Political News

‘రామన్న, జగనన్న దోస్తులయిన్రు’

తెలంగాణలో 2018, ఏపీలో 2019 ఎన్నికలకు ముందు వైసీపీ, బీఆర్ఎస్ అలయ్ బలయ్ అంటూ ఒకరికి ఒకరు మద్దతు ఇచ్చి పుచ్చుకున్న సంగతి తెలిసిందే. మాజీ సీఎం కేసీఆర్ ను పితృసమానుడిగా చూసిన జగన్…కేటీఆర్ ను సోదర సమానుడిగా భావించి రాజకీయం నడిపారన్న విషయం ప్రజలందరికీ తెలుసు. అదే మాదిరిగా 2023లో తెలంగాణలో, 2024లో ఏపీలో జరిగిన ఎన్నికల్లో సైతం జగన్, కేటీఆర్ లు భాయిభాయి అంటూ ముందుకు సాగినా ఫలితం వారికి అనుకూలంగా రాలేదన్నది వేరే విషయం. అయితే, ఈ విషయం ఏపీ, తెలంగాణ ప్రజలందరికీ తెలిసినా సరే…కేటీఆర్ సోదరి కవిత మాత్రం తనకు ఇప్పుడే తెలిసింది అంటూ అవాక్కయిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

బీఆర్ఎస్, కాంగ్రెస్…ఈ రెండు పార్టీల నాయకులు కలిపి 5 వేల కోట్ల రూపాయల విలువైన 580 ఎకరాల భూమిని 100 మంది రైతుల నుంచి కొట్టేస్తున్నారని కవిత షాకింగ్ ఆరోపణలు చేశారు. అంతేకాదు, బంది పోట్లు కూడా పగటి పూట దొంగతనం చేయరని, ఇది అన్యాయం అని అన్నారు. ఆ భూమిలో ఓ బీఆర్ఎస్ నాయకుడికి సంబంధించిన వెంచర్ కు మరో పెద్ద బీఆర్ఎస్ నేత అండ ఉందని ఆరోపించారు. ఆ తర్వాత ఓ పత్రికకు సంబంధించిన ఒక రిపోర్టర్ ఈ విషయం గురించి ఒక చిన్న వార్త రాశారని, అది పొరపాటున పబ్లిష్ అయిందని సెటైర్లు వేశారు.

అది చూసి వెంటనే సదరు రిపోర్టర్ ను మాయం చేశారని, మళ్లీ ఆ విషయం గురించి చుక్క వార్త రాలేదని అన్నారు. అదే వార్త సాక్షి పేపర్ లో వచ్చిందని రైతులు హ్యాపీగా ఫీలయ్యారని, తెల్లారి అదే సాక్షి పేపర్ లో రైతులకు వ్యతిరేకంగా వార్త రాశారని కవిత షాకింగ్ ఆరోపణలు చేశారు. ఇలా ఒక్క రోజులో రైతులకు వ్యతిరేకంగా వార్త రాయడం వెనుక ఏ శక్తులున్నాయి? ఏం సెటిల్మెంట్ జరిగింది…? అని కవిత ప్రశ్నించారు. రామన్న, జగనన్న దోస్తులయిన్రని తాను ఈ మధ్యే తెలుసుకున్నానని కవిత వ్యాఖ్యానించడం విశేషం. వాళ్లిద్దరూ దాదాపుగా పదేళ్లుగా జాన్ జిగిరీ దోస్తులన్న సంగతి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసని, కవితకు ఈ విషయం తెలియకపోవడం ఏంటని ట్రోల్ చేస్తున్నారు.

This post was last modified on September 29, 2026 7:02 pm

Share

Recent Posts

ఏపీలో లిక్కర్ క్వాలిటీ చెకింగ్ కు క్యూఆర్ కోడ్!

2019-24 మధ్య జగన్ జమానాలో ఏపీలో నాణ్యమైన మద్యం కరువైన సంగతి తెలిసిందే. తన మంత్రులు, అనుయాయులకు సంబంధించిన డిస్టిలరీల…

1 hour ago

అప్పుడు అనారోగ్యం గుర్తు లేదా అంబటి?

ఏపీ లిక్కర్ రవాణా కుంభకోణం కేసు దర్యాప్తునకు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఏవో కారణాలు చెప్పి…

1 hour ago

తేజ సజ్జ తెలివికి ఇదే నిదర్శనం

యూత్ హీరోలు ప్లానింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఆర్థికంగా ఏమో కానీ కెరీర్ పరంగా ఇబ్బందులు చూడాల్సిన పరిస్థితులు ఇండస్ట్రీలో…

2 hours ago

‘ఇకపై వైసీపీకి క్రిస్టియన్లు ఓటు వేయొద్దు!’

వైసీపీ అధినేత జగన్ ఏపీ సీఎంగా ఉన్న 2019-24 మధ్యకాలంలో రాష్ట్రంలో క్రైస్తవ మత ప్రచారం విపరీతంగా జరిగేదని ఆరోపణలు…

2 hours ago

పైరసీ ఇష్యూ వల్ల కాగితానికి ప్రచారం

అక్టోబర్ 2 విడుదల కాబోతున్న సినిమాల్లో తెల్లకాగితం అంతో ఇంతో సౌండ్ చేస్తోంది. యూత్ ఎలిమెంట్స్ తో కోర్ట్, బ్యాండ్…

3 hours ago

తెలుగు తమిళ స్టార్ కమెడియన్లు కలిస్తే

మల్టీస్టారర్లు మాములుగా స్టార్ హీరోల గురించే ఎక్కువగా వాడతాం. ఆర్ఆర్ఆర్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఉదాహరణగా చెప్పుకుంటాం. అయితే…

3 hours ago