Political News

జగన్ వాయిస్ లో బేస్ తగ్గింది

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక బహిరంగ సభల్లో అయితే ఆయన వాయిస్ నిజంగానే సింహనాదంలా వినిపిస్తుంది. తన రాజకీయ ప్రత్యర్థులను తూలనాడే సమయంలో జగన్ వాయిస్ ఓ రేంజిలో పేలుతుంది. ఇవే మనమంతా ఇప్పటిదాకా జగన్ లో చూసిన ప్రత్యేక అంశాలు. అదేంటో గానీ… బుధవారం విశాఖ పర్యటనలో జగన్ లో ఆ ఫైర్ అంతగా కనిపించలేదని చెప్పాలి. జగన్ గొంతు జీరబోయింది. వాయిస్ లో బేస్ కనిపించలేదు. వెరసి జగన్ స్పీచ్ అంతగా ఆకట్టుకోలేదనే చెప్పక తప్పదు.

విశాఖ స్టీల్ ప్లాంట్ లో సోమవారం భారీ ప్రమాదం సంబింవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 9 మంది చనిపోగా… బాదిత కుటుంబాలను పరామర్శించేందుకు జగన్ బుధవారం విశాఖకు వెళ్లారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలను పరామర్శించిన జగన్.. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ వాయిస్ అంత గట్టిగా కనిపించలేదు. ఒకానొక సమయంలో ఆయన నోట నుంచి పదాలు చాలా లో వాయిస్ లో వినిపించాయి.

వైసీపీ హయంలో ఎల్జీ పాలిమర్స్ నుంచి విష వాయువులు వెలువడి 14 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఏమిచ్చిందన్న విషయాన్ని ప్రస్తావించిన సందర్భంగా జగన్ ఎల్జీ పాలిమర్స్ ప్రమాదాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఎల్జీ పాలిమర్స్ అన్న పేరే గుర్తుకు రానట్టుంది. దీంతో తన వెనుకే ఉన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ను అడిగి మరీ ఆ కంపెనీ పేరును గుర్తు చేసిన జగన్… నాడు చనిపోయిన వారి కుటుంబాలకు తాము రూ.1 కోటి పరిహారాన్ని ఇచ్చామని గుర్తు చేశారు.

జగన్ ఎల్జీ పాలిమర్స్ పేరు ప్రస్తావిస్తున్నప్పుడే ఆయన గొంతు జీరబోయింది. ఉన్నట్లుండి జగన్ వాయిస్ జీరో బేస్ చేరడంతో అక్కడున్న వారంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడం కనిపించింది. అయితే వాయిస్ బేస్ లెస్ గా మారినా కూడా జగన్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అయితే కాసేపటికి ఆయన గొంతు కాస్తంత గట్టిగా వినిపించినా…మరింత సేపు మాట్లాడేందుకు ఇబ్బంది పడ్డ జగన్… తన ప్రసంగాన్ని అనుకున్న సమయానికంటే ముందుగానే ముగించారు.

This post was last modified on June 11, 2026 10:52 am

Share

Recent Posts

పోటీ హడావిడి… నిలుస్తుందా గరివిడి

దసరా పండగ బాక్సాఫీస్ ఈసారి వైరెటీగా కనిపిస్తోంది. భీభత్సమైన హైప్ ఉండాల్సిన జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఊపందుకుంటుండగా,…

5 hours ago

విజయ్ తో చంద్రబాబు ఏం చర్చించారు?

తమిళనాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్‌.. మంగ‌ళ‌వారం సాయంత్రం విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టించేందుకు వ‌చ్చారు. తొలుత క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యాన్ని సంద‌ర్శించుకున్న ఆయ‌న‌.. అనంత‌రం..…

5 hours ago

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

7 hours ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

7 hours ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

8 hours ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

8 hours ago