Political News

తాడిపత్రిలో పొలిటికల్ హీట్… పెద్దారెడ్డి వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి

అనంతపురం జిల్లా తాడిపత్రిలో శుక్రవారం పొలిటికల్ హీట్ రాజుకుంది. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా టీడీపీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమవగా, మరోవైపు వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో “చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు.

రెండు వర్గాలు ఒకే రోజు పోటాపోటీ కార్యక్రమాలకు సిద్ధం కావడంతో శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని భావించిన పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఆయన నివాసం వద్దే అదుపులోకి తీసుకుని అనంతపురానికి తరలించారు.

పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ఆయన నివాసానికి చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు బలవంతంగా వాహనంలో ఎక్కించి తరలించారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. ఈ సందర్భంగా పెద్దారెడ్డి అనుచరులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకుని నిరసనలకు దిగారు. “పెద్దారెడ్డి జిందాబాద్” అంటూ నినాదాలు చేస్తూ పోలీసు వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు అదనపు బలగాలను మోహరించారు.

అనంతపురానికి తరలించిన అనంతరం కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎస్పీ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. శాంతియుతంగా నిరసన కార్యక్రమం నిర్వహించకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు. పోలీసులు అధికార పార్టీ నేతల ఒత్తిడికి లోనై వ్యవహరిస్తున్నారని, ముఖ్యంగా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సూచనల మేరకే తనను అడ్డుకున్నారని ఆరోపించారు

ఇదే సమయంలో టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా పెద్దారెడ్డి నివాసానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని భావించిన పోలీసులు ఆయనను, అనుచరులను మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. పోలీసులు అనుమతించకపోవడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి ఇంటి సమీపంలోని రోడ్డుపైనే కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. కొంతసేపు అక్కడే కొనసాగిన హైడ్రామా అనంతరం పోలీసులు ఆయనకు పరిస్థితిని వివరించి, నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు.

తాడిపత్రి పట్టణమంతా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కీలక కూడళ్లు, ప్రధాన రహదారులు, రాజకీయ నేతల నివాసాల వద్ద అదనపు భద్రత కల్పించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.

This post was last modified on June 12, 2026 12:16 pm

Share

Recent Posts

పోటీ హడావిడి… నిలుస్తుందా గరివిడి

దసరా పండగ బాక్సాఫీస్ ఈసారి వైరెటీగా కనిపిస్తోంది. భీభత్సమైన హైప్ ఉండాల్సిన జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఊపందుకుంటుండగా,…

54 minutes ago

విజయ్ తో చంద్రబాబు ఏం చర్చించారు?

తమిళనాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్‌.. మంగ‌ళ‌వారం సాయంత్రం విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టించేందుకు వ‌చ్చారు. తొలుత క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యాన్ని సంద‌ర్శించుకున్న ఆయ‌న‌.. అనంత‌రం..…

2 hours ago

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

4 hours ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

4 hours ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

4 hours ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

4 hours ago