Political News

బౌల‌ర్స్ మారినా.. బ్యాట్స్‌మెన్ ఓన్లీ సీబీఎన్‌: లోకేష్‌!

రాష్ట్రంలో బౌల‌ర్స్‌(ప్ర‌త్య‌ర్థులు) మారినా బ్యాట్స్‌మెన్ మాత్రం చంద్ర‌బాబు నాయుడేన‌ని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తిరుప‌తిలో జ‌రిగిన ప్ర‌భుత్వ వియోజ‌త్స‌వ స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ.. గొడ్డ‌లి పార్టీ అరాచ‌కాల‌ను ప్ర‌తి ఇంటికీ వెళ్లి.. గ‌డ‌ప‌గ‌డ‌ప‌లోనూ వివ‌రించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. 2014-19 మ‌ధ్య స్వ‌ర్ణ‌యుగం వంటి పాల‌న‌ను గ‌త ఎన్డీయే అందించింద‌న్నారు. కానీ, 2019-24 మ‌ధ్య ఒక్క‌ఛాన్స్ అంటూ వ‌చ్చిన గొడ్డ‌లి పార్టీ అరాచ‌కాలు సృష్టించింద‌ని తెలిపారు.

అరాచ‌క పార్టీని అంత‌మొందించిన ప్ర‌జ‌లు 151 మందిని 11 టీంగా మార్చేశార‌ని లోకేష్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సుస్థిర పాల‌న సాగాలంటే.. అభివృద్ది జ‌ర‌గాలంటే.. గొడ్డ‌లి పార్టీని శాశ్వ‌తంగా స‌మాధి చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. త‌న చెల్లికి అన్యాయం జ‌రిగింద‌ని న్యాయం చేయాల‌ని అన్న బాలుడిని కాల్చి చంపార‌ని, డ్రైవ‌ర్‌ను చంపి డోర్ డెలివ‌రీ చేశార‌ని.. మాస్క్ అడిగిన డాక్ట‌ర్ సుధాక‌ర్‌ను వేధించి చంపార‌ని లోకేష్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

సీబీఎన్ పాల‌న‌లో ప్రాంతాల‌కు అతీతంగా అభివృద్ధి జ‌రుగుతోంది. ల‌క్ష కోట్ల రూపాయ‌ల‌తో సీమ‌ను అభివృద్ది చేస్తున్నార‌ని తెలిపారు. చివ‌ర‌కు పులివెందుల నియోజ‌క‌వ‌ర్గానికి కూడా నీరు అందిస్తున్నార‌ని చెప్పారు. దేవుడి(తిరుమ‌ల‌)తో పెట్టుకున్న వారు ఏమ‌య్యారో చూస్తున్నామ‌ని వైసీపీ నేత‌ల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ అరాచ‌క పాల‌న మ‌రోసారి రాకూడ‌ద‌ని చెప్పారు. దీనికిగాను పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయకులు న‌డుం బిగించాల‌ని సూచించారు. ఇంటింటికీ వెళ్లి ప్రాచ‌రం చేయాల‌న్నారు.

ఆనాడు టీడీపీ జెండా లేకుండా చేస్తామ‌న్నార‌ని.. వైనాట్ 175 అంటూవిర్ర‌వీగార‌ని లోకేష్ అన్నారు. కానీ, ప్ర‌జలు వారిని టీం-11కు ప‌రిమితం చేస్తూ తీర్పిచ్చార‌ని తెలిపారు. రాజ‌కీయాల్లో చంద్ర‌బాబు విరాట్ కోహ్లీ అని.. బౌల‌ర్స్ మారినా.. బ్యాట్స్‌మెన్ ఆయ‌నేన‌ని లోకేష్ అన్నారు. అసెంబ్లీలో అడుగు పెట్ట‌నీయ‌మ‌ని ఆనాడు వైసీపీ నాయ‌కులు చెప్పార‌ని.. కానీ, తాడేప‌ల్లి ప్యాలెస్ గోడ‌లు బ‌ద్ద‌లు కొట్టి చంద్ర‌బాబును గెలిపించిన ఘ‌న‌త ప‌సుపు సైన్యానిద‌ని లోకేష్ చెప్పారు.

This post was last modified on June 12, 2026 3:12 pm

Share

Recent Posts

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

25 minutes ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

32 minutes ago

తండ్రిపై ప్రేమ‌.. శ‌వాన్ని నాలుగేళ్లుగా.. !

తల్లిదండ్రుల‌పై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వ‌ర‌కు ఉండాల్సిందే. కానీ, జ్యాత‌స్య‌హి ధ్రువో మృత్యు.. అన్న‌ట్టుగా కాలం…

36 minutes ago

దుబాయ్ విమానంలో ఫైటింగ్… 180 మందిని కాపాడిన ఇండియన్ కెప్టెన్

భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…

57 minutes ago

405 అయినా సరే… తగ్గేదే లే!!

వన్డేల్లో 405 పరుగులు చేసిన తర్వాత కూడా ఓడిపోతామని వెస్టిండీస్ ఊహించి ఉండదు. గువాహటిలో ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిపోయారు.…

1 hour ago

సిరిసిల్ల కాదు.. ఉరిసిల్ల‌.. రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి

టార్గెట్ కేటీఆర్.. ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న…

2 hours ago