ట్రూ అప్ అంటే తెలుసు కదా. విద్యుత్ వినియోగంలో వినియోగదారులపై ఆయా ప్రభుత్వాలు ఎప్పుడో వాడిన విద్యుత్ కు… చాలా కాలం తర్వాత వసూలు చేసే అధిక చార్జీలు. ట్రూ అప్ అమలు చేస్తున్నారంటే… మనం గతంలో వాడిన విద్యుత్ పై పెంచిన బిల్లులను ప్రస్తుత వినియోగంతో కలిపి కట్టడమన్నమాట. ఏపీలో వైసీపీ హయాంలో ఐదేళ్ల వ్యవధిలోనే ఏకంగా 9 సార్లు ట్రూ అప్ చార్జీలను వసూలు చేశారు. మరి కూటమి రెండేళ్ల పాలనలో ఇది అమలు అయ్యిందా? అంటే… లేదనే చెప్పాలి. ట్రూ అప్ మాటెత్తని కూటమి.. ఏకంగా ట్రూ డౌన్ వరాలను ప్రజలకు అందించింది.
అయినా ట్రూ డౌన్ అంటే ఏమిటన్న విషయానికి వస్తే… ట్రూ అప్ అంటే చార్జీల పెరుగుదల కదా. అలాగే ట్రూ డౌన్ అంటే విద్యుత్ చార్జీల తగ్గుదల అన్నమాట. గతంలో మనం వినియోగించిన విద్యుత్ కు అప్పుడే బిల్లులు కట్టి ఉంటాం కదా. నాడు మనం కట్టిన బిల్లులు ఎక్కువని బావించిన కూటమి సర్కారు… ఆ బిల్లులను తగ్గిస్తూ ట్రూ డౌన్ ను అమలు చేస్తోంది. అంటే… అప్పుడు మనం కట్టిన అధిక బిల్లులను ఇప్పుడు మనం వాడిన విద్యుత్ బిల్లులో నుంచి తక్గిస్తారన్న మాట. ప్రస్తుతం యూనిట్ కు రూ.13 పైసల చొప్పున ట్రూ డౌన్ చార్జీలను అమలు చేస్తున్నట్లు ఏపీ ఇందన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు.
ట్రూ అప్ పేరిట ప్రజల నుంచి ఎప్పుడో వాడిన విద్యుత్ కు ఆ తర్వాత అధిక బిల్లులంటూ వసూలు చేసిన చరిత్ర వైసీపీది అయితే… ప్రజలు ఎప్పుడో వాడిన విద్యుత్ కు అదిక బిల్లులు చెల్లించారని భావించి ఇప్పుడు బిల్లులు తగ్గిస్తున్న చరిత్ర కూటమిదని గొట్టిపాటి చెబుతున్నారు. అంతేకాకుండా కూటమి రెండేళ్ల పాలనలో ఒక్కసారి కూడా విద్యుత్ బిల్లులు పెరగలేదన్న విషయాన్ని ప్రస్తావించిన మంత్రి…రానున్న మూడేళ్లలోనూ విద్యుత్ చార్జీలను పెంచబోమంటూ శుక్రవారం సంచలన ప్రకటన చేశారు.
ఒక్క విద్యుత్ బిల్లుల్లోనే ఈ మేర మార్పులను తీసుకువచ్చిన కూటమి… సంక్షేమ పాలన అందించిందని చెప్పక తప్పదు కదా అని కూడా గొట్టిపాటి లాజిక్ తీశారు. కూటమి పాలనకు రెండేళ్లు పూర్తి అయిన నేపథ్యంలో ఓ వైపు వెన్నుపోటుకు రెండేళ్లు అంటూ వైసీపీ ఆందోళనలకు దిగిన శుక్రవారమే మంత్రి గొట్టిపాటి.. ట్రూ అప్ నుంచి ట్రూ డౌన్ అంటూ వివరాలు వెల్లడించి విపక్షానికి షాక్ ఇచ్చారని చెప్పాలి. ఐదేళ్లలో రేట్టు 9 సార్లు పెరిగితే… గడచిన రెండేళ్లలో చార్జీలను పెంచకపోవడంతో పాటుగా ఎప్పుడో వాడిన విద్యుత్ కు అధిక చార్జీలు వసూలు చేశారంటూ వినియోగదారులకు ట్రూ డౌన్ పేరిట చార్జీలను తగ్గించడం నిజంగానే కూటమి సంక్షేమ పాలనకు నిదర్శనమని చెప్పక తప్పదు.
This post was last modified on June 12, 2026 11:37 am
ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…
వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…
భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1…