంకర్ మాట్లాడుతూ డ్రాగన్ వచ్చే ఏడాది జూన్ 11 వస్తుందని మరోసారి చెప్పారు. ఫ్యాన్స్ సంబరంగా జేజేలు కొట్టారు. వినడానికి బాగానే ఉంది కానీ నిజంగా దానికి కట్టుబడి ఉంటారా అంటే ఎవరూ ఎస్ అని చెప్పలేరు. ఎందుకంటే ఇంతకన్నా కాన్ఫిడెంట్ గా ప్రభాస్ ఫౌజీ డిసెంబర్ 3 వస్తుందని చెప్పారు. పోస్టర్లు వదిలారు. ఎప్పటికప్పుడు పక్కాని నొక్కి వక్కాణిస్తూ వచ్చారు. తీరా చూస్తే తర్వాత తప్పుకున్నారు. కొత్త డేట్ ఏంటో ఇంకా క్లారిటి లేదు.

ఫౌజీ తీసిన మైత్రినే డ్రాగన్ ప్రొడ్యూసర్లు కావడం గమనించాల్సిన విషయం. అయితే ఈ వాయిదాల పర్వం కేవలం ఈ బ్యానర్ కే పరిమితం కాలేదు. అన్ని ప్యాన్ ఇండియా సినిమాలది ఇదే కథ. అసలే ప్రశాంత్ నీల్ పర్ఫెక్షన్ కోసం తపించిపోయే టైపు. డ్రాగన్ విషయంలో రాజీ పడేందుకు ససేమిరా అంటారు. అలాంటప్పుడు జూన్ 11 థియేటర్లలో డ్రాగన్ చూడగలిగితే అభిమానులు అంతకన్నా కోరుకునేది ఏముంటుంది. అలా జరిగితే మంచిదే.

చేతిలో ఏడు నెలల సమయం ఉంది కాబట్టి డ్రాగన్ సరైన రీతిలో ప్లానింగ్ చేసుకుని వెళ్తే టార్గెట్ చేరుకోవడం కష్టం కాదు. అయితే అప్పటికే వారణాసి వచ్చి ఉంటుంది కనక దాని రికార్డులను అందుకోవాలంటే మాత్రం ఎక్స్ ట్రాడినరి కంటెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. డ్రాగన్ రెండు భాగాలనే ప్రచారం ముందు నుంచి నుంచి ఉంది కానీ టీమ్ అఫీషియల్ గా చెప్పడం లేదు. దురంధర్ తరహాలో కేవలం ఆరు నెలల గ్యాప్ తో డ్రాగన్ సీక్వెల్ రిలీజ్ చేసేలా షూట్ జరుగుతోందట.

This post was last modified on September 29, 2026 10:03 pm

Share

Recent Posts

బలహీనపడటాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు

కీలకమైన వీక్ డేస్ పరీక్షలో ప్యారడైజ్ తడబడుతోంది. మొదటి నాలుగు రోజులు ఆదివారం దాకా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడిన…

1 hour ago

ఏపీలో లిక్కర్ క్వాలిటీ చెకింగ్ కు క్యూఆర్ కోడ్!

2019-24 మధ్య జగన్ జమానాలో ఏపీలో నాణ్యమైన మద్యం కరువైన సంగతి తెలిసిందే. తన మంత్రులు, అనుయాయులకు సంబంధించిన డిస్టిలరీల…

3 hours ago

అప్పుడు అనారోగ్యం గుర్తు లేదా అంబటి?

ఏపీ లిక్కర్ రవాణా కుంభకోణం కేసు దర్యాప్తునకు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఏవో కారణాలు చెప్పి…

3 hours ago

తేజ సజ్జ తెలివికి ఇదే నిదర్శనం

యూత్ హీరోలు ప్లానింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఆర్థికంగా ఏమో కానీ కెరీర్ పరంగా ఇబ్బందులు చూడాల్సిన పరిస్థితులు ఇండస్ట్రీలో…

3 hours ago

‘ఇకపై వైసీపీకి క్రిస్టియన్లు ఓటు వేయొద్దు!’

వైసీపీ అధినేత జగన్ ఏపీ సీఎంగా ఉన్న 2019-24 మధ్యకాలంలో రాష్ట్రంలో క్రైస్తవ మత ప్రచారం విపరీతంగా జరిగేదని ఆరోపణలు…

4 hours ago

పైరసీ ఇష్యూ వల్ల కాగితానికి ప్రచారం

అక్టోబర్ 2 విడుదల కాబోతున్న సినిమాల్లో తెల్లకాగితం అంతో ఇంతో సౌండ్ చేస్తోంది. యూత్ ఎలిమెంట్స్ తో కోర్ట్, బ్యాండ్…

4 hours ago